29.8.26

VAIKHANASA AGAMA IS A DISTINCT VEDIC AGAMA TRADITION-SCHOLARS



A special programme was held at the Asthana Mandapam in Tirumala on Friday to mark the birth anniversary of Sage Vikhanasa, jointly organized by the TTD Alwar Divya Prabandha Project and Sri Vaikhanasa Divya Siddhanta Vivardhini Sabha.


Scholars highlighted the significance of Vaikhanasa Agama, stating that Sage Vikhanasa is its founder and that the tradition, based on the Vaikhanasa Kalpasutra, provides systematic guidelines for temple construction, consecration, worship and festivals.


They noted that the rituals at the Tirumala temple are performed according to Vaikhanasa Agama and emphasized its message of devotion, dharma, compassion and universal welfare. The scholars appreciated TTD’s efforts to preserve and promote this ancient spiritual heritage.


The programme was presided over by Sri Ganjam Prabhakaracharyulu, Secretary of Sri Vikhanasa Trust. Scholars and dignitaries, including Sri Agnihotra Sanath Kumar Acharyulu, Prof. Dr. Vedantham Srivishnu Bhattacharyulu and Dr. D.V. Hayagrivacharyulu, participated.

తిరుమలలో ఘనంగా మాదిరి బ్రహ్మోత్సవ గరుడసేవ garuda seva








ఏడాది సెప్టంబ‌ర్ 15 నుండి 23వ‌ తేదీ వరకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరుగనున్న నేపథ్యంలో శుక్ర‌వారం సాయంత్రం పౌర్ణమి సందర్భంగా టీటీడీ మాదిరి గరుడ సేవను నిర్వహించింది.


సాధారణంగా ప్రతి ఏడాదీ బ్రహ్మోత్సవ ఏర్పాట్లను సమీక్షించుకోవడంలో భాగంగా టీటీడీ ఈ మాదిరి బ్రహ్మోత్సవ గరుడసేవను నిర్వహించడం ఆనవాయితీ.


రాత్రి 7 నుండి 9 గంటల నడుమ జరిగిన ఈ గరుడ సేవలో టీటీడీ ఈవో శ్రీ ముద్దాడ ర‌విచంద్ర‌, అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంక‌య్య‌ చౌదరి, తిరుప‌తి ఎస్పీ శ్రీ సుబ్బ‌రాయుడుల‌తో కలిసి నాలుగు మాడవీధుల్లో భద్రత, తాగునీరు పంపిణీ, అన్నప్రసాద వితరణ, శ్రీవారి సేవకుల సేవలు, ప్రవేశ, నిష్క్రమణ మార్గాలు, ఇతర ఇంజినీరింగ్‌ ఏర్పాట్లను పరిశీలించారు.


కాగా శ్రీవారి గరుడ వాహనం ముందు గజరాజులు ఠీవిగా నడుస్తుండగా, భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి ఉత్సవం కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.


ఈ వాహ‌న‌సేవ‌లో టీటీడీ బోర్డు స‌భ్యులు శ్రీ న‌న్న‌ప‌నేని స‌దాశివరావు, శ్రీ శాంతారామ్, ఎస్వీబీసీ చైర్మ‌న్ శ్రీ శ్రీ‌ధ‌ర్ వ‌ర్మ‌,  చీఫ్ ఇంజనీర్ శ్రీ మనోహరం, శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ లోకనాథం, వీజీఓ శ్రీ సురేంద్ర‌, ఇతర విభాగాలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

RECOVERED BAG RESTORED


A lost bag of a devotee with 61 g gold, Rs. 2,02,840 cash and land papers was found on Second Ghat Road and handed over to Home Guard Reddappa Rao at the GNC Toll Gate. 


The CCTV staff secured it and later informed the Command Control.


Sri Pothula Lakshminarayana of Sattenapalle and his family later claimed the bag. After checking of IDs and document, the bag was opened in their presence and all items were confirmed intact. The bag was returned to them.


The devotees thanked AVSOs Sri Krishnaiah, Sri Venkata Siva Kumar, TTD staff who recovered and returned it.

పొగొట్టుకున్న బ్యాగు భక్తులకు తిరిగి అప్పగింత lost bags



తిరుపతి నుండి తిరుమలకు వచ్చే రెండో ఘాట్ రోడ్డులో విలువైన ఆభరణాలు, డబ్బు ఉన్న బ్యాగును భక్తులు పోగొట్టుకోవడంతో టీటీడీ సిబ్బంది భద్రపరిచి, తగిన ఆధారాలను పరిశీలించిన అనంతరం సంబంధిత భక్తులకు యథాతథంగా అప్పగించారు.


శుక్రవారం ఉదయం సుమారు 6 గంటల సమయంలో ఘాట్ రోడ్డులో బ్యాగును గుర్తించిన బైకర్, ఉదయం 6.30 గంటలకు జీఎన్సీ టోల్‌గేట్ వద్ద విధుల్లో ఉన్న హోంగార్డు రెడ్డప్పరావుకు అప్పగించారు. అనంతరం బ్యాగును సీసీటీవీ సిబ్బంది వద్ద భద్రపరిచి, కమాండ్ కంట్రోల్ అధికారులకు సమాచారం అందించారు.


బ్యాగు కోసం వచ్చిన గుంటూరు జిల్లా బ్రాడీపేటకు చెందిన శ్రీమతి సునీత, శ్రీ పోతుల నారాయణ, కుటుంబ సభ్యులు అందించిన వివరాలు, ఆధారాలను పరిశీలించిన అనంతరం బ్యాగును తెరిచి అందులోని వస్తువులన్నీ ఉన్నాయా అని వారి చేత తనిఖీ చేయించారు. అన్ని వస్తువులు సురక్షితంగా ఉన్నాయని భక్తులు నిర్ధారించడంతో, టీటీడీ సీవీఎస్వో శ్రీ మురళీకృష్ణ సూచనల మేరకు ఏవీఎస్వోలు శ్రీ కృష్ణయ్య, శ్రీ వెంకట శివ కుమార్‌ల సమక్షంలో బ్యాగును వారికి సురక్షితంగా అప్పగించారు.


బ్యాగులో 61 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.2,02,840 నగదు, సుమారు రూ.10 లక్షల విలువైన భూమి ఒప్పంద పత్రాలు, బట్టలు ఉన్నాయి.


బ్యాగును గుర్తించి బాధ్యతాయుతంగా టీటీడీ సెక్యూరిటీ సిబ్బందికి అప్పగించిన బైకర్‌కు, అలాగే దానిని భద్రపరిచి యథాతథంగా సంబంధిత భక్తులకు అందజేసిన టీటీడీ సెక్యూరిటీ సిబ్బందికి భక్తులు కృతజ్ఞతలు తెలిపారు.