తొండమాన్‌పురంలోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో పవిత్రోత్సవాలకు మంగళవారం సాయంత్రం 6 గంటలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహించారు.
పవిత్రోత్సవాల్లో భాగంగా ఆగస్టు 26న ఉదయం పవిత్ర ప్రతిష్ఠ, సాయంత్రం యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఆగస్టు 27న ఉదయం పవిత్ర సమర్పణ, సాయంత్రం చతుష్టానార్చన చేపడతారు. ఆగస్టు 28న ఉదయం మహా పూర్ణాహుతి, పవిత్ర వితరణ, స్నపన తిరుమంజనం, చక్రస్నానం నిర్వహించి పవిత్రోత్సవాలను ముగించనున్నారు. అనంతరం సాయంత్రం గ్రామోత్సవం నిర్వహిస్తారు.
యాత్రికులు, సిబ్బంది వల్ల తెలియక జరిగే దోషాల కారణంగా ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం కలగకుండా నివారించేందుకు ప్రతి ఏడాది మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలను ఆగమశాస్త్రోక్తంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.
ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ శ్రీ జ్ఞాన ప్రకాష్, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ అనిల్, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.


No comments :
Write comments