1.8.26

శ్రీవారి సన్నిధిలో సేవ చేయడం పూర్వజన్మ సుకృతం : టీటీడీ ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్ర ttd eo







శ్రీవారి సన్నిధిలో భక్తులకు సేవ చేసే అదృష్టం భించడం పూర్వజన్మ సుకృతమని టీటీడీ ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్ర న్నారు.

టీటీడీలోని వివిధ విభాగాల్లో విధులు నిర్వహించి శుక్రవారం పదవీ విరమణ చేసిన 28 మంది, అలాగే ఈ ఏడాది జనవరి 1 నుంచి మే 31 వరకు పదవీ విరమణ పొందిన 132 మంది ఉద్యోగులు కలిపి మొత్తం 160 మందికి తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో శుక్రవారం ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ, భక్తుల సేవలో ఎన్నో సవాళ్లను అధిగమిస్తూ అంకితభావంతో పనిచేసిన ఉద్యోగుల సేవలు టీటీడీ చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచిపోతాయని కొనియాడారు. ఉద్యోగ జీవితంలో సంపాదించిన అనుభవాన్ని, విలువైన జ్ఞానాన్ని భావితర ఉద్యోగులతో పంచుకుని వారికి మార్గదర్శకులుగా నిలవాలని సూచించారు.

ఉద్యోగ విరమణ అనంతరం అందరూ ఆరోగ్యంగా, ఆనందంగా, కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని, శ్రీ వేంకటేశ్వరస్వామివారి అనుగ్రహం ఎల్లప్పుడూ వారిపై ఉండాలని ఆకాంక్షించారు. పదవీ విరమణ పొందిన ఉద్యోగులను గౌరవించే ఈ సన్మాన కార్యక్రమాన్ని ప్రతి ఏడాది కొనసాగిస్తామని తెలిపారు.

అంతకుముందు టీటీడీ జేఈవో డాక్టర్ ఎ. శరత్ మాట్లాడుతూ, శ్రీవారి సేవ చేసే అవకాశం దక్కడం మహాభాగ్యమని, పదవీ విరమణ ఉద్యోగులను ఘనంగా సత్కరించడం భావితర ఉద్యోగులకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.

అనంతరం ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్ర, జేఈవోలు కలిసి పదవీ విరమణ పొందిన టీటీడీ శ్రీ సత్యనారాయణ, స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ ఈవో శ్రీమతి పార్వతి సహా వివిధ విభాగాలకు చెందిన ఉద్యోగులను శాలువాలతో సత్కరించి, జ్ఞాపికలు అందజేసి ఘనంగా సన్మానించారు. అనంతరం వేద పండితులు వారికి వేదాశీర్వచనం అందించారు. పదవి విరమణ పొందిన ఉద్యోగులకు శ్రీవారి లడ్డు ప్రసాదం, వడ, జాకెట్ పీస్, తీర్థం, మహా ప్రసాదం అందించి, శ్రీవారి శాలువాతో సత్కరించారు. 

ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో (హెచ్‌ఆర్‌) శ్రీ గోవిందరాజన్‌, సంక్షేమ విభాగం డిప్యూటీ ఈవో శ్రీ ఆనందరాజు, ఇతర అధికారులు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, పదవీ విరమణ పొందిన ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

TTD Makes Comprehensive Arrangements inTirupati for Brahmotsavams




TTD Joint Executive Officer Dr. A. Sharath has directed all departments to work in close coordination and make comprehensive arrangements to ensure a smooth and comfortable experience for devotees visiting Tirumala and Tirupati during the annual Srivari Salakatla Brahmotsavams, Navaratri Brahmotsavams and Peratasi Saturdays.

Reviewing the preparations with officials of various departments at the TTD Administrative Building in Tirupati on Friday, the JEO instructed officials to identify adequate parking spaces and establish holding points in and around Tirupati to effectively regulate the expected heavy traffic.

He directed the authorities to provide sufficient mobile toilets, safe drinking water facilities and maintain high standards of sanitation at all parking and holding areas.

The JEO also instructed officials to install welcome arches, flex banners and QR code-enabled signboards at major junctions and important locations to help devotees access information easily.

Engineering officials were asked to illuminate temples, major buildings and key roads with decorative lighting to create a spiritual atmosphere during the festivals.

Under the supervision of the TTD Public Relations Department, additional help desks will be set up at the Railway Station, RTC Bus Stand, Alipiri Bus Stand, Alipiri Footpath, Vishnu Nivasam and Srinivasam. Wide publicity will also be given to the cultural programmes to be held at Mahathi Kalakshetram, Ramachandra Pushkarini and the Annamacharya Project.

