1983లో ప్రారంభమైన ఆయుర్వేద కళాశాల దినదినాభివృద్ధి చెందుతూ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిందని చెప్పారు. ఆయుర్వేద వైద్యశాలలో 260 బెడ్లతో రోగులకు వైద్య సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. ఇటీవలే విష చికిత్స, న్యూట్రిషన్ విభాగం, ప్రత్యక విభాగాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. శ్రీవారి వైద్యసేవ ద్వారా తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర నుండి ఆయుర్వేద వైద్యులు విచ్చేసి రోగులకు అత్యుత్తమ వైద్య సేవలు అందించడం జరుగుతోందన్నారు.
ఔషధ మొక్కల ద్వారా జబ్బులు నయం చేసేందుకు కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఎస్సీ కాలనీలోని కుటుంబాలకు ప్రత్యేక వైద్యం, అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు. టీటీడీ ఆయుర్వేద ఫార్మసీలో దాదాపు 80 రకాల ఔషధాలను తయారు చేస్తున్నట్లు చెప్పారు. ఇక్కడ తయారు చేసే మందులు అత్యంత నాణ్యతతో తయారు చేస్తున్నట్లు చెప్పారు. టీటీడీ పంచగవ్య ఉత్పత్తులను భక్తులకు అందుబాటులో ఉంచినట్లు చెప్పారు.
ఈ కార్యక్రమంలో టీటీడీ సీపీఆర్వో డాక్టర్ టి.రవి, పీఆర్వో కుమారి నీలిమ పాల్గొన్నారు.
No comments :
Write comments