వరలక్ష్మీ వ్రతం సందర్భంగా జూలై 08వ తేదీ శుక్రవారం రోజున టిటిడి, హిందూ ధర్మప్రచార పరిషత్ సంయుక్తంగా సౌభాగ్యం నిర్వహించేందుకు టిటిడి విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. సౌభాగ్యం సామాగ్రికి శ్వేతా భవనంలోని హాలులో గురువారం టిటిడి, డిపిపి అధికారులు, సిబ్బంది, శ్రీవారి సేవకులు ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయాల వారీగా పార్శల్ ప్యాకెట్లు సిద్ధం చేశారు.
వరలక్ష్మీ వ్రతం రోజున టిటిడి ఆలయాలలో సౌభాగ్యం పేరుతో మహిళలకు గాజులు, పసుపు, కుంకుమ, అక్షింతలు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో టిటిడి ఆధ్వర్యంలో నడుస్తున్న 51 ఆలయాలలో సౌభాగ్యవతులకు గాజులు, శ్రీ పద్మావతి అమ్మవారి కుంకుమ ప్యాకెట్లు, కంకణాలు, పసుపు దారాలు, శ్రీ పద్మావతీ అమ్మవారి లక్ష్మీ అష్టోత్తర శత నామావళి పుస్తక ప్రసాదాలను అందించనున్నారు.
ఈ సందర్భంగా సుమంగళి ద్రవ్యాలను సౌభాగ్యవతులకు పంపిణీ చేసేందుకు ఓ అజ్ఞాత భక్తుడు విరాళంగా అందించారు. విరాళం అందించిన వాటి వివరాలు ఇలా ఉన్నాయి. 8 లక్షల గాజులు, 1.40 లక్షల కంకణాలు, 1.40 లక్షల పసుపు దారాలు, 1.40 లక్షల అమ్మవారి కుంకుమ ప్యాకెట్లు, అమ్మవారి లక్ష్మీ అష్టోత్తర శత నామావళి పుస్తక ప్రసాదాలను సదరు ఆలయాలకు తరలించారు.
ఈ కార్యక్రమంలో హిందూ ధర్మప్రచార పరిషత్ సంచాలకులు శ్రీరామ్ రఘునాథ్, అదనపు సంచాలకులు శ్రీ రాంగోపాల్, ఏఈవో శ్రీరాములు, సూపరింటెండెంట్ శ్రీ ఢిల్లీ రెడ్డి, శ్రీవారి సేవకులు, సిబ్బంది పాల్గొన్నారు.
తిరుమల శ్రీవారి ఆలయం ముందు , మాడ వీధుల్లో ఇటీవల కొంతమంది వెకిలి చేష్టలు చేస్తూ, నృత్యాలు ప్రదర్శిస్తూ వీడియోలు (రీల్స్) చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో అప్‌లోడ్ చేస్తున్నట్లు టీటీడీ దృష్టికి వచ్చింది. తిరుమలలాంటి పవిత్రమైన ఆధ్యాత్మిక క్షేత్రంలో ఇలాంటి అభ్యంతరకర ,అసభ్యకర చర్యలు అనుచితం.
భక్తుల మనోభావాలను దెబ్బతీసే ఈ తరహా చర్యలు ఆధ్యాత్మిక వాతావరణానికి విఘాతం కలిగిస్తున్నాయి. తిరుమల క్షేత్రం భక్తి, ఆరాధనలకు నిలయమని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి. తిరుమలలో కేవలం ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలకే పరిమితం కావాలి. శ్రీవారి దర్శనార్థం వచ్చే లక్షలాది మంది భక్తుల మనోభావాల పట్ల గౌరవం చూపడం ప్రతి ఒక్కరి బాధ్యత.
టీటీడీ విజిలెన్స్, సెక్యూరిటీ సిబ్బంది ఇలాంటి వీడియోలు చిత్రీకరించేవారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటారని హెచ్చరించడమైనది. తిరుమల పవిత్రతను భంగం కలిగేలా వ్యవహరించే వ్యక్తులపై కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు చేపట్టడం జరుగుతుంది.
తిరుమలలో అసభ్యకర వీడియోలు, వెకిలి చేష్టలతో రీల్స్ చేయకుండా తిరుమలలో ఆధ్యాత్మిక వాతావరణం, పవిత్రతను కాపాడడంలో సహకరించాలని భక్తులకు టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది.
Sri Padmavathi Women’s Polytechnic College, run by TTD in Tirupati, has been granted by the National Board of Accreditation (NBA) the accreditation up to the year 2028.
On this occasion, TTD Executive Officer Sri J. Syamala Rao congratulated the Principal Dr. M. Padmavathamma, faculty, and staff for their collective efforts in achieving this recognition.
He appreciated their teamwork and dedication, and urged them to continue striving for national-level recognition for the institution by delivering quality education to students.
తిరుమలలో రోజు రోజుకు పెరుగుతున్న వాహనాల రాకపోకలను, తద్వారా ఏర్పడుతున్న వాతావరణ కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకొని, ఘాట్ రోడ్లలో వాహనాలు మరియు తిరుమలలో ట్రాఫిక్ నియంత్రణపై పాలసీ డాక్యుమెంట్ సిద్ధం చేయాలని టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్. వెంకయ్య చౌదరి సంబంధిత అధికారులను ఆదేశించారు.
