28.8.26

మంత్రాలయం శ్రీ రాఘవేంద్రస్వామివారికి శేషవస్త్రం సమర్పించిన టీటీడీ ఈవో mantralayam






కర్నూలు జిల్లా మంత్రాలయం శ్రీ గురురాఘవేంద్ర స్వామివారి 355 ఆరాధన మహోత్సవా సందర్భంగా టీటీడీ తరపున ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్ర గురువారం శేషవస్త్రం సమర్పించారు.


హైందవ సనాతన ధర్మవ్యాప్తికి కృషి చేసిన సద్గురువుల భగవత్‌ భాగవత సేవల దృష్ట్యా 2006వ సంవత్సరం నుంచి శ్రీ రాఘవేంద్రస్వామివారికి శ్రీవారి శేషవస్త్రాన్ని టీటీడీ సమర్పిస్తోంది. సాక్షాత్తు శ్రీవేంకటేశ్వరస్వామి వారి కృపతో శ్రీ రాఘవేంద్రస్వామివారు జన్మించారు. శ్రీరాఘవేంద్రస్వామి పూర్వాశ్రమ నామధేయం కూడా వెంకటనాధగా ప్రశస్తి.


ముందుగా మంత్రాలయంలోని శ్రీ రాఘవేంద్రస్వామి మఠాధిపతి శ్రీ సుబుదేంద్రతీర్థ స్వామివారికి ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్ర శేషవస్త్రాన్ని అందించారు. ఈ సందర్భంగా శ్రీ సుబుదేంద్రతీర్థ స్వామివారు ఈవోను ఆశీర్వదించారు.


ఈ కార్య‌క్ర‌మంలో టీటీడీ అధికారులు పాల్గొన్నారు.

No comments :
Write comments