1.8.26

సెప్టెంబర్ 15 నుండి 23వ తేదీ వరకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు brahmotsavams




తిరుమలలో ఏడాది రెండు బ్రహ్మోత్సవాలు భక్తులను ఆధ్యాత్మిక ఆనందంలో పరవశింప చేయనున్నాయి.


సెప్టెంబర్ 15 నుండి 23 తేదీ వరకు నవాహ్నిక సాలకట్ల బ్రహ్మోత్సవాలు, అక్టోబర్ 12 నుండి 20 వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించనున్నారు


సెప్టెంబర్ 14 తేదీ సాయంత్రం అంకురార్పణతో వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి.


బ్రహ్మోత్సవాల్లో ప్రతి రోజు ఉదయం 8 నుండి 10 గంటల వరకు మరియు సాయంత్రం 7 గంటల నుండి 9 గంటల

వాహన సేవలు ఉంటాయి.


వాహన సేవల వివరాలు :


15/09/2026 – సాయంత్రం ధ్వజారోహణం, రాత్రి 9 గంటలకు పెద్ద శేష వాహనం.


16/09/2026 – ఉదయం 8 గంటలకు చిన్న శేష వాహనం, మధ్యాహ్నం 1 నుండి 3 గంటల వరకు స్నపనం, రాత్రి 7 గంటలకు హంస వాహనం.


17/09/2026 – ఉదయం 8 గంటలకు సింహ వాహనం, రాత్రి 7 గంటలకు ముత్యపు పందిరి వాహనం,


18/09/2026 -ఉదయం 8 గంటలకు కల్పవృక్షం వాహనం, రాత్రి 7 గంటలకు సర్వ భూపాల వాహనం,


19/09/2026 – ఉదయం 8 గంటలకు మోహినీ అవతారం, సాయంత్రం 6:30 నుండి రాత్రి 11:30 గంటల వరకు గరుడ వాహనం


20/09/2026 ఉదయం 8 గంటలకు హనుమంత వాహనం, సాయంత్రం 4 గంటలకు స్వర్ణ రథం, రాత్రి 7 గంటలకు గజ వాహనం.


21/09/2026 ఉదయం 8 గంటలకు సూర్యప్రభ వాహనం, మధ్యాహ్నం 1 నుండి 3 గంటల వరకు స్నపనం

రాత్రి 7 గంటలకు చంద్రప్రభ వాహనం,


22/09/2026 ఉదయం 7 గంటలకు రథోత్సవం, రాత్రి 7 గంటలకు అశ్వ వాహనం,


23/09/2026  ఉదయం 6 నుండి 9 వరకు చక్రస్నానం, రాత్రి ధ్వజావరోహణం.


Special Festivals at Sri Kodandarama Swamy Vari Temple in August




Sri Kodandarama Swamy Temple, Tirupati, will host a series of special religious festivals and sevas during August.

 The schedule is as follows:

Tirupati, July 31, 2026

August 1, 8, 15, 22 and 29 (Fridays): Abhishekam to the presiding deities of Sri Sita, Rama and Lakshmana will be performed at 6.00 a.m. Devotees can participate by purchasing a ticket costing Rs.20. In the evening, Unjal Seva will be held at 5.00 p.m., followed by the Tiruchi Utsavam through the four Mada Streets of the temple at 5.30 p.m.

August 7: Ankurarpanam will be performed to mark the commencement of the annual Pavitrotsavams.

August 8 to 10: The annual Pavitrotsavams will be conducted with religious fervour.

August 11 (Punarvasu Nakshatram): Sri Sita Rama Kalyanam will be performed at 11.00 a.m. Devotees can participate by purchasing a Rs.500 ticket. At 5.30 p.m., the deities will be taken in a Tiruchi procession through the four Mada Streets to Sri Ramachandra Pushkarini, followed by Unjal Seva at 6.30 p.m.

August 12 (Amavasya): Sahasra Kalasabhishekam will be performed at 8.30 a.m. Couples can participate by purchasing a Rs.500 ticket. Hanumantha Vahana Seva will be held at 7.00 p.m.

August 28 (Pournami): Ashtottara Sata Kalasabhishekam will be performed at 9.30 a.m. Devotees can participate by purchasing a Rs.50 ticket. A Tiruchi Utsavam from the temple's four Mada Streets to Sri Ramachandra Pushkarini will be held at 5.30 p.m.