బుధవారం తిరుమల గోకులం సమావేశ మందిరంలో టీటీడీ ట్రాన్స్‌పోర్ట్, అటవీ, విజిలెన్స్, ఆర్టీఏ విభాగాల అధికారులతో సమావేశం నిర్వహించారు. తిరుమలలో ట్రాఫిక్‌ను నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై ఆయన సమీక్షించారు.
ఈ సందర్భంగా అదనపు ఈవో మాట్లాడుతూ పాలసీ డాక్యుమెంట్ లో ఈవీ పాలసీ, పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌ను బలోపేతం చేయడం, ప్రైవేట్ జీప్ డ్రైవర్లకు అవగాహన కల్పించడం, పాత వాహనాల వల్ల ఏర్పడుతున్న పర్యావరణ కాలుష్యాన్ని నివారించేందుకు ట్రాఫిక్ నియమాలను కఠినంగా అమలు చేయడం వంటి అంశాలు చేర్చాలని సూచించారు.
అలాగే తిరుమలలో ప్రీపెయిడ్ టాక్సీ సదుపాయం ఏర్పాటు చేసేందుకు ప్రత్యేక పార్కింగ్ స్థలం గుర్తించడంతో పాటు భక్తుల సౌకర్యార్థం కనీస, గరిష్ట ఛార్జీలను నిర్ణయించాలని అధికారులను ఆదేశించారు.
ఈ సమావేశంలో ట్రాన్స్‌పోర్ట్ జీఎం శ్రీ శేషా రెడ్డి, టీటీడీ డిప్యూటీ సిఎఫ్ శ్రీ ఫణికుమార్ నాయుడు, విజిలెన్స్ అధికారులు శ్రీ రామ్‌కుమార్, శ్రీ సురేంద్ర, జిల్లా రవాణా అధికారి శ్రీ కె. మురళి మోహన్‌తో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.
ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి ఆలయం, దేవుని కడప శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో ఆగస్టులో పలు విశేష ఉత్సవాలు జరుగనున్నాయి. వాటి వివరాలు ఇలా ఉన్నాయి.
- ఆగస్టు 8న ఉదయం 8 నుండి 10 గంటల వరకు వరలక్ష్మీ వ్రతం
- ఆగస్టు 9న పౌర్ణమి సందర్భంగా ఉదయం 9.30 గం.లకు శ్రీ సీతారాముల కల్యాణం
- ఆగస్టు 23 నుండి 26వ తేదీ వరకు వార్షిక పవిత్రోత్సవాలు
దేవుని కడప శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి ఆలయం......
- ఆగస్టు 8న వరలక్ష్మీ వ్రతం సందర్భంగా హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో సౌభాగ్యం
- ఆగస్టు 9న శ్రవణా నక్షత్రం సందర్భంగా శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామివారికి తిరుమంజనం,
- ఆగస్టు 18, 19, 20 తేదీలలో ఆలయంలో బాలాలయం, జీర్ణోద్ధరణ
- ఆగస్టు 24న పుబ్బ నక్షత్రం సందర్భంగా శ్రీ ఆండాళ్ అమ్మవారికి తిరుమంజనం, గ్రామోత్సవం
- ఆగస్టు 25న ఉత్తరా నక్షత్రం సందర్భంగా శ్రీ పద్మావతీ అమ్మవారికి స్నపన తిరుమంజనం, ప్రాకారోత్సవం
The new Darshan timings for SRIVANI offline darshan ticket holders will be implemented on an experimental basis from 01-08-2025 to 15-08-2025 by TTD.
The TTD Additional EO Sri Ch. Venkaiah Chowdary held a review meeting on SRIVANI darshan at Gokulam conference hall in Tirumala on Wednesday.
Highlights of the meeting:
- Under the current system, its taking about three days for SRIVANI devotees
- For their convenience, TTD will implement a pilot scheme of issuing tickets and providing darshan on the same day from August 01 to 15.
- In Tirumala, tickets will be issued on a first come, first served basis from 10 am onwards
- Reporting time for Srivani devotees who have obtained tickets at Vaikuntam Queue Complex-1 in Tirumala is at 4.30 pm on the same day.
- Darshan tickets will be issued from 7 am onwards at Renigunta Airport as per quota.
- As usual, 800 tickets will be issued offline in Tirumala and 200 tickets will be issued at Renigunta Airport.
- Devotees who have already obtained Srivani tickets online through advance booking till October 31st will be allowed to have darshan at 10 am as usual.
- Devotees who have obtained Srivani tickets offline and online from November 1st onwards will be allowed to have darshan at 4:30 pm through Vaikuntam Queue Complex 1.
- Devotees are requested to reach the SRIVANI ticket issuing point in Tirumala only at 10 am to avoid any inconvenience
- With this new system, devotees will be able to have a quick darshan, that is, on the same day of their arrival itself.
TTD Deputy EOs Sri Lokanatham, Sri Venkataiah, Transport and IT GM Sri Sesha Reddy, VGOs Sri Ram Kumar, Sri Surendra, IT Deputy GM Sri Venkateswarlu Naidu and other officials participated in this meeting.