The JEO instructed TTD Chief Public Relations Officer Dr. T. Ravi to deploy more Srivari Sevaks at key locations to extend better assistance to devotees.

Emphasising that a large influx of devotees is expected during the festivals, Dr. A. Sharath called upon all engineering and allied departments to work in coordination and provide the best possible services.

SE-I Sri Manoharam, SE (Electrical) Sri Venkateswarlu, DEs Sri Ravishankar Reddy and Smt. Saraswathi, Vigilance Officer Sri Giridhar, Additional Health Officer Dr. Sunil and other officials attended the meeting.

ఆగస్టులో శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో విశేష ఉత్సవాలు sri kodandarama swamy vari temple




తిరుపతిలోని శ్రీ కోదండరామాలయంలో ఆగస్టు నెలలో లు విశేష ఉత్సవాలు జరుగనున్నాయి. వాటి వివరాలు ఇలా ఉన్నాయి.

•  ఆగస్టు 1, 8, 15, 22, 29వ తేదీల్లో శనివారం సందర్భంగా ఉదయం 6 గంటలకు శ్రీ సీతారామ లక్ష్మణుల మూలవర్ల అభిషేకం నిర్వహిస్తారు. భక్తులు రూ.20/- చెల్లించి మూలవర్ల అభిషేకంలో పాల్గొనవచ్చు. సాయంత్రం 5 గంటలకు స్వామి, అమ్మవారికి ఆలయంలో ఊంజల్‌సేవ నిర్వహిస్తారు. అనంత‌రం సాయంత్రం 5.30 గంట‌ల‌కు తిరుచ్చిపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహ‌రించి భ‌క్తుల‌ను క‌టాక్షించ‌నున్నారు.

•  ఆగ‌స్టు 7న శ్రీ కోదండ‌రామ‌స్వామివారి ఆల‌యంలో ప‌విత్రోత్స‌వాల‌కు అంకురార్ప‌ణ‌.

•  ఆగ‌స్టు 8 నుండి 10వ తేదీ వ‌ర‌కు శ్రీ కోదండ‌రామ‌స్వామివారి ప‌విత్రోత్స‌వాలు.

•  ఆగస్టు 11న పునర్వసు నక్షత్రాన్ని పురస్కరించుకుని ఉదయం 11 గంటలకు శ్రీ సీతారాముల కల్యాణం నిర్వహిస్తారు. రూ.500/- టికెట్‌ కొనుగోలు చేసి కల్యాణంలో పాల్గొనవచ్చు. సాయంత్రం 5.30 గంటలకు స్వామి, అమ్మవారిని తిరుచ్చిపై ఆలయ నాలుగు మాడ వీధుల గుండా శ్రీరామచంద్ర పుష్కరిణి వద్దకు ఊరేగింపుగా తీసుకెళతారు. సాయంత్రం 6.30 గంటలకు ఊంజల్‌సేవ నిర్వహిస్తారు.

•  ఆగస్టు 12వ తేదీ అమావాస్య సందర్భంగా ఉదయం 8.30 గంటలకు సహస్ర కలశాభిషేకం జరుగనుంది. రూ.500/- చెల్లించి గృహస్తులు(ఇద్దరు) పాల్గొనవచ్చు. రాత్రి 7.00 గంటలకు హనుమంత వాహనసేవ జరుగనుంది.

•  ఆగస్టు 28న పౌర్ణమి సందర్భంగా ఉదయం 9.30 గంటలకు అష్టోత్తర శతకలశాభిషేకం నిర్వహిస్తారు. రూ.50/- చెల్లించి భక్తులు ఈ సేవలో పాల్గొనవచ్చు. సాయంత్రం 5.30 గంటలకు ఆలయ నాలుగు మాడ వీధుల నుంచి శ్రీరామచంద్ర పుష్కరిణి వరకు తిరుచ్చి ఉత్సవం నిర్వహిస్తారు.

31.7.26

TTD to hold Sri Kodandarama Swamy Vari Temple Pavitrotsavams from 7th to 10th August




TTD Executive Officer Sri Muddada Ravichandra on Thursday released the posters and brochures for the annual Sri Kodandarama Swamy Pavitrotsavams, scheduled to be held from August 7 to 10 at the Sri Kodandarama Swamy Temple in Tirupati. The event took place at Sri Padmavathi Guest House, Tirupati.

