7.7.26

జూలై 07న విజ‌య‌వాడ శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజ‌నం - జూలై 8న వార్షికోత్సవం koil alwar tirumanjanam




విజ‌య‌వాడ శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామి ఆలయంలో జూలై 8 తేదీ వార్షికోత్సవం సంద‌ర్భంగా జూలై 07 మంగళవారం ఉద‌యం ఆల‌యంలో  కోయిల్ ఆళ్వార్ తిరుమంజ‌నం జరుగనుంది.

ఈ సందర్భంగా ఉదయం 7 గంటలకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం చేపడుతారు. ఇందులో భాగంగా శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి సన్నిధి, ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేసిన అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్రజలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేస్తారు. అనంతరం భక్తులను సర్వదర్శనానికి అనుమతిస్తారు.

జూలై 8 ఆల‌య వార్షికోత్సవం

శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామి ఆలయంలో జూలై 8వ తేదీ ఆల‌య వార్షికోత్సవం వైభవంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు జరుగనున్నాయి.

ఇందులో భాగంగా ఉదయం 7.20 నుండి 1.45 గంటల వరకు అష్టోత్తరశతకలశాభిషేకము, మహాశాంతి హోమము, వర్షవర్ధన హోమము, మహాపూర్ణాహుతి,  మహా స్నపనము, మహాశాంతి హోమం, పూర్ణాహుతి నిర్వహిస్తారు.

No comments :
Write comments