ఈ పవిత్ర కార్యక్రమంలో భాగంగా తెల్లవారుజామున 3 గంటలకు సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొలిపారు. అనంతరం వేదమంత్రోచ్చారణల నడుమ అభిషేకం, అలంకారం, అర్చన వైభవంగా నిర్వహించారు.
ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు లక్ష బిల్వార్చన సేవ భక్తిశ్రద్ధలతో కొనసాగింది. త్రిదళాలతో కూడిన పవిత్ర లక్ష బిల్వ పత్రాలతో వేద పండితులు, ఆలయ అర్చకులు ఆగమోక్తంగా స్వామివారిని అర్చించారు. శివునికి అత్యంత ప్రీతికరమైన బిల్వార్చనను కనులారా వీక్షించి భక్తులు పులకించిపోయారు.
నేడుఉత్సవమూర్తులపురవీధిఊరేగింపు
ఈ రోజు సాయంత్రం 6 గంటలకు శ్రీ చంద్రశేఖర స్వామివారు, శ్రీ కామాక్షి అమ్మవారి ఉత్సవమూర్తులను పుష్పాలంకృతులను చేసి తిరుపతి పురవీధుల్లో ఘనంగా ఊరేగించనున్నారు. మంగళవాయిద్యాలు, భజన బృందాల కోలాటాల నడుమ సాగే ఈ ఊరేగింపును దర్శించి భక్తులు స్వామివారి కృపకు పాత్రులు కావాలని ఆలయ అధికారులు కోరారు.
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి నాగరత్న, ఏఈవో శ్రీమతి కుమారి దేవి, సూపరింటెండెంట్ శ్రీ చంద్రశేఖర్, ఆలయ అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
No comments :
Write comments