ఆలయానికి చేరుకున్న ఉపరాష్ట్రపతికి రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి శ్రీ అనగాని సత్యప్రసాద్, టీటీడీ ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్ర, జేఈవో డా. ఎ. శరత్, ఎమ్మెల్యే శ్రీ పులివర్తి నాని తదితరులు సాదర స్వాగతం పలికారు.
అనంతరం ఆలయ అర్చకులు వేదమంత్రోచ్ఛారణ, మంగళవాయిద్యాల నడుమ సంప్రదాయబద్ధంగా ఇస్తికఫాల్ స్వాగతం పలికారు. ఉపరాష్ట్రపతి సంప్రదాయ వస్త్రధారణలో ధ్వజస్తంభాన్ని దర్శించుకుని, శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శనం చేసుకున్నారు.
దర్శనానంతరం ఆశీర్వాద మండపంలో టీటీడీ ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్ర అమ్మవారి చిత్రపటం, తీర్థప్రసాదాలను గౌరవ ఉపరాష్ట్రపతికి అందజేశారు.
ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు శ్రీ రాంమూర్తి, శ్రీ డాలర్ దివాకర్ రెడ్డి, సీవీఎస్వో శ్రీ కె.వి. మురళీకృష్ణ, జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, విజీవో శ్రీ గిరిధర, డిప్యూటీ ఈవోలు శ్రీ హరీంద్రనాథ్, శ్రీ సెల్వం, ఏఈవో శ్రీ దేవరాజులు, ఏవీఎస్వోలు శ్రీహరి రావు, శ్రీ జి. చంద్ర, సూపరింటెండెంట్లు శ్రీ మునిచంగల్రాయులు, శ్రీ సురేష్, ఇతర అధికారులు, అర్చకులు పాల్గొన్నారు.
No comments :
Write comments