28.8.26

Special Festivals at Sri Padmavati Ammavari Temple in September




Several special festivals and sevas will be conducted as per Agama traditions at Tiruchanoor Sri Padmavathi Ammavari Temple and other TTD temples during September.

Sri Padmavathi Ammavari Temple, Tiruchanoor

•  Sept. 4, 11, 18 & 25: Sri Padmavathi Ammavaru will bless devotees on a Tiruchi through the four Mada streets at 6 pm.

•  Sept. 22: On Uttarashada Nakshatram, Ammavaru will take a procession on Gaja Vahanam at 6.45 pm.

Sri Balaramakrishna Swamy Temple

•  Sept. 4: On Rohini Nakshatram, Sri Krishna Swamy will take a Tiruchi procession at 7 pm.

Sri Sundararaja Swamy Temple

•  Sept. 27: On Uttarabhadra Nakshatram, Sri Sundararaja Swamy will take a Tiruchi procession at 6 pm.

Sri Suryanarayana Swamy Temple

•  Sept. 13: On Hasta Nakshatram, Sri Suryanarayana Swamy will take a Tiruchi procession at 5 pm.

Tiruchanoor Srinivasa Temple

•  Sept. 5, 12, 19 & 26: Special Abhishekam will be performed to the Moolavirat of Sri Venkateswara Swamy.

Appalayagunta Sri Prasanna Venkateswara Swamy Temple

•  Sept. 1: Ashtadala Padapadmaradhana Seva at 8 am.

•  Sept. 4, 11, 18 & 25: Vastra Alankarana Seva and Abhishekam at 7 am.

•  Sept. 9: Ashtottara Shata Kalasabhishekam at 8 am.

•  Sept. 23: Grand Kalyanotsavam of Sri Prasanna Venkateswara Swamy with Sridevi and Bhudevi.

•  Sept. 6, 13, 20 & 27: Abhishekam to Sri Prasanna Anjaneya Swamy at 8.15 am.

Devotees are requested to participate in these special festivals and sevas and receive the blessings of the deities.

సెప్టెంబరులో శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో విశేష ఉత్సవాలు padmavati ammavari temple




తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో సెప్టెంబరు నెలలో పలు విశేష ఉత్సవాలు, సేవలు ఆగమోక్తంగా నిర్వహించనున్నారు. కార్యక్రమాల వివరాలు ఇలా ఉన్నాయి.

శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో..

సెప్టెంబరు 4, 11, 18, 25వ తేదీల్లో శుక్రవారం సందర్భంగా సాయంత్రం 6 గంటలకు శ్రీ పద్మావతి అమ్మవారు తిరుచ్చిపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమివ్వనున్నారు.

సెప్టెంబరు 22న ఉత్తరాషాఢ నక్షత్రం సందర్భంగా సాయంత్రం 6.45 గంటలకు శ్రీ పద్మావతి అమ్మవారు గజవాహనంపై విహరించి భక్తులను కటాక్షించనున్నారు.

శ్రీ బలరామకృష్ణస్వామి ఆలయంలో..

సెప్టెంబరు 4న రోహిణి నక్షత్రం సందర్భంగా రాత్రి 7 గంటలకు శ్రీ కృష్ణస్వామివారికి తిరుచ్చి ఉత్సవం నిర్వహించనున్నారు.

శ్రీ సుందరరాజస్వామి ఆలయంలో..

సెప్టెంబరు 27న ఉత్తరాభాద్ర నక్షత్రం సందర్భంగా సాయంత్రం 6 గంటలకు శ్రీ సుందరరాజస్వామివారు తిరుచ్చి వాహనంపై విహరించి భక్తులకు దర్శనమివ్వనున్నారు.

శ్రీ సూర్యనారాయణస్వామి ఆలయంలో..

సెప్టెంబరు 13న హస్తా నక్షత్రం సందర్భంగా సాయంత్రం 5 గంటలకు శ్రీ సూర్యనారాయణస్వామివారు తిరుచ్చి వాహనంపై విహరించి భక్తులకు దర్శనమివ్వనున్నారు.

