1.9.26

వేగంగా సాగుతున్న వేంకటపాలెం శ్రీవారి ఆలయ నిర్మాణ పనులు venkatapalem temple


అమరావతిలోని వేంకటపాలెం శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయ నిర్మాణ పనులను టీటీడీ జేఈవో డా. . శరత్ సోమవారం పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆలయంలోని 2వ ప్రాకారం, నాలుగు గాలి గోపురాల నిర్మాణ పనుల పురోగతిని ఆయన పరిశీలించారు. పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. 

నిర్మాణ పనుల్లో ఎలాంటి అలసత్వానికి తావులేకుండా నిరంతరం పర్యవేక్షించాలని, పురోగతిపై ఎప్పటికప్పుడు నివేదికలు అందించాలని సూచించారు. పనుల సందర్భంగా ఎదురయ్యే సమస్యలను వెంటనే తన దృష్టికి తీసుకురావాలని ఆదేశించారు.

అనంతరం జేఈవో శ్రీ వేంకటేశ్వరస్వామివారిని దర్శించుకుని స్వామివారి ఆశీస్సులు పొందారు. ఆలయ అర్చకులు వేదాశీర్వచనం అందించి, తీర్థప్రసాదాలను అందించారు.

ఈ కార్యక్రమంలో టీటీడీ ఈఈ శ్రీ సురేంద్ర, సూపరింటెండెంట్ శ్రీ మల్లికార్జున, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ రామకృష్ణ, అర్చకులు, ఆలయ అధికారులు పాల్గొన్నారు.

No comments :
Write comments