18.9.26

TTD Chairman Interacts with Devotees




TTD Chairman Sri B.R. Naidu interacted with devotees in the galleries during the Mutyapu Pandiri Vahana seva on Thursday evening. 


He personally sought feedback on TTD facilities including darshan, annaprasadam, accommodation, laddu prasadam, and Vahana Seva viewing arrangements.


Devotees expressed satisfaction with the Brahmotsavam arrangements. 


The Chairman assured that their suggestions would be considered to enhance services further.


Later, Chairman also  observed the cultural performances by various art troupes and appreciated the artists.


TTD Board Members Sri Naresh Kumar, Smt. Janakidevi, Smt. Rangasri, and others participated.

గ్యాలరీల్లో భక్తులతో ముచ్చటించిన టీటీడీ ఛైర్మన్ శ్రీ బి.ఆర్. నాయుడు టీటీడీ సౌకర్యాలు, బ్రహ్మోత్సవ ఏర్పాట్లపై భక్తులతో ముఖాముఖి ttd chairman







తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడో రోజు గురువారం రాత్రి జరిగిన ముత్యపుపందిరి వాహనసేవను వీక్షించేందుకు గ్యాలరీలకు వచ్చిన భక్తులతో టీటీడీ ఛైర్మన్ శ్రీ బి.ఆర్. నాయుడు ముచ్చటించారు.


ఈ సందర్భంగా భక్తులకు టీటీడీ కల్పిస్తున్న సౌకర్యాలు, బ్రహ్మోత్సవాల సందర్భంగా చేపట్టిన ఏర్పాట్లపై ఆయన స్వయంగా భక్తులను అడిగి తెలుసుకున్నారు. శ్రీవారి దర్శనం, అన్నప్రసాదం, వసతి, లడ్డూ ప్రసాదం, వాహనసేవల వీక్షణకు చేసిన ఏర్పాట్లు తదితర అంశాలపై భక్తుల అభిప్రాయాలను తెలుసుకున్నారు.


టీటీడీ అందిస్తున్న సౌకర్యాలు, బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారు. భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు వారి సూచనలు, అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటామని ఛైర్మన్ తెలిపారు.


కళాబృందాల ప్రదర్శనలు పరిశీలించిన ఛైర్మన్


అనంతరం వివిధ కళాబృందాలు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలను టీటీడీ ఛైర్మన్ శ్రీ బి.ఆర్. నాయుడు, పాలకమండలి సభ్యులు పరిశీలించారు. అద్భుతమైన కళా ప్రదర్శనలు అందించిన కళాకారులను అభినందించారు.


ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు శ్రీ నరేష్ కుమార్, శ్రీమతి టి. జానకీదేవి, శ్రీమతి ఎ. రంగశ్రీ తదితరులు పాల్గొన్నారు.

RELIGIOUS AND MUSICAL PROGRAMS DELIGHT DEVOTEES AT BRAHMOTSAVAMS




On the third day of Sri Vari's Annual Brahmotsavams, Thursday, religious and musical programs organized by TTD's Hindu Dharmic Projects at the Nadaneerajanam and Asthana Mandapam in Tirumala drew great appreciation from devotees.

At the Nadaneerajanam venue, Smt. Ravi Prabha and Sri R. Satyanarayana's team performed Mangala Dhwani from 4:30 to 5:30 AM. This was followed by a Vedic message delivered by the SV Institute of Higher Vedic Studies from 5:30 to 6:30 AM. In the evening, from 5:30 to 6:30 PM, a devotional music performance by Sri R.Bullemma's team from Tirupati brought spiritual joy to the devotees.

At the Asthana Mandapam, Smt. Ramanujamma's team from Hyderabad recited the Vishnu Sahasranamam from 7 to 8 AM. From 10 to 11:30 AM, Smt. Roopashree from Bengaluru presented devotional music, followed by a devotional discourse by Dr. P.T.G. Sampath Kumar of Tirupati from 11:30 AM to 12:30 PM.

