20.8.26

దేవుని కడపలో ఆగస్టు 23 నుంచి అష్టబంధన మహా సంప్రోక్షణ – ఏర్పాట్లను పరిశీలించిన టీటీడీ జేఈవో డాక్టర్ ఏ. శరత్ samprokshanam






కడప జిల్లా దేవుని కడపలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఆగస్టు 23 నుంచి 26 తేదీ వరకు అష్టబంధన మహా సంప్రోక్షణ కుంభాభిషేకాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించనున్నట్లు టీటీడీ జేఈవో డాక్టర్ . శరత్ తెలిపారు. బుధవారం ఆయన అధికారులతో కలిసి ఆలయాన్ని సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు.

మహా సంప్రోక్షణకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను జేఈవో ఆదేశించారు. ఇంజినీరింగ్, విద్యుత్ పనులను త్వరగా పూర్తి చేయడంతోపాటు విద్యుత్ దీపాలు, పుష్పాలతో ఆలయాన్ని సుందరంగా అలంకరించాలన్నారు. ధ్వజస్తంభం, బలిపీఠానికి సంబంధించిన ఇత్తడి రేకు పనులను ఆగస్టు 21లోగా పూర్తి చేయాలని సూచించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేపట్టాలని ఆదేశించారు.

ఆలయానికి చేరుకున్న జేఈవోకు అర్చకులు సాంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ ఆలయ ప్రదక్షిణ అనంతరం శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరస్వామివారిని దర్శించుకున్నారు.

ఒంటిమిట్ట ఆలయంలోనూ ఏర్పాట్ల పరిశీలన

అనంతరం జేఈవో ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి ఆలయాన్ని సందర్శించి స్వామివారిని దర్శించుకున్నారు. క్యూలైన్లు, పోటు, యాగశాల, ప్రసాదాల పంపిణీ తదితర భక్తుల సౌకర్యాలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.

అనంతరం టీటీడీ నిర్మించనున్న 100 గదుల వసతి సముదాయం కోసం కేటాయించనున్న స్థలాన్ని, కల్యాణ వేదిక వద్ద జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు.

ఈ కార్యక్రమంలో సీఈ శ్రీ మనోహరం, డిప్యూటీ ఈవో శ్రీమతి ఎ. ప్రశాంతి, శ్రీమతి సుమతి, డిప్యూటీ ఈఈ శ్రీ నాగరాజు, ఆలయ ఏఈవో శ్రీ ఎన్. రవి, సూపరింటెండెంట్ శ్రీ హనుమంతయ్య, టెంపుల్ ఇన్‌స్పెక్టర్లు శ్రీ ఈశ్వర్ రెడ్డి, శ్రీ మోహన్ బాబు, ఆలయ అర్చకులు తదితరులు పాల్గొన్నారు.

వాల్మీకిపురం శ్రీ పట్టాభిరామస్వామివారి ఆలయంలో వైభవంగా శ్రీరామ పట్టాభిషేకం valmikipuram




వాల్మీకిపురం శ్రీ పట్టాభిరామస్వామివారి ఆలయంలో శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం బుధవారం సాయంత్రం భక్తిశ్రద్ధలతో, వైభవంగా నిర్వహించారు. శ్రీరామ పట్టాభిషేక ఘట్టాన్ని కనులారా వీక్షించిన భక్తులు ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందారు.

ఉదయం సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొలిపి తోమాలసేవ, సహస్రనామార్చన నిర్వహించారు. అనంతరం యాగశాల పూజ, ఉదయం 6.30 గంటలకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనంతో శ్రీపట్టాభిరామస్వామి, సీతమ్మవారి ఉత్సవమూర్తులకు విశేష అభిషేకం నిర్వహించారు.

అనంతరం శాస్త్రోక్తంగా శ్రీరామ పట్టాభిషేక మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. సాయంత్రం 6 గంటలకు ఊంజల్ సేవ అనంతరం శ్రీపట్టాభిరామస్వామివారు గరుడ వాహనంపై ఆలయ మాడవీధుల్లో విహరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు.

ఈ కార్యక్రమంలో ఆలయ ప్రత్యేక శ్రేణి డిప్యూటీ ఈవో శ్రీమతి వరలక్ష్మి, ఏఈఓ శ్రీ గోపీనాథ్, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ నాగరాజు, ఆలయ అర్చకులు, సిబ్బంది, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

Two Temples Handed Over to Endowments Department

 




TTD officials on Wednesday formally handed over Sri Prasanna Anjaneya Swamy Temple and Sri Lakshmi Narasimha Swamy Temple at Rajanalabanda, Vengalapalle village, Chowdepalle Mandal in Annamayya district, to the Endowments Department as per the State Government orders.


