4.7.26

జూలై 10న చంద్రగిరిలో దీప పూజకు ఏర్పాట్లు వేగవంతం చేయాలి : టీటీడీ జేఈవో డా. ఎ. శరత్ ttd addl jeo




జూలై 10 తేదీ సాయంత్రం చంద్రగిరి శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో నిర్వహించనున్న పవిత్ర దీపపూజ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లను వేగవంతంగా పూర్తి చేసి, భక్తులకు ఎలాంటి సౌకర్యం కలగకుండా అన్ని శాఖలు మన్వయంతో పనిచేయాలని టీటీడీ జేఈవో డా. . శరత్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న ఏర్పాట్లను అధికారులతో కలిసి పరిశీలించారు.

భక్తులకు సమగ్ర సౌకర్యాలు

దీపపూజలో పాల్గొనే భక్తుల కోసం తగిన సంఖ్యలో షెడ్లు, మ్యాట్లు, దీపారాధన సామగ్రి, అన్నప్రసాద పంపిణీ కేంద్రాలు, ఎల్ఈడీ స్క్రీన్లు, తాగునీరు, పారిశుద్ధ్యం, తాత్కాలిక మరుగుదొడ్లు తదితర మౌలిక సదుపాయాలను సమృద్ధిగా ఏర్పాటు చేసి, ఆధ్యాత్మిక వాతావరణంలో భక్తులు సౌకర్యవంతంగా పాల్గొనేలా చర్యలు చేపట్టాలని జేఈవో సూచించారు.

ఏర్పాట్లపై పరిశీలన

అనంతరం ఆలయ ప్రాంగణంలోని ఏర్పాట్లను క్షుణ్ణంగా పరిశీలించిన జేఈవో వివిధ శాఖల అధికారులకు పలు సూచనలు చేశారు.

ఈ కార్యక్రమంలో ఎస్‌ఈ శ్రీ మనోహరం, ఈఈ శ్రీ మల్లికార్జున ప్రసాద్, డీఈ (ఎలక్ట్రికల్) శ్రీమతి సరస్వతి, విజిఓ శ్రీ గిరిధర్, ఆలయ డిప్యూటీ ఈవో శ్రీమతి నాగరత్న, ఎస్‌వీబీసీ సీపీఓ శ్రీ శ్రీ తో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.

No comments :
Write comments