The festivities will commence on August 7 with Ankurarpanam, including Vedic rituals such as Medini Puja, Mrutsangrahanam, and Ankurarpanam.

Pavitrotsavams are performed every year to preserve the sanctity of the temple and to atone for any ritual lapses that may occur unknowingly during daily worship or by devotees and temple staff.

The three-day rituals will feature Pavitra Pratishtha, Pavitra Samarpana, Vedic homams, Snapana Tirumanjanam, daily Tiruveedhi Utsavams, and will conclude with Poornahuti.

Devotees can participate as Grihasthas (couples) by paying ₹500. Participants will receive one Uttariyam, one Ravike, and a Pavitram as prasadam on the concluding day.

TTD's Hindu Dharma Prachara Parishad and Annamacharya Project will organise daily spiritual discourses and devotional music programmes during the festival.

TTD JEO Dr. A. Sharath, Deputy EO Smt. B. Nagaratna, Superintendent Sri K. Srinivasulu Reddy, Temple Inspector Sri A.M. Suresh Babu, temple priests, and other officials were present.

Grand Pushpayagam Performed at Sri Prasanna Venkateswara Swamy Vari Temple, Appalayagunta





The annual Pushpayagam was performed with religious fervour at the Sri Prasanna Venkateswara Swamy Temple, Appalayagunta, on Thursday.

The ritual was conducted as per Agama traditions to atone for any inadvertent lapses that might have occurred during the Annual Brahmotsavams held from June 25 to July 3 in the conduct of daily rituals and festivals.

As part of the celebrations, Snapana Tirumanjanam was performed to Sri Prasanna Venkateswara Swamy along with Sri Devi and Bhu Devi from 11 a.m. to 12 noon using milk, curd, honey, sandalwood paste and tender coconut water. The flowers meant for the Pushpayagam were first offered special prayers before the presiding deity and then taken in a ceremonial procession around the temple. The deities were later seated on the Sarvabhupala Vahanam at a specially arranged venue in the temple premises.

From 3 p.m. to 5 p.m., the Pushpayagam was performed amid Vedic chanting and traditional music using about 2.5 tonnes of flowers. Eighteen varieties of flowers, including tulasi, chrysanthemum, oleander, mogali, sampangi, rose and lotus, along with six varieties of sacred leaves, were offered to the Lord. The colourful floral ritual filled devotees with spiritual bliss. The celebrations concluded with the Veedhi Utsavam.

Deputy EO Sri Harindranath, AEO Sri Devarajulu, Superintendent Smt. Srivani, Kankanabhattar Sri Suryakumar Acharyulu, Temple Inspector Sri Venugopal, other officials, priests and a large number of devotees participated in the programme.

అప్పలాయగుంటలో శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారికి వైభవంగా పుష్పయాగ మహోత్సవం pushpa yagam




అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో గురువారం పుష్పయాగ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది

జూన్ 25 నుంచి జూలై 3 వరకు నిర్వహించిన వార్షిక బ్రహ్మోత్సవాల్లో నిత్యకైంకర్యాలు, ఉత్సవాల సందర్భంగా అర్చకులు, అధికారులు, రిచారకులు, భక్తుల వల్ల తెలియక జరిగిన లోపాల పరిహారార్థం ఆగమశాస్త్ర సంప్రదాయం ప్రకారం పుష్పయాగాన్ని నిర్వహించారు.

స్నపన తిరుమంజనం, పుష్పాల శోభాయాత్ర

ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు శ్రీదేవి, భూదేవి మేత శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారికి పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరి నీటితో శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. అనంతరం పుష్పయాగానికి వినియోగించే పుష్పాలను మూలమూర్తి సన్నిధిలో ప్రత్యేక పూజలు చేసి, ఆలయ ప్రదక్షిణతో పాటు మాడవీధుల్లో శోభాయాత్రగా తీసుకువచ్చారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై సర్వభూపాల వాహనంలో స్వామివారిని కొలువుదీర్చారు.

రెండున్నర టన్నుల పుష్పాలతో దివ్య పుష్పార్చన

మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు వేదమంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ సుమారు రెండున్నర టన్నుల పుష్పాలతో పుష్పయాగం వైభవంగా జరిగింది. తులసి, చామంతి, గన్నేరు, మొగలి, సంపంగి, రోజా, కలువలతో సహా 18 రకా పుష్పాలు, ఆరు రకాల పవిత్ర పత్రాలతో స్వామివారికి పుష్పార్చన నిర్వహించారు. ఆధ్యాత్మిక వైభవాన్ని తిలకించిన భక్తులు భక్తి పారవశ్యంలో మునిగిపోయారు. అనంతరం వీధి ఉత్సవం నిర్వహించారు.