At 10.30 a.m., TTD Special Grade Deputy EO of Sri Govindaraja Swamy Temple, Smt. V.R. Shanthi, formally handed over the charge of both temples to Sri Viswanatham, Endowments Department Officer, Madanapalle.


The handover of the two temples, along with their properties and jewellery, was completed as per the government orders and prescribed procedures, TTD officials said.


TTD CAO Sri Venkataramana, Task Force Tahsildar Smt. Lalithanjali, Sri Govindaraja Swamy Temple AEO Sri A.B. Narayana Chowdary, Superintendent Smt. Padma Priya and other officials and staff participated.

ఘనంగా ముగిసిన “శ్రీవైష్ణవ ఆచార్యుల ఆధ్యాత్మిక సేవలు” జాతీయ సదస్సు national conference





శ్రీవైష్ణవ ఆచార్యులు చూపిన భక్తి, శరణాగతి, చార్య నిష్ఠ, కైంకర్య మార్గాలు నేటి తరానికి ఆదర్శప్రాయమని తిరువల్లిక్కేణికి చెందిన ప్రముఖ పండితులు శ్రీ మాడభూషి అనంతాళ్వాన్ తెలిపారు.

తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో టీటీడీ ఆళ్వార్ దివ్యప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో మూడు రోజులుగా నిర్వహించిన “శ్రీవైష్ణవ ఆచార్యుల ఆధ్యాత్మిక సేవలు” జాతీయ సదస్సు బుధవారం ఘనంగా ముగిసింది. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన పండితులు, ఆచార్యులు ఈ సదస్సులో పాల్గొని శ్రీవైష్ణవ సంప్రదాయం, ఆచార్య భక్తి, శరణాగతి, కైంకర్యం తదితర అంశాలపై ప్రసంగించారు.

ఎంబార్ వాళి తిరునామం విశిష్టమైనది - శ్రీ మాడభూషి అనంతాళ్వాన్

శ్రీ మాడభూషి అనంతాళ్వాన్ “ఎంబార్ వళి తిరునామం” అంశంపై మాట్లాడుతూ, భగవంతునిపై అచంచలమైన భక్తితోపాటు ఆచార్యుల పట్ల సంపూర్ణ విశ్వాసం, శరణాగతి కలిగి ఉండటమే శ్రీవైష్ణవ సంప్రదాయంలోని ప్రధాన సందేశమన్నారు. శ్రీరామానుజాచార్యులు, ఎంబార్ వంటి ఆచార్యులు చూపిన భక్తి, శరణాగతి మార్గం అందరికీ ఆదర్శమన్నారు.

ఎంబార్ తనియన్‌లో ఆచార్య భక్తి - డా. ధనంజయన్

చెన్నైకి చెందిన డా. ధనంజయన్ “ఎంబార్ తనియన్‌లోని భక్తి – పెరియ తిరుమొళి వైశిష్ట్యం” అంశంపై మాట్లాడుతూ, ఎంబార్ తనియన్‌లో ఆచార్య భక్తి, శరణాగతి భావాలు ఎంతో విశిష్టంగా ప్రతిఫలిస్తాయని తెలిపారు. ఆళ్వార్ల పాశురాల్లోని భక్తి తత్వాన్ని ఆచార్యులు తరతరాలకు అందించారని వివరించారు.

శ్రీరామానుజుల ప్రియ శిష్యుడు ఎంబార్  - శ్రీ సముద్రాల శఠగోపాచార్య

వరంగల్‌కు చెందిన శ్రీ సముద్రాల శఠగోపాచార్య “ఎంబార్ – శ్రీరామానుజులు” అంశంపై మాట్లాడుతూ, శ్రీరామానుజాచార్యుల ప్రియ శిష్యుడిగా ఎంబార్ విశిష్ట స్థానాన్ని పొందారని తెలిపారు. ఆచార్య భక్తి, వినయం, శరణాగతి, కైంకర్య భావాలకు ఎంబార్ జీవితం గొప్ప నిదర్శనమన్నారు.

ఆండాళ్ తనియన్లలో భక్తి వైభవం - శ్రీ విష్ణుచిత్తన్ స్వామి

శ్రీరంగానికి చెందిన శ్రీ విష్ణుచిత్తన్ స్వామి “ఆండాళ్‌పై పుండరీకాక్ష స్వామి రచించిన తనియన్ల విశిష్టత” అంశంపై మాట్లాడుతూ, ఆండాళ్ అమ్మవారి తనియన్లలో ఆమె అపారమైన భక్తి, శ్రీమన్నారాయణునిపై అచంచలమైన ప్రేమ, శరణాగతి భావాలు హృద్యంగా ప్రతిఫలిస్తాయని తెలిపారు. ఆండాళ్ అమ్మవారి బోధనలు నేటి తరానికి కూడా మార్గదర్శకమన్నారు.