తిరుచానూరు శ్రీనివాస ఆలయంలో..

సెప్టెంబరు 5, 12, 19, 26వ తేదీల్లో శ్రీ వేంకటేశ్వరస్వామివారి మూలవర్లకు విశేషంగా అభిషేకం నిర్వహించనున్నారు.

అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో..

సెప్టెంబరు 1న ఉదయం 8 గంటలకు అష్టదళ పాదపద్మారాధన సేవ నిర్వహించనున్నారు.

సెప్టెంబరు 4, 11, 18, 25వ తేదీల్లో శుక్రవారం సందర్భంగా ఉదయం 7 గంటలకు వస్త్రాలంకరణ సేవ, అభిషేకం నిర్వహించనున్నారు.

సెప్టెంబరు 9న ఉదయం 8 గంటలకు అష్టోత్తర శత కలశాభిషేకం నిర్వహించనున్నారు.

సెప్టెంబరు 23న శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి కల్యాణోత్సవం వైభవంగా నిర్వహించనున్నారు.

సెప్టెంబరు 6, 13, 20, 27వ తేదీల్లో ఉదయం 8.15 గంటలకు శ్రీ ప్రసన్న ఆంజనేయస్వామివారికి అభిషేకం నిర్వహించనున్నారు.

టీటీడీ ఆసుపత్రుల్లో మరింత మెరుగైన వైద్య సేవలు టీటీడీ చైర్మన్ ttd hospitals


టీటీడీ ఆసుపత్రుల్లో  మరింత మెరుగైన వైద్య సేవలు అందిస్తామని టీటీడీ చైర్మన్ శ్రీ బీ.ఆర్.నాయుడు తెలియజేశారు. స్విమ్స్ నూతన డైరెక్టర్ గా నియమితులైన డాక్టర్ జగదీష్ గురువారం ఉదయం తిరుమలలోని టీటీడీ చైర్మన్ క్యాంపు కార్యాలయంలో చైర్మన్ శ్రీ బీ.ఆర్.నాయుడును మర్యాదపూర్వకంగా కలిశారు. సందర్భంగా డాక్టర్ జగదీష్ ను చైర్మన్ అభినందించారు.


అనంతరం చైర్మన్ విలేకర్లతో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు స్విమ్స్ హాస్పిటల్ కు డాక్టర్ జగదీష్ ను డైరెక్టర్ గా నియమించడం జరిగిందన్నారు. చాలా అనుభవజ్ఞులైన, గొప్ప పేరు, దూరదృష్టి గల వైద్యులైన డాక్టర్ జగదీష్ నేతృత్వంలో స్విమ్స్ ఆసుపత్రిలో అత్యున్నతమైన వైద్య సేవలు అందుతాయని తెలిపారు.


స్విమ్స్‌ ఆసుపత్రిని కోట్లాది రూపాయలతో అభివృద్ధి చేస్తున్నామని, త్వరలో చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని అందుబాటులోకి తీసుకొస్తామని తెలియజేశారు.


స్విమ్స్ నూతన డైరెక్టర్ డాక్టర్ జగదీష్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు సంకల్పం మేరకు, చైర్మన్ బిఆర్ నాయుడు, ఈఓ రవిచంద్ర సూచనలు ప్రకారం స్విమ్స్ ఆసుపత్రిని ను అభివృద్ధి చేస్తామని చెప్పారు.


తిరుపతిని ఇంటిగ్రేటెడ్ మెడికల్ హబ్ గా తీర్చిదిద్దేందుకు అహర్నిశలు శ్రమిస్తామని, స్విమ్స్ ఆసుపత్రిలో వైద్యంపై రోగుల్లో నమ్మకం కలగించి ఎప్పటికప్పుడు అత్యాధునిక వైద్యం అందించే చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎన్టీఆర్ వైద్యసేవలను మరింత విస్తరించి పేదరోగులకు ఆర్థిక భారం తగ్గిస్తామని తెలియజేశారు.


