20.3.26

భక్తుల సౌకర్యాల అభివృద్ధికి సూచనలు ఇవ్వండి శ్రీ‌వారి సేవకులకు టీటీడీ ఈవో పిలుపు srivari sevakas







తిరుమలకు విచ్చేసే భక్తులకు నిస్వార్థంగా సేవలందిస్తున్న శ్రీవారి సేవకులు భక్తుల సౌకర్యాల మెరుగుదలకు తమ సూచనలు కూడా ఇవ్వాలని టీటీడీ ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్ర తెలిపారుగురువారం తిరుమలలోని శ్రీవారి సేవా సదన్-2ను తొలిసారిగా సందర్శించిన ఈవో సేవకులకు ముందుగా ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు.


తదనంతరం సేవకులతో సమావేశమై అన్నప్రసాదంపరిశుభ్రతక్యూలైన్ నిర్వహణ తదితర అంశాలపై వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు


భక్తులకు ప్రత్యక్షంగా సేవలందించే సేవకులు వారి సమస్యలను బాగా అర్థం చేసుకోగలరనిఅందువల్ల వారు అందించే సూచనలు ఎంతో విలువైనవని ఈవో పేర్కొన్నారు.


సేవ‌కులు అందించే ఫీడ్‌బ్యాక్ క్తుల సౌకర్యాల అభివృద్ధికివ్యవస్థను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దడానికి కీలకంగా ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు.


అంత‌క‌ముందు ఈవో సేవా సదన్-2లోని రిసెప్షన్వెరిఫికేషన్రిజిస్ట్రేషన్ కౌంటర్లను సందర్శించిసేవకులకు అందిస్తున్న సౌకర్యాలను పరిశీలించారుఅలాగే హాల్స్‌ను తనిఖీ చేశారు.


అనంత‌రం కొంతమంది సేవకులతో మాట్లాడ‌గా వారికి అందుతున్న సౌకర్యాలపై సేవకులు సంతృప్తి వ్యక్తం చేశారు.


 కార్యక్రమంలో టీటీడీ సీపీఆర్వో డాక్ట‌ర్ టి.ర‌విశ్రీవారి సేవా విభాగం సిబ్బంది పాల్గొన్నారు.

సింహ వాహనంపై శ్రీకోదండరాముడు simha vahanam













తిరుపతి శ్రీ కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడో రోజు గురువారం ఉదయం 8 గంట‌ల‌కు సింహ వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు.


సింహ రూప దర్శనంతో శక్తులన్నీ చైతన్యవంతమవుతాయిసోమరితనం నశించి పట్టుదలతో ప్రవర్తించి సర్వత్రా విజయులమై ఆధిపత్యంతో రాణించే స్ఫూర్తి సిద్ధిస్తుందిఅజ్ఞానంతో ప్రవర్తించే దుష్టులను రించడంలో నేనునా వాహనమైన సింహం సమాన ప్రయత్నంతో ఉంటామని  సిం వాహనం ద్వారా స్వామివారు నిరూపిస్తున్నారు.


అనంతరం ఉదయం 10.30 నుండి 11.30 గంటల వరకు స్నపన తిరుమంజనం వేడుకగా జరిగిందిఇందులో పాలుపెరుగుతేనెకొబ్బ‌రినీళ్ళుప‌సుపుచందనంలతో శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీకోదండరాములవారి ఉత్సవమూర్తులకు అభిషేకం చేశారు.


రాత్రి 7 నుండి 8.30 గంటల వరకు ముత్యపు పందిరి వాహనంపై శ్రీకోదండరాముడు విహరించి భక్తులను కనువిందు చేయనున్నారు.


వాహ‌న‌సేవ‌లో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి నాగరత్నటెంపుల్‌ ఇన్‌స్పెక్టర్లు శ్రీ సురేష్ బాబుశ్రీ హరి కృష్ణఆలయ అర్చకులువిశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.


రాష్ట్ర గవర్నర్, రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులకు శ్రీవారి తీర్థప్రసాదాలు veda aseervachanam







రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు గౌ|| శ్రీ నారా చంద్రబాబునాయుడును గురువారం టిటిడి అదనపు ఈవో శ్రీ సి.హెచ్వెంకయ్య చౌదరి మర్యాదపూర్వకంగా కలిశారు.


ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసంలో శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది సందర్భంగా ముఖ్యమంత్రిని కలిసి శ్రీవారి తీర్థప్రసాదాలు సమర్పించారు.


 సందర్భంగా ముఖ్యమంత్రివర్యులకు శేషవస్త్రంశ్రీవారి తీర్థప్రసాదాలను అందజేశారు.


అనంతరం వేదపండితులు వేదాశీర్వచనం చేశారు.


ఒంటిమిట్ట రాములవారి కల్యాణానికి గౌ|| రాష్ట్ర గవర్నరుగౌ|| రాష్ట్ర ముఖ్యమంత్రికి ఆహ్వానం


కడప జిల్లా ఒంటిమిట్టలోని శ్రీకోదండరామాలయ శ్రీరామ నవమి బ్రహ్మోత్సవాలలో భాగంగా  ఏప్రిల్‌ 1 తేదీన ప్రతిష్టాత్మకంగా జరుగనున్న శ్రీసీతారాముల కల్యాణానికి విచ్చేయాలని రాష్ట్ర గవర్నర్ గౌ|| ఎస్అబ్దుల్ నజీర్ముఖ్యమంత్రి గౌ|| శ్రీ నారా చంద్రబాబునాయుడిని గురువారం టిటిడి ఆదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి  ఆహ్వానించారు


 సందర్భంగా గౌరవ గవర్నర్ శ్రీ ఎస్అబ్దుల్ నజీర్ ను విజయవాడలోని గవర్నర్ బంగ్లాలో శాలువతో సన్మానించి శ్రీవారి ప్రసాదాలను అందజేశారు.


గౌ|| ముఖ్యమంత్రిని అమరావతిలోని సిఎం స్వగృహంలో  శాలువతో సన్మానించి శ్రీవారి ప్రసాదాలను అందజేశారు.


టిటిడి అదనపు ఈవో వెంట ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ శివప్రసాద్ఇతర అధికారులు ఉన్నారు.    

టీటీడీకి రూ.17.55 ల‌క్ష‌లు విరాళం donation




హైద‌రాబాద్ కు చెందిన శ్రీ మ‌ధుశేషు అనే భ‌క్తుడు టీటీడీ శ్రీ వేంక‌టేశ్వ‌ర గో సంర‌క్ష‌ణ ట్ర‌స్టుకు గురువారం రూ.12.55 ల‌క్ష‌లు విరాళంగా అందించారుఅదేవిధంగా హైద‌రాబాద్ కు చెందిన శ్రీ  ఆల‌పాటి స‌త్య‌దేవ్‌ టీటీడీ బ‌ర్డ్ ట్ర‌స్టుకు రూ.5 ల‌క్ష‌లు విరాళంగా అందించారు.


 మేర‌కు దాత‌ల త‌ర‌ఫున టీటీడీ బోర్డు స‌భ్యులు శ్రీ న‌న్న‌ప‌నేని స‌దాశివ‌రావు శ్రీ‌వారి ఆల‌యంలోని రంగ నాయ‌కుల మండ‌పంలో టీటీడీ ఈవో శ్రీ ముద్దాడ ర‌వి చంద్ర‌కు విరాళం డీడీల‌ను అంద‌జేశారు.


టీటీడీకి రూ.20 లక్షలు విరాళం donation




హైదరాబాద్ కు చెందిన సృజన్ జ్యూవెలరీ అధినేత శ్రీ రవికుమార్ గురువారం టీటీడీ శ్రీ వేంక‌టేశ్వ‌ర‌ అన్నప్రసాదం ట్రస్టుకు రూ.10 లక్షలుశ్రీ వేంక‌టేశ్వ‌ర ప్రాణదాన ట్రస్టుకు రూ.10 లక్షలను విరాళం అందించారు.


 మేర‌కు టీటీడీ చైర్మ‌న్ కార్యాల‌యంలో చైర్మ‌న్ శ్రీ బీ.ఆర్‌.నాయుడుకు విరాళం చెక్కును అంద‌జేశారు.