భగవద్విషయ వ్యాఖ్యానాల్లో దాశరథి అనుభవం - శ్రీ దేవరాజన్

బెంగళూరుకు చెందిన శ్రీ దేవరాజన్ “భగవద్విషయ వ్యాఖ్యానాల్లో దాశరథి అనుభవం” అంశంపై మాట్లాడుతూ, ఆళ్వార్ల దివ్యప్రబంధంలోని భక్తి, శరణాగతి, భగవత్ అనుభవాలను ఆచార్య పరంపర ద్వారా భక్తులకు అందించడంలో దాశరథి చేసిన సేవలు విశిష్టమైనవని తెలిపారు. దాశరథి అనుభవం భక్తి, ఆచార్య నిష్ఠ, భగవత్ కైంకర్యంతో కూడిన ఆధ్యాత్మిక అనుభవమన్నారు.

పరాశర భట్టర్ ఆచార్య భక్తి ఆదర్శప్రాయం - శ్రీ బద్రి భట్టర్ స్వామి

శ్రీరంగానికి చెందిన శ్రీ బద్రి భట్టర్ స్వామి “పరాశర భట్టర్ ఆచార్య భక్తి” అంశంపై మాట్లాడుతూ, ఆచార్యుల పట్ల విశ్వాసం, వినయం, భక్తి, శరణాగతి భావాలను పరాశర భట్టర్ తన జీవితంలో ఆచరించి చూపారని తెలిపారు. ఆయన ఆచార్య నిష్ఠ, భగవత్ భక్తి, కైంకర్య భావం ప్రతి భక్తునికీ ఆదర్శమన్నారు.

శ్రీరామానుజుల వళి తిరునామం వైభవం - డా. రవికుమార్ స్వామి

హైదరాబాద్‌కు చెందిన డా. రవికుమార్ స్వామి “శ్రీరామానుజుల వళి తిరునామం పెరుమై” అంశంపై మాట్లాడుతూ, శ్రీరామానుజాచార్యుల దివ్య జీవితం, ఆచార్య భక్తి, భగవత్ కైంకర్యం, శరణాగతి తత్వాలను వళి తిరునామం స్మరింపజేస్తుందని తెలిపారు. శ్రీరామానుజుల నామస్మరణ భక్తికి బలం, శరణాగతికి మార్గం, కైంకర్యానికి స్ఫూర్తిని అందిస్తుందని పేర్కొన్నారు.

శ్రీరంగనాథుని వైభవాన్ని చాటిన అరంగనుమ్ ఆండనుమ్’ - శ్రీ శ్రీనివాసాచార్య స్వామి 

శ్రీరంగానికి చెందిన శ్రీ శ్రీనివాసాచార్య స్వామి “అరంగనుమ్ ఆండనుమ్” అంశంపై మాట్లాడుతూ, శ్రీరంగనాథస్వామివారికి, ఆచార్య పరంపరకు ఉన్న ఆధ్యాత్మిక అనుబంధాన్ని వివరించారు. ఆళ్వార్లు, ఆచార్యులు అందించిన భక్తి, శరణాగతి, కైంకర్య మార్గాలను భావితరాలకు అందించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు.

ఈ జాతీయ సదస్సు ద్వారా శ్రీవైష్ణవ ఆచార్యుల భక్తి, శరణాగతి, కైంకర్య భావాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు అవకాశం లభించిందని నిర్వాహకులు తెలిపారు. ఇటువంటి సదస్సులు ఆచార్యుల ఆధ్యాత్మిక వారసత్వాన్ని భావితరాలకు అందించడంలో ఎంతో దోహదపడతాయని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఆళ్వార్ దివ్యప్రబంధ ప్రాజెక్టు ప్రత్యేకాధికారి శ్రీ తిరుమళిశై ఆళ్వార్, పండితులు, పరిశోధకులు, భక్తులు పాల్గొన్నారు.

Sri Rama Pattabhishekam Held Grandly at Valmikipuram Temple




The Sri Rama Pattabhishekam was celebrated with devotion and grandeur at Sri Pattabhirama Swamy Temple in Valmikipuram on Wednesday evening.

The day began with Suprabhatam, followed by Thomala Seva, Sahasranamarchana, Yagashala Puja and Snapana Tirumanjanam at 6.30 a.m. The processional deities of Sri Pattabhirama Swamy and Sita Devi were given a special abhishekam with milk, curd, honey, turmeric and sandalwood.

The Pattabhishekam was performed as per temple rituals. In the evening, after Oonjal Seva, Sri Pattabhirama Swamy blessed devotees on the Garuda Vahanam.

Temple officials, priests, staff and a large number of devotees participated in the celebrations.