21.7.26

₹1Cr Donation to TTD



Sri Tirumala Kumar Kanakamedala, CEO of Anblicks Cloud Data Engineering Private Limited, Vijayawada, donated Rs. One crore to the TTD Sri Venkateswara Vidyadana Trust on Monday.

The donor handed over the donation DDs to TTD Temple Dy EO Sri Lokanatham at the Ranganayakula Mandapam inside the Sri Venkateswara Temple.


Sri Kalyana Venateswara Swamy Vari Paruveta Utsavam Celebrated with Grandeur






The annual Paruveta Utsavam of Sri Kalyana Venkateswara Swamy was celebrated with great religious fervour on Monday at Srinivasamangapuram, near Srivari Mettu, the sacred path believed to have been traversed by Lord Venkateswara

The processional deities were taken in a grand procession from the temple to the Paruveta Mandapam at 7 a.m. amid Vedic chanting and traditional music. After the customary offerings, the Paruveta ritual was performed. 

A special highlight of the festival was the symbolic act of the Lord throwing the spear three times, signifying the destruction of evil. An Asthanam was also held, and the deities were taken back to the temple in the evening.

As part of the celebrations, artists from the TTD Annamacharya Project rendered devotional Sankirtans, while Bhajan groups performed devotional songs and Kolatam, creating a spiritually vibrant atmosphere. Anna Prasadam was distributed to devotees near Srivari Mettu.

TTD JEO Dr. A. Sharath, Special Grade Deputy EO Smt. Varalakshmi, AEO Sri Gopinath, Superintendent Sri Raj Kumar, temple priests led by Sri Balaji Rangacharyulu, Temple Inspectors Sri Munikumar and Sri Dhanasekhar Jaya, other officials, priests, and a large number of devotees participated in the event.

జూలై 21న శ్రీ సౌమ్యనాథ స్వామివారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ-జూలై 22న ధ్వజారోహణంతో వైభవంగా బ్రహ్మోత్సవాల ప్రారంభం nandaluru




కడప జిల్లా నందలూరులో వెలసిన ప్రాచీన, ప్రసిద్ధ శ్రీ సౌమ్యనాథ స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఆధ్యాత్మిక వైభవాన్ని సంతరించుకోనున్నాయి. జూలై 21 సాయంత్రం 6 గంటలకు మేదినిపూజ, సేనాధిపతి ఉత్సవం, అంకురార్పణతో ఉత్సవాలకు శ్రీకారం చుడుతారు. జూలై 22 ఉదయం ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు శాస్త్రోక్తంగా ప్రారంభమవుతాయి.

ఉత్సవాలకు విచ్చేసే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ పరిసరాల్లో చలువ పందిళ్లు, తాగునీటి సదుపాయాలు, విద్యుత్ దీపాలంకరణలు, రంగవల్లులతో టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.

ప్రతిరోజూ దివ్య వాహనసేవల్లో స్వామివారి దర్శన భాగ్యం

బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రతిరోజూ ఉదయం 8 గంటలకు, రాత్రి 7 గంటలకు శ్రీ సౌమ్యనాథ స్వామివారు వివిధ దివ్య వాహనాలపై ఆలయ మాడవీధుల్లో విహరించి భక్తులకు దివ్య మంగళదర్శనం ప్రసాదించనున్నారు.

వాహనసేవల విశేషాలు

•  జూలై 22: ఉదయం – ధ్వజారోహణం, రాత్రి – యాలి వాహనం

•  జూలై 23: ఉదయం – పల్లకీ సేవ, రాత్రి – హంస వాహనం

•  జూలై 24: ఉదయం – పల్లకీ సేవ, రాత్రి – సింహ వాహనం

•  జూలై 25: ఉదయం – కల్పవృక్ష వాహనం, రాత్రి – హనుమంత వాహనం

•  జూలై 26: ఉదయం – శేష వాహనం, రాత్రి – గరుడ వాహనం

•  జూలై 27: ఉదయం – సూర్యప్రభ వాహనం, రాత్రి – చంద్రప్రభ వాహనం

•  జూలై 28: ఉదయం 10 గంటలకు – ఆర్జిత కల్యాణోత్సవం, రాత్రి – గజ వాహనం

•  జూలై 29: ఉదయం 9 గంటలకు – రథోత్సవం, రాత్రి – అశ్వ వాహనం

•  జూలై 30: ఉదయం – చక్రస్నానం, రాత్రి – ధ్వజావరోహణం

•  జూలై 31: సాయంత్రం 6 గంటలకు – పుష్పయాగం

జూలై 28 ఆర్జిత కల్యాణోత్సవం

జూలై 28న ఉదయం 10 గంటలకు నిర్వహించే ఆర్జిత కల్యాణోత్సవంలో గృహస్థ దంపతులు రూ.500/- చెల్లించి పాల్గొనవచ్చు. పాల్గొనే ప్రతి దంపతులకు ఒక ఉత్తరీయం, ఒక రవికెతో పాటు అన్నప్రసాదాలను టీటీడీ బహుమతిగా అందజేస్తుంది.

