14.9.26

తిరుమలలో శాస్త్రోక్తంగా శ్రీ వరాహస్వామి జయంతి varaha jayanthi




ఆదివరాహక్షేత్రమైన తిరుమలలోని శ్రీ భూ వరాహస్వామివారి ఆలయంలో ఆదివారం ఉదయం వరాహ జయంతి శాస్త్రోక్తంగా జరిగింది.

ఇందులో భాగంగా ఉదయం కలశస్థాపన, కలశ పూజ, పుణ్యాహవచనం చేప‌ట్టారు. అనంత‌రం వేద‌మంత్రాల న‌డుమ మూల‌వ‌ర్ల‌కు పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, ప‌సుపు, చందనంతో విశేషంగా అభిషేకం నిర్వ‌హించారు.

ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

No comments :
Write comments