22.9.26

ఆలయ సిబ్బంది, అర్చకులు, వేదపారాయణదారులు, వాహన బేరర్లు, మేళం సిబ్బందికి శ్రీ జ్యోతుల నెహ్రూ దంపతుల ఆత్మీయ కానుక service staff





తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భక్తిశ్రద్ధలతో సేవలందిస్తున్న శ్రీవారి ఆలయ అర్చకులు, వేదపారాయణదారులు, వాహన బేరర్లు, మేళం సిబ్బంది, ఇతర ఆలయ సిబ్బందికి సోమవారం వస్త్ర బహుమానం అందించారు.


జగ్గంపేట ఎమ్మెల్యే, టీటీడీ బోర్డు సభ్యులు శ్రీ జ్యోతుల నెహ్రూ దంపతులు స్వచ్ఛందంగా ఈ వస్త్ర బహుమానాన్ని అందజేశారు. తిరుమల వైభవోత్సవ మండపంలో టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్. వెంకయ్య చౌదరి చేతుల మీదుగా సిబ్బందికి వస్త్రాలను అందించారు.


ఈ సందర్భంగా అదనపు ఈవో మాట్లాడుతూ, శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో అహర్నిశలు సేవలందిస్తున్న ఆలయ సిబ్బంది సేవలను గుర్తించి, వారిని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో శ్రీ జ్యోతుల నెహ్రూ దంపతులు వస్త్ర బహుమానం అందించడం అభినందనీయమన్నారు.


 స్వామివారి సేవలో భాగస్వాములవుతున్న సిబ్బందిని గౌరవించడం ద్వారా వారి సేవా స్ఫూర్తిని మరింత పెంపొందించినట్లవుతుందని తెలిపారు.


ఈ కార్యక్రమంలో సీవీఎస్వో శ్రీ కే వి మురళీకృష్ణ, శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ భాస్కర్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

No comments :
Write comments