21.8.26

వన్యప్రాణుల సంరక్షణ, భక్తుల భద్రతకు రోబోట్ డాగ్ వినియోగంపై పరిశీలన తిరుమల అటవీ ప్రాంతాల్లో రియల్‌టైమ్ మానిటరింగ్‌కు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం tobot dog




తిరుమలలో వన్యప్రాణుల కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడంతోపాటు భక్తుల భద్రతను మరింత పటిష్టం చేసేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించే దిశగా టీటీడీ చర్యలు చేపడుతోంది.

ఇందులో భాగంగా గురువారం తిరుమలలోని పద్మావతి అతిథి గృహం వద్ద క్వాడ్రుపెడ్ రోబోట్ (నాలుగు కాళ్ల రోబోట్ డాగ్) పనితీరును టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి అధికారులతో కలిసి పరిశీలించారు. అటవీ ప్రాంతాల్లో మనుషులు వెళ్లడానికి ఇబ్బందికరమైన, ప్రమాదకరమైన ప్రాంతాల్లో వన్యప్రాణుల కదలికలను పర్యవేక్షించేందుకు ఈ రోబోట్‌ను వినియోగించే అవకాశాలపై వివరాలు తెలుసుకున్నారు.

ఈ రోబోట్‌లో ఆప్టికల్ కెమెరా, థర్మల్ ఇమేజింగ్ కెమెరా, 360 డిగ్రీల లైడార్, వివిధ సెన్సార్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తదితర ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉన్నాయి. వీటి సహాయంతో చీకటి, పొగమంచు వంటి పరిస్థితుల్లోనూ వన్యప్రాణుల కదలికలను గుర్తించి పర్యవేక్షించే అవకాశం ఉంటుంది.

రోబోట్‌లోని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థ పెద్ద జంతువులు, మనుషులు, వాహనాలు, పశువులను గుర్తించి వర్గీకరించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. వన్యప్రాణుల కదలికలను గుర్తించినప్పుడు జియో-ట్యాగ్‌డ్ అలర్ట్‌ను పంపడంతోపాటు లైవ్ వీడియో, థర్మల్ ఫీడ్‌ను కంట్రోల్ రూమ్, పెట్రోలింగ్ సిబ్బందికి అందించే విధంగా వ్యవస్థను వినియోగించే అవకాశాలను పరిశీలించారు.

ముఖ్యంగా అలిపిరి–తిరుమల కాలిబాటకు ఆనుకుని ఉన్న అటవీ ప్రాంతాల్లో చిరుతలు, ఇతర వన్యప్రాణుల సంచారాన్ని ముందుగానే గుర్తించి భక్తులను అప్రమత్తం చేయడంతోపాటు, అటవీ, విజిలెన్స్, భద్రతా సిబ్బంది వేగంగా స్పందించేందుకు ఈ సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగపడుతుంది.

వన్యప్రాణులు భక్తుల రాకపోకల ప్రాంతం వైపు వచ్చినప్పుడు రోబోట్‌లోని సౌండ్, లైట్ యూనిట్లను ఉపయోగించి ఎలాంటి భౌతిక తాకిడి లేకుండా వాటిని తిరిగి అటవీ ప్రాంతం వైపు మళ్లించే అవకాశాన్ని కూడా పరిశీలించారు. తద్వారా మనుషులు–వన్యప్రాణుల మధ్య ప్రత్యక్ష ఘర్షణకు అవకాశముండదు.

ఈ రోబోట్ ఇప్పటికే అమల్లో ఉన్న కెమెరా ట్రాప్‌లు, ఫుట్ పెట్రోలింగ్, అటవీ సిబ్బంది నిఘా వ్యవస్థలకు ప్రత్యామ్నాయంగా కాకుండా, వాటికి అదనంగా మొబైల్ మానిటరింగ్ వ్యవస్థగా పనిచేసేలా వినియోగించే ఆస్కారం ఉంటుంది. అవసరాన్ని బట్టి వన్యప్రాణుల కదలికలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో దీనిని త్వరగా మోహరించే వీలుంటుంది.

అటవీ ప్రాంతాల్లో రోబోట్ ద్వారా సేకరించే వీడియో, థర్మల్ చిత్రాలు, వన్యప్రాణుల కదలికలకు సంబంధించిన సమాచారాన్ని విశ్లేషించడం ద్వారా వాటి సంచారాన్ని మరింత సమర్థవంతంగా అర్థం చేసుకుని, అవసరమైన ప్రాంతాల్లో సిబ్బంది పెట్రోలింగ్ సమయాలు, నిఘాను మెరుగుపరచే అవకాశాలు మెరుగుపడతాయి.

Tirumala Nambi 1053rd Avatara Mahotsavams Held





The 1053rd Avatara Mahotsavam of the renowned Vaishnavite Acharya Sri Tirumala Nambi was grandly celebrated on Thursday at the Sri Tirumala Nambi Temple, located on South Mada Street in Tirumala.

As part of the celebrations, Vedic scholars rendered Veda Parayanam, Prabandha Parayanam, Ramayanam and recitations from various epics and Puranas in a melodious manner.

Sri T.K. Seshadri Swamy and Sri T.K. Mukunda Tatacharyulu, descendants of Tirumala Nambi, along with other members of the Tirumala Nambi lineage, participated in the celebrations.

Meanwhile, tomorrow morning, the first bell Naivedyam of Venkateswara will be offered to Tirumala Nambi. Subsequently, 16 eminent scholars will deliver discourses on the life history of Tirumala Nambi.

20.8.26

SRI VAISHNAVA ACHARYAS DEVOTION AND SURRENDER ARE EXEMPLARY – SCHOLAR SRI MADABHUSHI ANANTHALWAN





The three-day national conference on “Spiritual Services of Sri Vaishnava Acharyas”, organised by the TTD Alwar Divya Prabandha Project at Annamacharya Kala Mandir, concluded on Wednesday.

