ఈ సందర్భంగా ఆలయం ముందు మీడియాతో శ్రీ వి.వినయ్ చంద్ మాట్లాడుతూ, కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీవేంకటేశ్వర స్వామివారి సన్నిధిలో టీటీడీ సాధికారిక మండలి సభ్యులుగా ప్రమాణస్వీకారం చేయడం తన పూర్వజన్మ సుకృతం అన్నారు.
తనపై నమ్మకం ఉంచి ఈ అవకాశం కల్పించిన ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలిపారు. టీటీడీ సాధికారిక మండలి సభ్యుడిగా ఉన్నంత వరకు సాధికారిక మండలి చైర్మన్ శ్రీ ముద్దాడ రవిచంద్ర, మరో సభ్యులు శ్రీ కె.కన్నబాబులతో సమన్వయంతో పని చేసి భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించేందుకు శాయశక్తులా కృషి చేస్తానని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో సీవీఎస్వో శ్రీ మురళీకృష్ణ, శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ భాస్కర్, బోర్డు సెల్ డిప్యూటీ ఈవో శ్రీమతి ప్రశాంతి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
No comments :
Write comments