అప్పలాయగుంట
శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో తొమ్మిది రోజుల పాటు అత్యంత వైభవంగా నిర్వహించిన వార్షిక బ్రహ్మోత్సవాలు శుక్రవారం రాత్రి ధ్వజావరోహణంతో శాస్త్రోక్తంగా ముగిశాయి.బ్రహ్మోత్సవాల ఆరంభంలో ధ్వజారోహణం సందర్భంగా ఆహ్వానించిన సకల దేవతలను, గరుడ పటాన్ని అవనతం చేసి వేదమంత్రోచ్చారణల మధ్య ఘనంగా సాగనంపారు. ఈ ధ్వజావరోహణంతో తొమ్మిది రోజుల పాటు సాగిన దివ్యోత్సవాలు విజయవంతంగా పరిసమాప్తమయ్యాయి.
ఈ కార్యక్రమంలో టిటిడి జేఈవో డా.ఎ. శరత్, ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ హరేంద్రనాథ్, ఏఈవో శ్రీ దేవరాజులు, ఆలయ అధికారులు, అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి అనుగ్రహాన్ని పొందారు.
No comments :
Write comments