31.8.26

Kareeri Isthi Ankurarpanam Held



Appeasing the rain god, TTD commenced Kareeri Isthi, Varuna Japa, Parjanyashanti Yagam with Ankurarpanam on Sunday evening at Dharmagiri Veda Vignana Peetham in Tirumala.


As part of it Ganapathi Puja, Punyahavachanam, Ankurarpanam were performed.


Every day there will be homams between 9 AM and 12noon till September 03. A total of 32 Ritwiks belonging to Veda, Shrouta, Smartha Sakhas will perform these Yagams.


The Principal Sri KSS Avadhani is supervising the arrangements.

కారీరిష్టి యాగం, వరుణజపం, ప‌ర్జ‌న్య‌శాంతి హోమానికి శాస్త్రోక్తంగా అంకురార్పణ ankurarpanam



రాష్ట్రం, దేశం సుభిక్షంగా ఉండాల‌ని, స‌కాలంలో వ‌ర్షాలు కుర‌వాల‌ని శ్రీ‌వారిని ప్రార్థిస్తూ తిరుమ‌ల ధ‌ర్మ‌గిరి వేద విజ్ఞాన పీఠంలో టీటీడీ చేపట్టిన కారీరిష్టి యాగం, వరుణజపం, ప‌ర్జ‌న్య‌శాంతి హోమాల‌కు ఆదివారం రాత్రి శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. ఇందులో భాగంగా గణపతి పూజ, పుణ్యాహవచనం, ప్రాయశ్చిత్త హోమం, అంకురార్పణ చేపట్టారు.


సెప్టెంబర్ 3వ తేదీ వరకు ప్రతిరోజూ ఉదయం 9 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ యాగ కార్యక్రమాలు నిర్వహిస్తారు. 32 మంది వేద‌, శ్రౌత‌, స్మార్థ‌పండితులు యాగ కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు. చివరి రోజు మ‌హాపూర్ణాహుతి నిర్వ‌హిస్తారు. ధ‌ర్మ‌గిరి వేద విజ్ఞ‌న పీఠం ప్రిన్సిపాల్ శ్రీ కెఎస్ఎస్‌.అవ‌ధాని ఆధ్వ‌ర్యంలో ఈ యాగ కార్యక్రమాలు జ‌రుగుతున్నాయి.

సహజ జీవనమే ఆరోగ్యానికి శాశ్వత పునాది – ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు డా. మంతెన సత్యనారాయణ రాజు GOOD HEALTH




ప్రకృతికి అనుగుణంగా జీవించడం, సహజ ఆహారం తీసుకోవడం, తగినంత విశ్రాంతి, స్వచ్ఛమైన నీరు, గాలిని అలవాటుగా చేసుకోవడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యాన్ని సాధించవచ్చని ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు డా. మంతెన సత్యనారాయణ రాజు తెలిపారు.


ఆయుష్‌, టీటీడీ ఆధ్వర్యంలో తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో నిర్వహించిన “యోగ, ప్రకృతి వైద్యంతో ఆరోగ్య పరిరక్షణ” అవగాహన కార్యక్రమం ఆదివారం ఘనంగా ముగిసింది.


ఈ సందర్భంగా డా. మంతెన సత్యనారాయణ రాజు మాట్లాడుతూ, ఆధునిక జీవనశైలిలో మారుతున్న ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ లోపించడం, తగినంత విశ్రాంతి లేకపోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని తెలిపారు. సహజ ఆహారం, స్వచ్ఛమైన నీరు, స్వచ్ఛమైన గాలి, తగినంత విశ్రాంతి ఆరోగ్య సంజీవినిలోని నాలుగు ముఖ్య అంశాలని పేర్కొన్నారు. ఆరోగ్యంపై ముందుగానే శ్రద్ధ వహించి మంచి జీవన అలవాట్లు పాటిస్తే అనేక అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండవచ్చన్నారు.


భావోద్వేగ ఆరోగ్యంతోనే సంపూర్ణ ఆరోగ్యం


శ్రీ బాలకృష్ణ, వైస్‌ ప్రెసిడెంట్‌, బెటర్‌ లివింగ్‌ సైన్స్‌, టెక్నాలజీ అండ్‌ డిజిటల్‌ వెల్‌నెస్‌


శారీరక ఆరోగ్యంతో పాటు భావోద్వేగ ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవడం అత్యంత అవసరమని బెటర్‌ లివింగ్‌ సైన్స్‌, టెక్నాలజీ అండ్‌ డిజిటల్‌ వెల్‌నెస్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ శ్రీ బాలకృష్ణ తెలిపారు.

వేగవంతమైన జీవనశైలిలో ఒత్తిడి, ఆందోళన, కోపం, నిరాశ వంటి భావోద్వేగాలను సమతుల్యంగా నిర్వహించుకోవాలని సూచించారు. సానుకూల ఆలోచనలు.. ప్రశాంతమైన మనసు.. ఆనందమయ జీవితంకు బలమైన పునాదులని చెప్పారు.


