27.10.26

వైభ‌వంగా శ్రీ గోవిందరాజస్వామివారి పౌర్ణమి గరుడసేవ garuda seva


తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో  సోమవారం పౌర్ణమి గరుడసేవ వైభ‌వంగా జ‌రిగింది.

ప్రతి పౌర్ణమినాడు ఆలయంలో గరుడసేవ నిర్వహిస్తున్న విషయం విదితమే. ఇందులో భాగంగా సోమవారం సాయంత్రం 6 నుంచి రాత్రి 8 గంటల నడుమ శ్రీగోవిందరాజస్వామివారు తన ప్రియభక్తుడైన గరుడునిపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు ద‌ర్శ‌న‌మిచ్చారు.

ఈ కార్య‌క్ర‌మంలో ఆల‌య ఏఈవో శ్రీ నారాయ‌ణ చౌద‌రి, ఆలయ అర్చకులు, విశేష సంఖ్య‌లో భ‌క్తులు పాల్గొన్నారు.

No comments :
Write comments