18.9.26

శ్రీవారి వాహనసేవల్లో కళా వైభవానికి టిటిడి ఈవో అభినందనలు ఉత్తమ ప్రతిభ కనబరిచిన నాలుగు కళా బృందాలకు సన్మానం cultural troops-





శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల సందర్భంగా భక్తులను అలరిస్తూ అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన కళాకారులను గుర్తించి, ప్రతిరోజూ త్తమ ప్రదర్శన ఇచ్చిన కళా బృందాలకు సన్మానం చేయాలని టీటీడీ ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్ర అధికారులను ఆదేశించారు.

ఇందులో భాగంగా గురువారం సింహ వాహనసేవ సందర్భంగా శ్రీవారి ఆలయ మాడ వీధుల్లో వివిధ రాష్ట్రాల కళాకారులు ప్రదర్శించిన సంప్రదాయ, జానపద కళారూపాలను ఈవో తిలకించారు. 

కళాకారుల ప్రతిభను పరిశీలించి, హిందూ ధర్మ ప్రచార పరిషత్ (HDPP), శ్రీ అన్నమాచార్య ప్రాజెక్టు, దాస సాహిత్య ప్రాజెక్టు, ఎస్.వి. కాలేజ్ ఆఫ్ మ్యూజిక్ & డాన్స్ నుంచి ఉత్తమ ప్రదర్శన ఇచ్చిన నాలుగు కళా బృందాల ప్రతినిధులను అభినందించి సన్మానించారు.

సింహ వాహనసేవలో సన్మానం పొందిన కళా బృందాలు

1. హిందూ ధర్మ ప్రచార పరిషత్ – ఉత్తమ ప్రదర్శన కళా బృందం

గౌరసూర్ చౌ, 

కళా బృందం టీం లీడర్: సృష్టి ధర్ మహతో.

బృంద సభ్యులు: 16 మంది,

జార్ఖండ్ రాష్ట్రం.

2. శ్రీ అన్నమాచార్య ప్రాజెక్టు

విభాగం: జానపద నృత్యం ,

బృంద నాయకుడు: శ్రీ సంతోష్ కుమార్ సవారియా, బృంద సభ్యులు: 25 మంది. 

జిల్లా: హిమాచల్ ప్రదేశ్ – 

3. దాస సాహిత్య ప్రాజెక్టు

బృంద నాయకురాలు:

కళ : శ్రీ రామ చరితం 

శ్రీమతి జి. సంధ్యా మూర్తి

బృందం సభ్యులు: 28 మంది. 

అనంతపురం జిల్లా

4. ఎస్.వి. కాలేజ్ ఆఫ్ మ్యూజిక్ & డాన్స్

కళా బృందం బృందం: దశావతారాలు

బృంద నాయకుడు: పూర్వ విద్యార్థి డా. పి. శరత్ చంద్ర

బృంద సభ్యులు: 28 మంది


భారతీయ కళా సంస్కృతికి తిరుమలలో విశిష్ట వేదిక

ఈ సందర్భంగా ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్ర మాట్లాడుతూ, శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన సంప్రదాయ, జానపద కళారూపాలను ప్రదర్శించేందుకు కళాకారులకు అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు.

కళాకారుల ప్రదర్శనలు భక్తుల్లో భక్తిభావాన్ని పెంపొందించడంతో పాటు, భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, కళా వైభవంపై అవగాహన కల్పిస్తున్నాయని చెప్పారు.

వాహన సేవల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన కళా బృందాలను గుర్తించి తగిన గౌరవం కల్పించడం ద్వారా రాబోయే బ్రహ్మోత్సవాల్లో కళాకారులు మరింత నాణ్యమైన, వైవిధ్యభరితమైన, ఆకట్టుకునే ప్రదర్శనలు అందించేందుకు ప్రోత్సాహం లభిస్తుందని ఈవో తెలిపారు.

భక్తుల ఆధ్యాత్మిక అనుభూతిని పెంచే సాంస్కృతిక వైభవం

శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తుల ఆధ్యాత్మిక అనుభూతిని మరింత పెంచేలా సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని ఈవో తెలిపారు. దేశంలోని వివిధ రాష్ట్రాల కళారూపాలకు తిరుమలలో వేదిక కల్పించడం ద్వారా భారతీయ సంస్కృతి, సంప్రదాయాల వైభవాన్ని భక్తులకు పరిచయం చేస్తున్నామని చెప్పారు.

శ్రీవారి వాహనసేవలతో పాటు కళాకారుల నృత్య, సంగీత, జానపద ప్రదర్శనలు తిరుమలలో భక్తి–సంస్కృతి–కళల సమ్మేళనాన్ని ఆవిష్కరిస్తున్నాయని పలువురు భక్తులు తెలిపారు

No comments :
Write comments