ప్రతిరోజూ కొంత సమయం యోగా, ధ్యానం, వ్యాయామానికి కేటాయించడంతో పాటు ప్రకృతితో మమేకం కావాలని, కుటుంబ సభ్యులు, స్నేహితులతో ఆప్యాయంగా గడపాలని సూచించారు. సమస్యలను చూసి ఆందోళన చెందకుండా పరిష్కార మార్గాలపై దృష్టి పెట్టడం ద్వారా ఆత్మవిశ్వాసం, మానసిక ప్రశాంతత పెంపొందుతాయని తెలిపారు.


డిజిటల్‌ వెల్‌నెస్‌తో ఆరోగ్యకరమైన జీవనం


టెక్నాలజీ వినియోగంలో సమతుల్యతే ఆరోగ్యానికి మేలు


సాంకేతికత మన జీవితంలో అంతర్భాగంగా మారిన నేపథ్యంలో మొబైల్‌ ఫోన్‌, సోషల్‌ మీడియా, డిజిటల్‌ పరికరాల వినియోగంలో సమతుల్యత పాటించాలని శ్రీ బాలకృష్ణ సూచించారు. అవసరానికి మించి డిజిటల్‌ పరికరాలకు సమయం కేటాయించకుండా కుటుంబం, ప్రకృతి, వ్యాయామం, ఆధ్యాత్మిక చింతనకు సమయం ఇవ్వాలని తెలిపారు.


శారీరక ఆరోగ్యం – భావోద్వేగ సమతుల్యత – డిజిటల్‌ వెల్‌నెస్‌ ఈ మూడింటినీ సమన్వయం చేసుకున్నప్పుడే ఆరోగ్యకరమైన, ప్రశాంతమైన, ఆనందమయ జీవితాన్ని గడపగలమని ఆయన పేర్కొన్నారు.


ఈ కార్యక్రమంలో టీటీడీ సంక్షేమ విభాగం డిప్యూటీ ఈవో శ్రీ ఆనందరాజు, ఎస్వీ యూనివర్సిటీ రిజిస్ట్రార్ శ్రీ భూపతి నాయుడు, ఇతర అధికారులు, టీటీడీ ఉద్యోగులు, విశేష సంఖ్యలో పుర ప్రజలు పాల్గొన్నారు.

30.8.26

ఆగస్టు 30 నుండి సెప్టెంబర్ 3వ తేదీ వరకు కారీరిష్టి యాగం, వరుణయాగం, పర్జన్యశాంతి హోమం varuna yagam





రాష్ట్రం, దేశం సుభిక్షంగా ఉండాలని, సకాలంలో మృద్ధిగా వర్షాలు కురవాలని, ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరూ సుఖసంతోషాలతో వర్ధిల్లాలని శ్రీ వేంకటేశ్వరస్వామివారిని ప్రార్థిస్తూ ఆగస్టు 30 నుండి సెప్టెంబర్ 3 తేదీ వరకు వరుణయాగ, పర్జన్యశాంతి సహిత కారీరిష్టి యాగాలను టీటీడీ నిర్వహించనుంది.


తిరుమల ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తారు. 32 మంది వేద, శ్రౌత, స్మార్త పండితులు యాగ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ధర్మగిరి వేద విజ్ఞాన పీఠం ప్రిన్సిపాల్ శ్రీ కుప్పా శివ సుబ్రహ్మణ్య అవధాని ఆధ్వర్యంలో ఇందుకోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి.


కార్యక్రమాల వివరాలు:


ఆగస్టు 30న సాయంత్రం 7 నుంచి 8 గంటల వరకు ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో అంకురార్పణ, గణపతి పూజ, పుణ్యాహవాచనం, ఋత్విక్‌ వరణ కార్యక్రమాలు నిర్వహిస్తారు.


ఆగస్టు 31 నుండి సెప్టెంబర్ 3వ తేది వరకు ప్రతిరోజూ ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో వరుణయాగం, కారీరిష్టి, పర్జన్యశాంతి కార్యక్రమాలతో పాటు ఏడు వేదశాఖల పారాయణం, రామాయణం, సుందరకాండ, విరాటపర్వం, ఋష్యశృంగ ధ్యాన పారాయణ కార్యక్రమాలు నిర్వహిస్తారు.


గోగర్భం డ్యామ్‌ వద్ద వరుణ, పర్జన్య మంత్ర అనుష్ఠానం నిర్వహిస్తారు.


సాయంత్రం 6గం.నుండి రా. 8.గం  వరకు ధర్మగిరిలో అగ్నిహోత్ర అనుష్ఠానం, ఏడు వేదశాఖల పారాయణం జరుగుతుంది.


సెప్టెంబర్ 3న ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో పూర్ణాహుతి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.