కార్యక్రమంలో డెప్యూటీ ఈవో శ్రీ హరీంద్రనాథ్‌, ఏఈవో శ్రీ దేవరాజులు, ఏవీఎస్వో శ్రీహరి రావు, సూపరింటెండెంట్ శ్రీమతి శ్రీవాణి, కంకణభట్టార్ శ్రీ సూర్యకుమార్ ఆచార్యులు, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ వేణుగోపాల్, ఇతర ధికారులు, అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

ఆగస్టు 7 నుంచి 10 వరకు తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి పవిత్రోత్సవాలు pavitrotsavams




తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో ఆగస్టు 7 నుంచి 10 తేదీ వరకు వైభవంగా నిర్వహించనున్న పవిత్రోత్సవాల గోడపత్రికలు, బుక్‌లెట్లను టీటీడీ ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్ర గురువారం తిరుపతిలోని శ్రీ పద్మావతి అతిథి గృహంలో ఆవిష్కరించారు.

ఆగస్టు 7 అంకురార్పణతో శ్రీకారం

ఆగస్టు 7వ తేదీ సాయంత్రం అంకురార్పణతో పవిత్రోత్సవాలు ప్రారంభమవుతాయి. ఇందులో భాగంగా మేదినీ పూజ, మృత్సంగ్రహణం, అంకురార్పణ వంటి వైదిక కార్యక్రమాలు శాస్త్రోక్తంగా నిర్వహించనున్నారు.

ఆలయ పవిత్రత పరిరక్షణే పవిత్రోత్సవాల ప్రధాన ఉద్దేశ్యం

వైదిక సంప్రదాయం ప్రకారం జాతాశౌచం, మృతాశౌచం వంటి సందర్భాల్లో ఆలయ ప్రవేశం నిషిద్ధం. అయితే యాత్రికులు లేదా ఆలయ సిబ్బంది ద్వారా తెలియక జరిగే దోషాల నివారణ, ఆలయ పవిత్రతను కాపాడడం కోసం ప్రతి ఏడాది మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.

మూడు రోజుల పాటు వైదిక వైభవం

పవిత్రోత్సవాల్లో భాగంగా మొదటి రోజు సాయంత్రం సీతారామలక్ష్మణుల బంగారు తిరుచ్చి తిరువీధి ఉత్సవం, భాష్యకార్ల సన్నిధిలో ఇయల్‌పడి ఆరగింపు, శాత్తుమొర, ఆస్థానం నిర్వహిస్తారు. అనంతరం యాగశాలలో పవిత్ర ప్రతిష్ఠ, శయనాధివాసం జరుగుతాయి.

రెండో రోజు ఉదయం 7 గంటల నుంచి 8.30 గంటల వరకు వైదిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. సాయంత్రం పవిత్ర సమర్పణ తదితర విశిష్ట క్రతువులు చేపడతారు.

మూడో రోజు యాగశాలలో వైదిక కార్యక్రమాలు, పూర్ణాహుతితో పవిత్రోత్సవాలు ఘనంగా ముగియనున్నాయి.

ప్రతిరోజూ స్నపన తిరుమంజనంతిరువీధి ఉత్సవం

ఉత్సవాల సందర్భంగా ప్రతిరోజూ ఉదయం స్నపన తిరుమంజనం, సాయంత్రం తిరువీధి ఉత్సవం నిర్వహిస్తారు.

గృహస్తులకు ప్రత్యేక అవకాశం

గృహస్తులు (ఇద్దరు) రూ.500/- చెల్లించి పవిత్రోత్సవాల్లో పాల్గొనవచ్చు. పాల్గొనే గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికెతో పాటు చివరి రోజు ఒక పవిత్రం ప్రసాదంగా అందజేస్తారు.

ఆధ్యాత్మిక, భక్తి సంగీత కార్యక్రమాలు

పవిత్రోత్సవాల సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్ మరియు అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ప్రతిరోజూ ఆధ్యాత్మిక ప్రసంగాలు, భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

ఈ కార్యక్రమంలో టీటీడీ జేఈవో డా. ఎ. శరత్, డిప్యూటీ ఈవో శ్రీమతి బి. నాగరత్న, సూపరింటెండెంట్ శ్రీ కె. శ్రీనివాసులు రెడ్డి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ ఎ. ఎం. సురేశ్ బాబు, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.