28.11.26

రుద్ర నినాదాలతో పులకించిన శ్రీ కపిలేశ్వరాలయం భక్తిశ్రద్ధలతో ప్రారంభమైన రుద్రయాగం rudra yagam





తిరుపతిలోని ప్రసిద్ధ శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో శ్రీ కపిలేశ్వరస్వామివారి హోమం (రుద్రయాగం) శుక్రవారం వైభవంగా ప్రారంభమైంది. వేదమంత్రాల ఘోష, రుద్రజప ధ్వనులతో ఆలయ ప్రాంగణమంతా ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.

నెల రోజుల పాటు జరుగుతున్న హోమ మహోత్సవాల్లో భాగంగా నవంబరు 27 నుంచి డిసెంబరు 6వ తేదీ వరకు 11 రోజుల పాటు ఈ రుద్రయాగం నిర్వహిస్తారు.

యాగశాలలో నిత్య కార్యక్రమాలు

తొలిరోజు ఉదయం యాగశాలలో పూజ, రుద్రజపం, హోమం, లఘు పూర్ణాహుతి, నివేదన, హారతి కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు.

సాయంత్రం పూజ, జపం, హోమం, రుద్రత్రిశతి, బిల్వార్చన, నివేదన, విశేష దీపారాధన, హారతి సమర్పించనున్నారు.

గృహస్తులకు అవకాశం

భక్తులు ఈ పవిత్ర యాగంలో పాల్గొని స్వామివారి అనుగ్రహం పొందవచ్చు. గృహస్తులు రూ.500/- చెల్లించి టికెట్ కొనుగోలు చేసి ఒక రోజు హోమంలో పాల్గొనవచ్చు. వీరికి ఒక ఉత్తరీయం, ఒక రవికె, అన్నప్రసాదం అందజేస్తారు.

ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి నాగరత్న, ఏఈవో శ్రీమతి కుమారి దేవి, సూపరింటెండెంట్ శ్రీ చంద్రశేఖర్, ఆలయ అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

No comments :
Write comments