Addressing the valedictory session, renowned scholar Sri Madabhushi Ananthalwan said the devotion, surrender, Acharya bhakti and service-oriented path shown by Sri Vaishnava Acharyas remain an inspiration for the present generation.

Scholars and Acharyas from across the country spoke on the spiritual contributions of Sri Ramanujacharya, Embar, Andal, Dasharathi, Parasara Bhattar and other Acharyas, highlighting bhakti, prapatti and kainkaryam.

The conference provided a valuable platform to share and preserve the spiritual heritage of the Sri Vaishnava tradition for future generations.

Special Officer, Alwar Divya Prabandha Project, Sri Tirumalishai Alwar, scholars, researchers and devotees participated.

ASHTABANDHANA MAHA SAMPROKSHANAM FROM AUGUST 23 AT DEVUNI KADAPA – TTD JEO Dr. A. SHARATH REVIEWS ARRANGEMENTS






The Ashtabandhana Maha Samprokshanam of Sri Lakshmi Venkateswara Swamy Temple at Devuni Kadapa will be conducted as per Agama traditions from August 23 to 26, said TTD JEO Dr. A. Sharath. He inspected the arrangements at the temple on Wednesday.

The JEO directed officials to complete all arrangements on time, including engineering and electrical works. He also instructed them to decorate the temple with flowers and lighting and complete the brass sheet works on the Dhwajasthambham and Bali Peetham by August 21. He stressed that all necessary facilities should be provided to ensure a comfortable visit for devotees.

The JEO was traditionally welcomed by the priests and had darshan of Sri Lakshmi Venkateswara Swamy after circumambulating the temple amid auspicious music.

Arrangements Reviewed at Vontimitta Temple

Later, Dr. Sharath visited Sri Kodandarama Swamy Temple at Vontimitta and reviewed the queue lines, kitchen, Yagashala, prasadam distribution and other pilgrim facilities. He gave necessary instructions to the officials.

He also inspected the site proposed for the 100-room accommodation complex to be constructed by TTD and reviewed the ongoing development works near the Kalyana Vedika.

TTD CE Sri Manoharam, Deputy EO Smt. A. Prashanthi, EE Smt. Sumathi, Deputy EE Sri Nagaraju, Temple AEO Sri N. Ravi, Superintendent Sri Hanumanthaiah, Temple Inspectors Sri Eshwar Reddy and Sri Mohan Babu, priests and others participated.

₹15 Lakhs Donation to TTD




Dr. P. Shilpa and Dr. Sridhar Reddy, a couple from Hyderabad, donated Rs.15 lakh to the TTD-run Sri Venkateswara Pranadana Trust on Wednesday.

The donors handed over the donation cheque to TTD Additional Executive Officer Sri Ch. Venkayya Chowdary at the Additional EO’s Camp Office in Tirumala.

దేవుని కడపలో ఆగస్టు 23 నుంచి అష్టబంధన మహా సంప్రోక్షణ – ఏర్పాట్లను పరిశీలించిన టీటీడీ జేఈవో డాక్టర్ ఏ. శరత్ samprokshanam






కడప జిల్లా దేవుని కడపలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఆగస్టు 23 నుంచి 26 తేదీ వరకు అష్టబంధన మహా సంప్రోక్షణ కుంభాభిషేకాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించనున్నట్లు టీటీడీ జేఈవో డాక్టర్ . శరత్ తెలిపారు. బుధవారం ఆయన అధికారులతో కలిసి ఆలయాన్ని సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు.

మహా సంప్రోక్షణకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను జేఈవో ఆదేశించారు. ఇంజినీరింగ్, విద్యుత్ పనులను త్వరగా పూర్తి చేయడంతోపాటు విద్యుత్ దీపాలు, పుష్పాలతో ఆలయాన్ని సుందరంగా అలంకరించాలన్నారు. ధ్వజస్తంభం, బలిపీఠానికి సంబంధించిన ఇత్తడి రేకు పనులను ఆగస్టు 21లోగా పూర్తి చేయాలని సూచించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేపట్టాలని ఆదేశించారు.

ఆలయానికి చేరుకున్న జేఈవోకు అర్చకులు సాంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ ఆలయ ప్రదక్షిణ అనంతరం శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరస్వామివారిని దర్శించుకున్నారు.

ఒంటిమిట్ట ఆలయంలోనూ ఏర్పాట్ల పరిశీలన

అనంతరం జేఈవో ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి ఆలయాన్ని సందర్శించి స్వామివారిని దర్శించుకున్నారు. క్యూలైన్లు, పోటు, యాగశాల, ప్రసాదాల పంపిణీ తదితర భక్తుల సౌకర్యాలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.

అనంతరం టీటీడీ నిర్మించనున్న 100 గదుల వసతి సముదాయం కోసం కేటాయించనున్న స్థలాన్ని, కల్యాణ వేదిక వద్ద జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు.

ఈ కార్యక్రమంలో సీఈ శ్రీ మనోహరం, డిప్యూటీ ఈవో శ్రీమతి ఎ. ప్రశాంతి, శ్రీమతి సుమతి, డిప్యూటీ ఈఈ శ్రీ నాగరాజు, ఆలయ ఏఈవో శ్రీ ఎన్. రవి, సూపరింటెండెంట్ శ్రీ హనుమంతయ్య, టెంపుల్ ఇన్‌స్పెక్టర్లు శ్రీ ఈశ్వర్ రెడ్డి, శ్రీ మోహన్ బాబు, ఆలయ అర్చకులు తదితరులు పాల్గొన్నారు.