27.10.26

తిరుమలలో వైభవంగా పౌర్ణమి గరుడసేవ వాహన సేవలో పాల్గొన్న భారత ఉపరాష్ట్రపతి garuda seva





తిరుమలలో సోమవారం రాత్రి అత్యంత వైభవంగా నిర్వహించిన పౌర్ణమి గరుడసేవలో భారత ఉపరాష్ట్రపతి గౌ|| సీ.పీ.రాధాకృష్ణన్ పాల్గొన్నారు.

కాగా రాత్రి 7 నుండి 9 గంటల వరకు సర్వాలంకార భూషితుడైన శ్రీ మలయప్ప స్వామివారు గరుడునిపై ఆలయ మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులను క‌టాక్షించారు.

గ‌రుడ వాహ‌నం – స‌ర్వ‌పాప ప్రాయ‌శ్చిత్తం

పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్యదేశాలలోనూ గరుడసేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. గరుడవాహనం ద్వారా స్వామివారు దాసానుదాస ప్రపత్తికి తాను దాసుడని తెలియజెబుతారు. అంతేగాక జ్ఞానవైరాగ్య ప్రాప్తికోరే మానవులు జ్ఞానవైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే గరుడుని దర్శిస్తే సర్వపాపాలు తొలగుతాయని భక్తకోటికి తెలియజెబుతున్నాడు.

రాత్రి 7 నుండి 9 గంటల వరకు సర్వాలంకార భూషితుడైన శ్రీ మలయప్ప స్వామివారు గరుడునిపై ఆలయ మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులను క‌టాక్షించారు.

గ‌రుడ వాహ‌నం – స‌ర్వ‌పాప ప్రాయ‌శ్చిత్తం

పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్యదేశాలలోనూ గరుడసేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది.

గరుడవాహనం ద్వారా స్వామివారు దాసానుదాస ప్రపత్తికి తాను దాసుడని తెలియజెబుతారు. అంతేగాక జ్ఞానవైరాగ్య ప్రాప్తికోరే మానవులు జ్ఞానవైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే గరుడుని దర్శిస్తే సర్వపాపాలు తొలగుతాయని భక్తకోటికి తెలియజెబుతున్నాడు.

ఈ వాహన సేవలో జీయర్ స్వాములు, టీటీడీ ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి, సి వి ఎస్ ఓ శ్రీ మురళీకృష్ణ పాల్గొన్నారు.

పౌర్ణమి గరుడ సేవలో పాల్గొన్న ఇతర ప్రముఖులలో జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి శ్రీ అనగాని సత్య ప్రసాద్, జిల్లా కలెక్టర్ డాక్టర్ వేంకటేశ్వర్,  తిరుపతి ఎస్పీ శ్రీ సుబ్బారాయుడు, పలువురు బోర్డు సభ్యులు, ఇతర ఆలయ అధికారులు కూడా ఉన్నారు.

No comments :
Write comments