Devotees are requested to participate in these sacred festivals and receive the blessings of Sri Kodandarama Swamy.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI 

శ్రీవారి సన్నిధిలో సేవ చేయడం పూర్వజన్మ సుకృతం : టీటీడీ ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్ర ttd eo







శ్రీవారి సన్నిధిలో భక్తులకు సేవ చేసే అదృష్టం భించడం పూర్వజన్మ సుకృతమని టీటీడీ ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్ర న్నారు.

టీటీడీలోని వివిధ విభాగాల్లో విధులు నిర్వహించి శుక్రవారం పదవీ విరమణ చేసిన 28 మంది, అలాగే ఈ ఏడాది జనవరి 1 నుంచి మే 31 వరకు పదవీ విరమణ పొందిన 132 మంది ఉద్యోగులు కలిపి మొత్తం 160 మందికి తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో శుక్రవారం ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ, భక్తుల సేవలో ఎన్నో సవాళ్లను అధిగమిస్తూ అంకితభావంతో పనిచేసిన ఉద్యోగుల సేవలు టీటీడీ చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచిపోతాయని కొనియాడారు. ఉద్యోగ జీవితంలో సంపాదించిన అనుభవాన్ని, విలువైన జ్ఞానాన్ని భావితర ఉద్యోగులతో పంచుకుని వారికి మార్గదర్శకులుగా నిలవాలని సూచించారు.

ఉద్యోగ విరమణ అనంతరం అందరూ ఆరోగ్యంగా, ఆనందంగా, కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని, శ్రీ వేంకటేశ్వరస్వామివారి అనుగ్రహం ఎల్లప్పుడూ వారిపై ఉండాలని ఆకాంక్షించారు. పదవీ విరమణ పొందిన ఉద్యోగులను గౌరవించే ఈ సన్మాన కార్యక్రమాన్ని ప్రతి ఏడాది కొనసాగిస్తామని తెలిపారు.

అంతకుముందు టీటీడీ జేఈవో డాక్టర్ ఎ. శరత్ మాట్లాడుతూ, శ్రీవారి సేవ చేసే అవకాశం దక్కడం మహాభాగ్యమని, పదవీ విరమణ ఉద్యోగులను ఘనంగా సత్కరించడం భావితర ఉద్యోగులకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.

అనంతరం ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్ర, జేఈవోలు కలిసి పదవీ విరమణ పొందిన టీటీడీ శ్రీ సత్యనారాయణ, స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ ఈవో శ్రీమతి పార్వతి సహా వివిధ విభాగాలకు చెందిన ఉద్యోగులను శాలువాలతో సత్కరించి, జ్ఞాపికలు అందజేసి ఘనంగా సన్మానించారు. అనంతరం వేద పండితులు వారికి వేదాశీర్వచనం అందించారు. పదవి విరమణ పొందిన ఉద్యోగులకు శ్రీవారి లడ్డు ప్రసాదం, వడ, జాకెట్ పీస్, తీర్థం, మహా ప్రసాదం అందించి, శ్రీవారి శాలువాతో సత్కరించారు. 

ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో (హెచ్‌ఆర్‌) శ్రీ గోవిందరాజన్‌, సంక్షేమ విభాగం డిప్యూటీ ఈవో శ్రీ ఆనందరాజు, ఇతర అధికారులు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, పదవీ విరమణ పొందిన ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

TTD Makes Comprehensive Arrangements inTirupati for Brahmotsavams




TTD Joint Executive Officer Dr. A. Sharath has directed all departments to work in close coordination and make comprehensive arrangements to ensure a smooth and comfortable experience for devotees visiting Tirumala and Tirupati during the annual Srivari Salakatla Brahmotsavams, Navaratri Brahmotsavams and Peratasi Saturdays.

Reviewing the preparations with officials of various departments at the TTD Administrative Building in Tirupati on Friday, the JEO instructed officials to identify adequate parking spaces and establish holding points in and around Tirupati to effectively regulate the expected heavy traffic.

He directed the authorities to provide sufficient mobile toilets, safe drinking water facilities and maintain high standards of sanitation at all parking and holding areas.

The JEO also instructed officials to install welcome arches, flex banners and QR code-enabled signboards at major junctions and important locations to help devotees access information easily.

