ఆగస్టు 7వ తేదీ సాయంత్రం అంకురార్పణతో పవిత్రోత్సవాలు ప్రారంభమవుతాయి. ఇందులో భాగంగా మేదినీ పూజ, మృత్సంగ్రహణం, అంకురార్పణ వంటి వైదిక కార్యక్రమాలు శాస్త్రోక్తంగా నిర్వహించనున్నారు.
ఆలయపవిత్రతపరిరక్షణేపవిత్రోత్సవాలప్రధానఉద్దేశ్యం
వైదిక సంప్రదాయం ప్రకారం జాతాశౌచం, మృతాశౌచం వంటి సందర్భాల్లో ఆలయ ప్రవేశం నిషిద్ధం. అయితే యాత్రికులు లేదా ఆలయ సిబ్బంది ద్వారా తెలియక జరిగే దోషాల నివారణ, ఆలయ పవిత్రతను కాపాడడం కోసం ప్రతి ఏడాది మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.
మూడురోజులపాటువైదికవైభవం
పవిత్రోత్సవాల్లో భాగంగా మొదటి రోజు సాయంత్రం సీతారామలక్ష్మణుల బంగారు తిరుచ్చి తిరువీధి ఉత్సవం, భాష్యకార్ల సన్నిధిలో ఇయల్పడి ఆరగింపు, శాత్తుమొర, ఆస్థానం నిర్వహిస్తారు. అనంతరం యాగశాలలో పవిత్ర ప్రతిష్ఠ, శయనాధివాసం జరుగుతాయి.
రెండో రోజు ఉదయం 7 గంటల నుంచి 8.30 గంటల వరకు వైదిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. సాయంత్రం పవిత్ర సమర్పణ తదితర విశిష్ట క్రతువులు చేపడతారు.
మూడో రోజు యాగశాలలో వైదిక కార్యక్రమాలు, పూర్ణాహుతితో పవిత్రోత్సవాలు ఘనంగా ముగియనున్నాయి.
ప్రతిరోజూస్నపనతిరుమంజనం – తిరువీధిఉత్సవం
ఉత్సవాల సందర్భంగా ప్రతిరోజూ ఉదయం స్నపన తిరుమంజనం, సాయంత్రం తిరువీధి ఉత్సవం నిర్వహిస్తారు.
గృహస్తులకుప్రత్యేకఅవకాశం
గృహస్తులు (ఇద్దరు) రూ.500/- చెల్లించి పవిత్రోత్సవాల్లో పాల్గొనవచ్చు. పాల్గొనే గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికెతో పాటు చివరి రోజు ఒక పవిత్రం ప్రసాదంగా అందజేస్తారు.
ఆధ్యాత్మిక, భక్తిసంగీతకార్యక్రమాలు
పవిత్రోత్సవాల సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్ మరియు అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ప్రతిరోజూ ఆధ్యాత్మిక ప్రసంగాలు, భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
ఈ కార్యక్రమంలో టీటీడీ జేఈవో డా. ఎ. శరత్, డిప్యూటీ ఈవో శ్రీమతి బి. నాగరత్న, సూపరింటెండెంట్ శ్రీ కె. శ్రీనివాసులు రెడ్డి, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ ఎ. ఎం. సురేశ్ బాబు, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.
No comments :
Write comments