22.9.26

సూర్యప్రభ వాహనసేవలో వెల్లివిరిసిన కళా వైభవం cultural programs












తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో ఏడో రోజైన సోమవారం ఉదయం నిర్వహించిన సూర్యప్రభ వాహనసేవలో దేశీయ, విదేశీ కళాకారులు తమ సంప్రదాయ కళారూపాలతో భక్తులను అలరించారు.


ఆంధ్రప్రదేశ్, అరుణాచల్‌ప్రదేశ్, మహారాష్ట్ర, కేరళ, జార్ఖండ్, పాండిచ్చేరి, కర్ణాటక రాష్ట్రాలతోపాటు జర్మనీ నుంచి కళాబృందాలు పాల్గొన్నాయి. మొత్తం 20 కళాబృందాలకు చెందిన 505 మంది కళాకారులు సూర్యప్రభ వాహనసేవలో తమ కళాప్రతిభను ప్రదర్శించారు.


జానపద, శాస్త్రీయ కళారూపాలతో కనువిందు


భరతనాట్యం వంటి శాస్త్రీయ నృత్యాలతోపాటు జానపద నృత్యాలు, కోలాటం, డ్రమ్స్, లెజిమ్, భాంగ్రా తదితర సంప్రదాయ కళారూపాలను కళాకారులు ప్రదర్శించారు.


 స్వామివారి వాహనసేవకు మరింత శోభను చేకూర్చిన ఈ కళా ప్రదర్శనలను భక్తులు ఆసక్తిగా తిలకించారు.


నాలుగు ఉత్తమ కళాబృందాలకు ఈవో సన్మానం


సూర్యప్రభ వాహనసేవలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన నాలుగు కళాబృందాలను టీటీడీ ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్ర శాలువాతో సత్కరించి అభినందించారు.


సన్మానం పొందిన కళాబృందాలు:


శ్రీ వేంకటేశ్వర సంగీత నృత్య కళాశాల – శ్రీ సి.హెచ్. జగదీష్ బృందం, భరతనాట్యం, తిరుపతి, ఆంధ్రప్రదేశ్ – 25 మంది.


అన్నమాచార్య ప్రాజెక్టు – శ్రీమతి వి. రమ్య బృందం, ఖర్గటం, పాండిచ్చేరి – 15 మంది.


హిందూ ధర్మ ప్రచార పరిషత్తు – శ్రీమతి రెబా మోడీ బృందం, మోపిన్ నృత్యం, అరుణాచల్‌ప్రదేశ్ – 10 మంది.


దాస సాహిత్య ప్రాజెక్టు – శ్రీ హెచ్. అనంత్ బృందం, భరతనాట్యం, హుబ్లీ, కర్ణాటక – 28 మంది.


భక్తిసంస్కృతుల సంగమంగా బ్రహ్మోత్సవాలు


సూర్యప్రభ వాహనసేవలో కళాకారులు ప్రదర్శించిన భక్తి, సంప్రదాయ కళారూపాలు తిరుమలలో ఆధ్యాత్మిక, సాంస్కృతిక వాతావరణాన్ని మరింత శోభాయమానం చేశాయి. దేశంలోని వివిధ ప్రాంతాలతోపాటు విదేశాల నుంచి కళాకారులు పాల్గొనడం ద్వారా శ్రీవారి బ్రహ్మోత్సవాలు భారతీయ కళా, సంస్కృతి వైభవానికి వేదికగా నిలిచాయి.

No comments :
Write comments