7.7.26

అప్రమత్తమైన టీటీడీ కమాండ్ కంట్రోల్ సెంటర్ command control center


తిరుమలకు విచ్చేసిన భక్తుడు పోగొట్టుకున్న విలువైన బ్యాగ్‌ను టీటీడీ కమాండ్ కంట్రోల్ సెంటర్ అధికారులు అత్యంత అప్రమత్తంగా వ్యవహరించి గుర్తించి, అందులోని నగదు, బంగారం, వెండి ఆభరణాలు, మొబైల్ ఫోన్‌తో పాటు ఇతర విలువైన వస్తువులను యథాతథంగా యజమానులకు భద్రంగా అప్పగించారు.

సీసీటీవీ ద్వారా జీప్‌ను గుర్తించిన అధికారులు తెలంగాణకు చెందిన శ్రీ రామకృష్ణ కుటుంబ సభ్యులు మేదరమిట్ట నుండి గోగర్భ డ్యాం సమీపంలోని మఠాలకు మహేంద్ర టాక్సీ జీప్‌లో ప్రయాణిస్తున్న సమయంలో తమ బ్యాగ్‌ను వాహనంలోనే మరిచిపోయారు. విషయం గుర్తించిన వెంటనే టీటీడీ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ఫిర్యాదు చేయగా, అధికారులు వెంటనే సీసీటీవీ ప్లేబ్యాక్ ఫుటేజీలను పరిశీలించి సంబంధిత జీప్‌ను గుర్తించారు.

అప్పటికే తిరుపతికి చేరుకున్న డ్రైవర్‌ను సంప్రదించి బ్యాగ్‌ను భద్రంగా స్వాధీనం చేసుకుని, కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో భక్తుల సమక్షంలో బ్యాగ్‌ను తెరిచి అందులోని విలువైన వస్తువులను ధృవీకరించి యథాతథంగా అప్పగించారు.

బ్యాగ్‌లో ఉన్న విలువైన వస్తువులు

రూ.23,000 నగదు

4 గ్రాముల బంగారు ఉంగరం

12 గ్రాముల బంగారు గొలుసు

15 గ్రాముల వెండి కాళ్ల పట్టీలు

ఒప్పో మొబైల్ ఫోన్

సుమారు రూ.1.20 లక్షల విలువైన దంత పరికరం

టీటీడీ భద్రతా విధానంపై భక్తుల ప్రశంసలు

విలువైన వస్తువులను ఎలాంటి నష్టం లేకుండా తిరిగి అందజేసిన టీటీడీ కమాండ్ కంట్రోల్ సెంటర్ అధికారులు, విజిలెన్స్ సిబ్బందికి భక్తులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన టీటీడీ భద్రతా వ్యవస్థను అభినందించారు.

శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు తమ విలువైన వస్తువుల పట్ల అప్రమత్తంగా ఉండాలని టీటీడీ సూచించింది. ఈ సందర్భంగా విజిలెన్స్ సిబ్బందిని టీటీడీ సీవీఎస్‌వో శ్రీ కె.వి. మురళీకృష్ణ అభినందించారు.

ఈ కార్యక్రమంలో వీజీవో శ్రీ సురేంద్ర, ఏవీఎస్‌వోలు శ్రీ వెంకటరమణ, శ్రీ నగేష్‌బాబు తదితరులు పాల్గొన్నారు.

No comments :
Write comments