19.9.26

గరుడ సేవ కోసం తిరుమల చేరిన గొడుగులు umbrellas




తిరుమలలో రుగుతున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా గరుడ సేవ కోసం చెన్నైకు చెందిన హిందూ ధర్మార్థ సమితి తరఫున 9 గొడుగులు శుక్రవారం తిరుమలకు చేరాయి.


ఈ గొడుగులను సదరు సమితి ట్రస్టీ శ్రీ ఆర్.ఆర్. గోపాల్ జీ  టీటీడీ ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరికి అందజేశారు. వరుసగా 22వ సారి  శ్రీవారికి గొడుగులను సమర్పించడం విశేషం.


ఈ కార్యక్రమంలో టిటిడి బోర్డు సభ్యులు తదితర అధికారులు పాల్గొన్నారు.

Govula Gopanna on Kalpavriksha












In the guise of "Govula Gopanna"-the divine cowherd Alankaram, Sri Malayappa along with His two consorts fulfilled the wishes of His devotees on Kalpavriksha Vahanam.


The four day witnessed the grand procession of the celestial wish fulfilling tree that marched along four mada streets as a part of ongoing annual Brahmotsavams at Tirumala on Friday.


The vahana seva was attended by Tirumala's Sri Sri Sri Peddajeeyar Swamy, Sri Sri Sri Chinnajeeyar Swamy, TTD EO Sri Muddada Ravichandra, several Board members, Additional EO Sri Ch. Venkaiah Chowdary, CVSO Sri Muralikrishna, and others.

కల్పవృక్ష వాహనంపై గోవుల గోపన్న అలంకారంలో శ్రీమలయప్ప kalpavruksha vahanam











శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజైన శుక్రవారం ఉదయం శ్రీదేవి భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారు కల్పవృక్ష వాహనంపై గోవుల గోపన్న అలంకారంలో భక్తులను కటాక్షించారు.


తిరుమాడ వీధుల్లో అంగరంగ వైభవంగా సాగిన వాహనసేవలో పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుని భక్తిపారవశ్యంలో మునిగిపోయారు.


కల్పవృక్ష వాహనంకోరికలు తీర్చే దివ్య వాహనం


క్షీరసాగర మథనంలో ఉద్భవించిన దివ్య సంపదల్లో కల్పవృక్షం ఒకటి. కోరిన ఫలాలను ప్రసాదించే కల్పవృక్ష వాహనాన్ని అధిరోహించిన శ్రీనివాసుడు భక్తులకు సర్వాభీష్టాలను ప్రసాదించే దివ్యరూపంలో దర్శనమిచ్చారు.


వాహనసేవలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి, టీటీడీ ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్ర, పలువురు బోర్డు సభ్యులు, అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి, సీవీఎస్వో శ్రీ మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.





Vedic messages, devotional music, Annamacharya Keerthanas, Kuchipudi and Harikatha mark the celebrations

A variety of devotional and musical programmes organised by TTD Hindu Dharma Projects at the Nada Neerajanam and Asthana Mandapam on Friday, the fourth day of the Srivari Salakatla Brahmotsavams, attracted devotees.

At Nada Neerajanam, Mangala Dhwani and a Vedic message were presented in the morning, followed by a Kuchipudi dance performance in the evening.

At Asthana Mandapam, programmes including Vishnu Sahasranama Parayanam, devotional music, spiritual messages, Annamacharya Keerthanas and Harikatha immersed devotees in a spiritual atmosphere.

The programmes organised during the Brahmotsavams promote devotion and highlight the glory of Sanatana Dharma.

Divine Umbrellas for Garuda Seva Reaches Tirumala




.

Hindu Dharmartha Samiti brought nine umbrellas from Chennai to Tirumala on Friday to utilise the same during Garuda Seva on Friday evening as a part of the ongoing Srivari Salakatla Brahmotsavams. 


The Samiti Trustee, Sri R.R.Gopalji has handed over the umbrellas to the TTD officials. 


This is for the 22nd time that the Chennai-based Hindu Dharmartha Samiti has presented umbrellas to Srivaru.


TTD EO Sri Muddada Ravi Chandra, Additional EO Sri Ch. Venkaiah Chowdary and other officials participated in this program.

బ్రహ్మోత్సవాల్లో ఆకట్టుకున్న ధార్మిక, సంగీత కార్యక్రమాలు devotional music




వేద సందేశం.. భక్తి సంగీతం.. అన్నమయ్య సంకీర్తనలు.. కూచిపూడి, హరికథతో ఆధ్యాత్మిక సందడి


శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజైన శుక్రవారం తిరుమలలోని నాదనీరాజనం, ఆస్థాన మండపాల్లో టీటీడీ హిందూ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో నిర్వహించిన ధార్మిక, సంగీత కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

నాదనీరాజనం వేదికపై ఉదయం మంగళధ్వని, వేద సందేశం, సాయంత్రం కూచిపూడి నృత్య ప్రదర్శన భక్తులను అలరించాయి.

ఆస్థాన మండపంలో విష్ణు సహస్రనామ పారాయణం, భక్తి సంగీతం, భక్తి సందేశం, అన్నమయ్య సంకీర్తనలు, హరికథ కార్యక్రమాలు భక్తులను ఆధ్యాత్మిక భావనలో ముంచెత్తాయి.

శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాలు భక్తిభావాన్ని పెంపొందిస్తూ, సనాతన ధర్మ వైభవాన్ని చాటిచెబుతున్నాయి.

గరుడసేవ రోజున స్వామి పుష్కరిణిలోకి ఉదయం 3 గంటల నుండే భక్తులకు అనుమతి pushkarini




శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా సెప్టెంబర్ 19 తేదీన నిర్వహించనున్న గరుడసేవ రోజున ఉదయం 3 గంటల నుండే భక్తులను స్వామి పుష్కరిణిలోకి అనుమతిస్తారు.


సాధారణంగా ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు భక్తులను పుష్కరిణిలో స్నానమాచరించేందుకు అనుమతించడం జరుగుతోంది. అయితే గరుడసేవ రోజున భక్తుల అధిక రద్దీని దృష్టిలో ఉంచుకుని, గరుడసేవ రోజున ఉదయం 3 గంటల నుండే పుష్కరిణిని తెరిచి భక్తులను అనుమతించాలని టీటీడీ నిర్ణయించింది.