ప్రతిరోజూ భక్తి సంగీతంహరికథలుసంకీర్తనల సందడి

బ్రహ్మోత్సవాల సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టు, దాససాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ప్రతిరోజూ భక్తి సంగీతం, హరికథలు, సంకీర్తనలు, ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని అందించనున్నారు.

భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి శ్రీ సౌమ్యనాథ స్వామివారి దివ్య బ్రహ్మోత్సవాల్లో పాల్గొని స్వామివారి అనుగ్రహానికి పాత్రులు కావాలని టీటీడీ కోరుతోంది.

వైభవంగా శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి పార్వేట ఉత్సవం - శ్రీవారిమెట్టు సమీపంలో భక్తిశ్రద్ధలతో అన్నప్రసాదాల పంపిణీ paruveta utsavam






శ్రీవేంకటేశ్వరస్వామివారు నడిచిన పవిత్ర మార్గంగా భక్తులు విశ్వసించే శ్రీవారిమెట్టు సమీపంలో ఉన్న శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి పార్వేట ఉత్సవం సోమవారం అత్యంత వైభవంగా జరిగింది.

ఉదయం 7 గంటలకు ఆలయం నుంచి ఉత్సవమూర్తులు మంగళవాయిద్యాలు, వేదమంత్రోచ్ఛారణల మధ్య ఊరేగింపుగా బయలుదేరి శ్రీవారిమెట్టు సమీపంలోని పార్వేట మండపానికి చేరుకున్నారు. అక్కడ క్షేమతలిగ నివేదన అనంతరం పార్వేట ఉత్సవాన్ని నిర్వహించారు. దుష్టశిక్షణకు ప్రతీకగా స్వామివారు మూడుసార్లు బళ్లెంను ప్రయోగించే విశిష్ట ఘట్టం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. అనంత‌రం ఆస్థానం నిర్వ‌హించారు. త‌రువాత సాయంత్రం ఉత్సవమూర్తులను తిరిగి ఆలయానికి తీసుకువచ్చారు.

అన్నమయ్య సంకీర్తనలుభజనలు - అన్నప్రసాదాల పంపిణీ

పార్వేట ఉత్సవం సందర్భంగా టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు భక్తి సంకీర్తనలు ఆలపించి ఆధ్యాత్మిక వాతావరణాన్ని నెలకొల్పారు. భజన బృందాలు భజనలు, కోలాటాలతో భక్తులను అలరించగా, అనంతరం విచ్చేసిన భక్తులకు అన్నప్రసాదాలను పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో జేఈవో డా.ఎ.శ‌ర‌త్‌, ఆలయ ప్ర‌త్యేక‌శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీమ‌తి వ‌ర‌ల‌క్ష్మీ, ఏఈవో శ్రీ గోపినాధ్‌, సూపరింటెండెంట్‌ శ్రీ రాజ్‌కుమార్‌, ఆల‌య‌ అర్చకులు శ్రీ బాలాజీ రంగాచార్యులు, టెంపుల్ ఇన్‌స్పెక్టర్లు శ్రీ మునికుమార్‌, శ్రీ ధ‌నశేఖ‌ర్‌జ‌య‌, ఇతర అధికారులు, అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

Ankurarpanam for Sri Soumyanatha Swamy Brahmostavams on 21st July




The annual Sri Soumyanatha Swamy Brahmotsavams at the ancient temple in Nandalur, Kadapa district, will begin with Ankurarpanam at 6 p.m. on July 21, followed by Dwajarohanam on the morning of July 22.

During the nine-day festival, the deity will bless devotees on different Vahana Sevas every day at 8 a.m. and 7 p.m. Special events include Arjita Kalyanotsavam on July 28, Rathotsavam on July 29, Chakrasnanam and Dhwajavarohanam on July 30, and Pushpayagam on July 31.

TTD has made elaborate arrangements, including drinking water, shelters, illumination, and decorations for devotees. Devotional music, Harikathas, Sankirtans, and cultural programmes will be organised daily by the Hindu Dharma Prachara Parishad, Annamacharya Project, and Dasa Sahitya Project.