ఘనంగా ముగిసిన శ్రీ వేణుగోపాలస్వామివారి తెప్పోత్సవాలు teppotsavams


కార్వేటినగరం శ్రీ వేణుగోపాలస్వామివారి తెప్పోత్సవాలు గురువారం రాత్రి భక్తిశ్రద్ధలతో ఘనంగా ముగిశాయి. సందర్భంగా ఆలయంలో ఆగమశాస్త్రోక్తంగా పలు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.


ఉదయం 9 నుంచి 10 గంటల వరకు శ్రీ స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనంతో విశేషంగా అభిషేకం చేశారు. అనంతరం సాయంత్రం 5.30 గంటలకు స్వామి, అమ్మవార్లకు తిరువీధి ఉత్సవం వైభవంగా నిర్వహించారు.


రాత్రి 7.30 గంటలకు స్కంధ పుష్కరిణిలో శ్రీ రుక్మిణి, సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామివారు దేవేరులతో కలిసి తెప్పపై విహరించి భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారి తెప్ప విహారాన్ని తిలకించిన భక్తులు భక్తిపారవశ్యంతో స్వామివారిని దర్శించుకున్నారు.


ఈ కార్యక్రమంలో ఆలయ సూపరింటెండెంట్ శ్రీ శ్రీనివాసులు రెడ్డి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ వీరాస్వామి, ఇతర అధికారులు, సిబ్బంది, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.


ఆగస్టు 31న మహతిలో పదవీ విరమణ ఉద్యోగులకు సన్మానం mahati auditorium




ఆగస్టు నెలలో పదవీ విరమణ పొందుతున్న టీటీడీ ద్యోగులకు ఆగస్టు 31 తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో ఘనంగా సన్మా కార్యక్రమం నిర్వహించనున్నారు.

టీటీడీలో ఎన్నో సంవత్సరాలపాటు విధులు నిర్వర్తించి సంస్థకు అందించిన సేవలను గుర్తించి, పదవీ విరమణ పొందుతున్న ఉద్యోగులను ఈ సందర్భంగా సత్కరించనున్నారు.

టీటీడీ సేవల్లో ఉద్యోగుల కృషి, అంకితభావం, బాధ్యతాయుతమైన విధి నిర్వహణ ఎంతో విలువైనదని, వారి సేవలు సంస్థ అభివృద్ధిలో చిరస్మరణీయంగా నిలుస్తాయని ఈ కార్యక్రమం ద్వారా గౌరవించనున్నారు.

27.8.26

Ashtabandhana Maha Samprokshanam held at Devuni Kadapa Temple








Ashtabandhana Maha Samprokshanam of Sri Lakshmi Venkateswara Swamy Temple at Devuni Kadapa was performed in a grand and devotional manner on Wednesday as per Agama traditions. TTD EO Sri Muddada Ravichandra participated in the sacred ceremony.

As part of the renovation rituals, Chatushthanarchana, Murthi Homam and Prayaschitta Homam were performed at 7 am. From 9.45 am to 11.30 am, Maha Purnahuti, Maha Samprokshanam and Kalakarshana were performed by the temple priests during Shravana Nakshatra and Tula Lagna.

Amid Vedic chants and auspicious temple music, the Maha Samprokshanam was performed with devotion. Special prayers were offered for the restoration of the sanctity and glory of the temple.

Following the Maha Samprokshanam, darshan of Sri Lakshmi Venkateswara Swamy resumed for devotees.

TTD EO Offers Prayers at Vontimitta Temple

Earlier, TTD EO Sri Muddada Ravichandra offered prayers to Sri Kodandarama Swamy at Ontimitta. The temple priests accorded him a traditional welcome and performed special rituals. He was later presented with Teertha Prasadam.

The priests explained to the EO the spiritual and historical significance of the temple.

JEO Dr. A. Sharath, Temple Deputy EO Smt. A. Prashanthi, AEO Sri Ravi, Superintendent Sri Hanumanthayya, Temple Inspector Sri Eshwar Reddy, temple priests and other officials participated.