రాష్ట్రం
, దేశం సుభిక్షంగా ఉండాలని, సకాలంలో వర్షాలు కురవాలని శ్రీవారిని ప్రార్థిస్తూ తిరుమల ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో టీటీడీ చేపట్టిన కారీరిష్టి యాగం, వరుణజపం, పర్జన్యశాంతి హోమాలకు ఆదివారం రాత్రి శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. ఇందులో భాగంగా గణపతి పూజ, పుణ్యాహవచనం, ప్రాయశ్చిత్త హోమం, అంకురార్పణ చేపట్టారు.
సెప్టెంబర్ 3వ తేదీ వరకు ప్రతిరోజూ ఉదయం 9 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ యాగ కార్యక్రమాలు నిర్వహిస్తారు. 32 మంది వేద, శ్రౌత, స్మార్థపండితులు యాగ కార్యక్రమాల్లో పాల్గొంటారు. చివరి రోజు మహాపూర్ణాహుతి నిర్వహిస్తారు. ధర్మగిరి వేద విజ్ఞన పీఠం ప్రిన్సిపాల్ శ్రీ కెఎస్ఎస్.అవధాని ఆధ్వర్యంలో ఈ యాగ కార్యక్రమాలు జరుగుతున్నాయి.
No comments :
Write comments