In the evening, from 4 to 5:30 PM, Smt. R. Sushila's team from Tirupati delighted devotees with Annamayya Sankeertanas. This was followed by a Harikatha performance by Smt. Swarnalatha's team from Tirupati from 5:30 to 7 PM.

బ్ర‌హ్మోత్స‌వాల్లో ఆక‌ట్టుకున్న ధార్మిక‌, సంగీత కార్య‌క్ర‌మాలు musical programs







శ్రీవారి వార్షిక‌ బ్రహ్మోత్సవాల్లో మూడో రోజైన గురువారం తిరుమ‌ల‌లోని నాద‌నీరాజ‌నం, ఆస్థాన మండ‌పంల‌లో టీటీడీ హిందూ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించిన ధార్మిక, సంగీత కార్య‌క్ర‌మాలు భ‌క్తుల‌ను విశేషంగా ఆక‌ట్టుకున్నాయి.


ఇందులో భాగంగా నాద‌నీరాజ‌నం వేదిక‌పై ఉదయం 4.30 నుండి 5.30 గంటల వరకుశ్రీమతి ర‌విప్ర‌భ‌, శ్రీ ఆర్.స‌త్య‌నారాయ‌ణ‌ బృందం మంగళ ధ్వని, ఉదయం 5:30 నుండి 6:30 గంటల వరకు ఎస్వీ ఉన్నత వేద విద్యాధ్య‌య‌న సంస్థ ఆధ్వర్యంలో వేద సందేశం నిర్వహించారు. సాయంత్రం 5.30 నుండి 6.30 గంటల వరకు తిరుప‌తికి చెందిన ఆర్.బుల్లెమ్మ బృందం భక్తి సంగీతం భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని కలిగించింది.

ఆస్థాన మండపంలో ఉదయం 7 నుండి 8 గంటల వరకు హైదరాబాద్‌కు చెందిన శ్రీమ‌తి రామానుజ‌మ్మ‌ బృందం విష్ణు సహస్రనామ పారాయణం, ఉదయం 10 నుండి 11:30 గంటల వరకు బెంగుళూరుకు చెందిన శ్రీ‌మ‌తి రూప‌శ్రీ భక్తి సంగీతం, ఉదయం 11:30 నుండి 12:30 గంటల వరకు తిరుప‌తికి చెందిన డాక్ట‌ర్ పి.టి.జి.సంప‌త్ కుమార్ భ‌క్తి సందేశం అందించారు.

సాయంత్రం 4 నుండి 5.30 గంటల వరకు తిరుప‌తికి చెందిన శ్రీ‌మ‌తి ఆర్.సుశీల‌ బృందం అన్నమయ్య సంకీర్తనలు భక్తులను అలరించాయి. సాయంత్రం 5.30 నుండి రాత్రి 7 గంటల వరకు తిరుప‌తికి చెందిన శ్రీ‌మ‌తి స్వ‌ర్ణ‌ల‌త‌ బృందం హరికథ గానం చేశారు.

Traditional Folk Arts Enthrall Devotees-03









As part of the ongoing Srivari Salakatla Brahmotsavams at Tirumala, Sri Malayappa Swamy took out a grand procession on the Muthyapu Pandiri Vahanam as ''Aeni Kannan'' through the four Mada streets on Thursday night and blessed the devotees.


The cultural programmes organised ahead of the vahana seva attracted the devotees. A total of 547 artists from 21 cultural troupes representing nine states showcased their traditional folk arts and dance forms, highlighting the rich cultural heritage of the country.


Gujarat Garba.. Dandiya, Radha-Krishna's Raas Leela, Halakki Suggi Kunitha from Karnataka also captivated the devotees. 


This traditional dance of the Halakki Vokkaliga tribal community was performed to express the joy and celebration after the completion of the harvest.


Among other performances included Talam dance, Drums, Odissi, Kanjara Kolatam, Banjara dance and Bathukamma dance.


TTD officials participated.