28.10.26

నవంబర్ నెలలో తిరుమలలో విశేష పర్వదినాలు november festivals




నవంబర్ నెలలో తిరుమలలో నిర్వహించే విశేష పర్వదినాల వివరాలు ఇలా ఉన్నాయి.

•  నవంబర్ 2వ తేదిన తిరుమల నంబి ఉత్సవారంభం.

•  నవంబర్ 4వ తేదిన శ్రీ మనవాళ మహామునుల ఉత్సవారంభం.

•  నవంబర్ 8వ తేదిన శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానం.

•  నవంబర్ 11వ తేదిన తిరుమల నంబి శాత్తుమొర.

•  నవంబర్ 13వ తేదిన నాగుల చవితి, తిరుమల శ్రీవారి పెద్దశేష వాహనం, శ్రీమనవాళ మహామునుల శాత్తుమొర.

•  నవంబర్ 14వ తేదిన సేనైమొదలియార్ వర్ష తిరు నక్షత్రం.

•  నవంబర్ 15న శ్రీవారి పుష్ప యాగానికి అంకురార్పణ, తిరుమంగైయాళ్వార్ వర్ష తిరు నక్షత్రం.

•  నవంబర్ 16వ తేదిన శ్రీవారి పుష్ప యాగం, అత్రి మహర్షి వర్ష తిరు నక్షత్రం, పిళ్లై లోకాచార్య వర్ష తిరు నక్షత్రం, పోయ్ గై ఆళ్వార్ వర్ష తిరు నక్షత్రం.

•  నవంబర్ 19 వ తేదిన యాజ్ఞవల్క్య జయంతి.

•  నవంబర్ 21వ తేదిన కైశిక ద్వాదశి ఆస్థానం, శ్రీ చక్రతీర్థ ముక్కోటి.

•  నవంబర్ 24వ తేదిన శ్రీవారి ఆలయంలో కార్తీక దీపోత్సవం, తిరుమంగైయాళ్వార్ శాత్తుమొర.

•  నవంబర్ 25వ తేదిన తిరుప్పాణాళ్వార్ వర్ష తిరు నక్షత్రం.

No comments :
Write comments