26.8.26

ఆగస్టు 28న శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో వైభవంగా శ్రావణ ఉపకర్మ sravana upkarma


తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో శ్రావణ పౌర్ణమిని పురస్కరించుకుని ఆగస్టు 28 తేదీన శ్రావణ ఉపకర్మను ఆగమోక్తంగా, భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర్వహించనున్నారు.

ఈ సందర్భంగా ఉదయం 6.30 గంటలకు శ్రీ గోవిందరాజస్వామివారు, శ్రీ కృష్ణస్వామివారిని మంగళవాయిద్యాల నడుమ కపిలతీర్థంలోని ఆళ్వార్‌తీర్థానికి ఊరేగింపుగా తీసుకువెళతారు. అక్కడ స్వామివారికి శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం, ఆస్థానం నిర్వహిస్తారు.

అనంతరం సాయంత్రం 4.30 నుంచి 6.30 గంటల వరకు ఆర్‌.ఎస్‌. మాడ వీధిలోని శ్రీ వైఖానసాచార్యుల ఆలయంలో శ్రీ భూసమేత గోవిందరాజస్వామివారికి ఆస్థానం నిర్వహించనున్నారు.

 అనంతరం స్వామివారు తిరిగి ఆలయానికి చేరుకుంటారు.

శ్రావణ పౌర్ణమి పర్వదినాన నిర్వహించే ఈ పవిత్ర శ్రావణ ఉపకర్మలో భక్తులు పాల్గొని స్వామివారి దివ్య మంగళానుగ్రహాన్ని పొందాలని టీటీడీ కోరుతోంది.

No comments :
Write comments