17.9.26

చిన్నశేష వాహనంపై పాండురంగని అలంకారంలో శ్రీ మలయప్ప chinna sesha vahanam






 శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండో రోజైన బుధవారం ఉదయం శ్రీ మలయప్ప స్వామివారు పాండురంగస్వామి అలంకారంలో ఐదు తలల చిన్న శేషవాహనంపై తిరుమాడ వీధులలో విహరిస్తూ భక్తులను అనుగ్రహించారు.

చిన్న‌శేష వాహనం - కుటుంబ శ్రేయస్సు

పురాణ ప్రాశస్త్యం ప్రకారం చిన్నశేషుడిని వాసుకి (నాగ‌లోకానికి రాజు)గా భావిస్తారు. శ్రీ వైష్ణవ సంప్రదాయానుసారం భగవంతుడు శేషి, ప్రపంచం శేషభూతం. శేషవాహనం ఈ శేషిభావాన్ని సూచిస్తుంది. చిన్నశేష వాహనాన్ని దర్శిస్తే కుటుంబ శ్రేయ‌స్సుతోపాటు కుండలినీయోగ సిద్ధిఫలం లభిస్తుందని ప్రశస్తి.

ఈ వాహన సేవలో తిరుమల శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్ద‌జీయ‌ర్‌స్వామి, శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్న‌జీయ‌ర్‌స్వామి, టీటీడీ ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్ర, పలువురు బోర్డు సభ్యులు, అదనపు ఈవో శ్రీ వెంకయ్య చౌదరి, సివిఎస్వో శ్రీ మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

No comments :
Write comments