Engineering officials were asked to illuminate temples, major buildings and key roads with decorative lighting to create a spiritual atmosphere during the festivals.

Under the supervision of the TTD Public Relations Department, additional help desks will be set up at the Railway Station, RTC Bus Stand, Alipiri Bus Stand, Alipiri Footpath, Vishnu Nivasam and Srinivasam. Wide publicity will also be given to the cultural programmes to be held at Mahathi Kalakshetram, Ramachandra Pushkarini and the Annamacharya Project.

The JEO instructed TTD Chief Public Relations Officer Dr. T. Ravi to deploy more Srivari Sevaks at key locations to extend better assistance to devotees.

Emphasising that a large influx of devotees is expected during the festivals, Dr. A. Sharath called upon all engineering and allied departments to work in coordination and provide the best possible services.

SE-I Sri Manoharam, SE (Electrical) Sri Venkateswarlu, DEs Sri Ravishankar Reddy and Smt. Saraswathi, Vigilance Officer Sri Giridhar, Additional Health Officer Dr. Sunil and other officials attended the meeting.

ఆగస్టులో శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో విశేష ఉత్సవాలు sri kodandarama swamy vari temple




తిరుపతిలోని శ్రీ కోదండరామాలయంలో ఆగస్టు నెలలో లు విశేష ఉత్సవాలు జరుగనున్నాయి. వాటి వివరాలు ఇలా ఉన్నాయి.

•  ఆగస్టు 1, 8, 15, 22, 29వ తేదీల్లో శనివారం సందర్భంగా ఉదయం 6 గంటలకు శ్రీ సీతారామ లక్ష్మణుల మూలవర్ల అభిషేకం నిర్వహిస్తారు. భక్తులు రూ.20/- చెల్లించి మూలవర్ల అభిషేకంలో పాల్గొనవచ్చు. సాయంత్రం 5 గంటలకు స్వామి, అమ్మవారికి ఆలయంలో ఊంజల్‌సేవ నిర్వహిస్తారు. అనంత‌రం సాయంత్రం 5.30 గంట‌ల‌కు తిరుచ్చిపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహ‌రించి భ‌క్తుల‌ను క‌టాక్షించ‌నున్నారు.

•  ఆగ‌స్టు 7న శ్రీ కోదండ‌రామ‌స్వామివారి ఆల‌యంలో ప‌విత్రోత్స‌వాల‌కు అంకురార్ప‌ణ‌.

•  ఆగ‌స్టు 8 నుండి 10వ తేదీ వ‌ర‌కు శ్రీ కోదండ‌రామ‌స్వామివారి ప‌విత్రోత్స‌వాలు.

•  ఆగస్టు 11న పునర్వసు నక్షత్రాన్ని పురస్కరించుకుని ఉదయం 11 గంటలకు శ్రీ సీతారాముల కల్యాణం నిర్వహిస్తారు. రూ.500/- టికెట్‌ కొనుగోలు చేసి కల్యాణంలో పాల్గొనవచ్చు. సాయంత్రం 5.30 గంటలకు స్వామి, అమ్మవారిని తిరుచ్చిపై ఆలయ నాలుగు మాడ వీధుల గుండా శ్రీరామచంద్ర పుష్కరిణి వద్దకు ఊరేగింపుగా తీసుకెళతారు. సాయంత్రం 6.30 గంటలకు ఊంజల్‌సేవ నిర్వహిస్తారు.

•  ఆగస్టు 12వ తేదీ అమావాస్య సందర్భంగా ఉదయం 8.30 గంటలకు సహస్ర కలశాభిషేకం జరుగనుంది. రూ.500/- చెల్లించి గృహస్తులు(ఇద్దరు) పాల్గొనవచ్చు. రాత్రి 7.00 గంటలకు హనుమంత వాహనసేవ జరుగనుంది.

•  ఆగస్టు 28న పౌర్ణమి సందర్భంగా ఉదయం 9.30 గంటలకు అష్టోత్తర శతకలశాభిషేకం నిర్వహిస్తారు. రూ.50/- చెల్లించి భక్తులు ఈ సేవలో పాల్గొనవచ్చు. సాయంత్రం 5.30 గంటలకు ఆలయ నాలుగు మాడ వీధుల నుంచి శ్రీరామచంద్ర పుష్కరిణి వరకు తిరుచ్చి ఉత్సవం నిర్వహిస్తారు.