టీటీడీకి
చెందిన వివిధ పథకాలకు సోమవారం రూ.41 లక్షలు విరాళంగా అందింది.హైదరాబాద్ కు చెందిన డాక్టర్ లయన్ సాయి వెంకట్ టీటీడీ శ్రీ వేంకటేశ్వర సర్వ శ్రేయాస్ ట్రస్ట్ కు స్వర్ణ విహార్ ఇన్ ఫ్రా ప్రాజెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ తరఫున రూ.10 లక్షలు, జయహో రామానుజ సినిమా ఆగస్టు 15న విడుదల సందర్భంగా మరో రూ.10 లక్షలు విరాళంగా అందించారు.
అదేవిధంగా గుంటూరుకు చెందిన శ్రీమతి జి.లావణ్య శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు రూ.11,11,111 విరాళంగా అందించారు.
రాజమహేంద్రవరం (రాజమండ్రి)కి చెందిన పాటంశెట్టి సాయి ఫణీంద్ర శ్రీ వేంకటేశ్వర అన్న ప్రసాద ట్రస్టుకు రూ.10 లక్షలు విరాళంగా అందించారు.
ఈ మేరకు దాతలు తిరుమలలోని అదనపు ఈవో క్యాంపు కార్యాలయంలో అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరికి విరాళం డీడీలను అందజేశారు.
ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు శ్రీ భాను ప్రకాష్ రెడ్డి పాల్గొన్నారు.
No comments :
Write comments