ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ శ్రీ బీఆర్ నాయుడు మాట్లాడుతూ, శ్రీ మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ జన్మస్థలమైన తరిగొండలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయ పుష్కరిణి పునరుద్ధరణకు శంకుస్థాపన చేయడం ఆనందంగా ఉందన్నారు. తిరుమలలో మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ పేరుతో అన్నప్రసాదాల వితరణ కేంద్రాన్ని ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తుచేశారు. పుష్కరిణి పునరుద్ధరణ పనులను నాణ్యతా ప్రమాణాలతో, వేగంగా పూర్తి చేసి భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు.
టీటీడీ జేఈవో డా. ఎ. శరత్ మాట్లాడుతూ, శ్రీ వేంకటేశ్వరస్వామివారిని స్మరించడంతో సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వం పెంపొందుతాయని అన్నారు. ధర్మప్రచారంలో భాగంగా ప్రతి ఒక్కరూ ఆలయాలను సందర్శించి భక్తిభావాన్ని పెంపొందించుకోవాలని కోరారు. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు శ్రీవాణి ట్రస్ట్ ద్వారా 5 వేల ఆలయాల నిర్మాణానికి టీటీడీ బోర్డు శ్రీకారం చుట్టిందని తెలిపారు. తరిగొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయ పుష్కరిణి పునరుద్ధరణ పనులను నిర్ణీత గడువులో పూర్తి చేస్తామని చెప్పారు.
పూర్ణకుంభస్వాగతం – ప్రత్యేకపూజలు
తరిగొండ ఆలయానికి చేరుకున్న టీటీడీ చైర్మన్ శ్రీ బీఆర్ నాయుడుకు అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని వేదాశీర్వచనం పొందారు. చైర్మన్, పాలకమండలి సభ్యులను శాలువాలతో సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు.
ఆలయ ప్రదక్షిణ అనంతరం శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి చిత్రపటానికి ప్రత్యేక పూజలు నిర్వహించి, పుష్కరిణి పునరుద్ధరణ అభివృద్ధి పనులకు సంబంధించిన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో పీలేరు ఎమ్మెల్యే శ్రీ నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, టీటీడీ బోర్డు సభ్యులు శ్రీ జి. భానుప్రకాశ్ రెడ్డి, శ్రీ శాంతారాం, శ్రీమతి పనబాక లక్ష్మి, శ్రీ నరేష్ కుమార్, ఎక్స్ అఫిషియో మెంబర్ శ్రీ డాలర్ దివాకర్ రెడ్డి, సీఈ శ్రీ మనోహరం, స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ ఈవో శ్రీమతి పి. వరలక్ష్మి, ఈఈ శ్రీ మల్లికార్జున ప్రసాద్, ఏఈవో శ్రీ గోపినాథ్, అధికారులు, సిబ్బంది, అర్చకులు పాల్గొన్నారు.
No comments :
Write comments