13.7.26

జూలై 14న తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో వైభవంగా అష్టోత్తర శతకలశాభిషేకం, కల్యాణోత్సవం kalyanotsavam




తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో జూలై 14 తేదీన అమావాస్య, పునర్వసు నక్షత్రాన్ని పురస్కరించుకుని అష్టోత్తర శతకలశాభిషేకం, శ్రీ సీతా క్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామివారి కల్యాణోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు.

అమావాస్య సందర్భంగా ఉదయం 8.30 గంటలకు అష్టోత్తర శతకలశాభిషేకం నిర్వహిస్తారు. ఈ సేవలో గృహస్తులు (ఇద్దరు) రూ.500/- టికెట్‌తో పాల్గొనవచ్చు.

అనంతరం రాత్రి 7 గంటల నుండి 9 గంటల వరకు హనుమంత వాహనసేవ భక్తి శ్రద్ధల మధ్య జరుగుతుంది.

సర్వాలంకార భూషితులైన శ్రీ కోదండరామస్వామివారు తనకు అత్యంత ప్రీతిపాత్రమైన హనుమంత వాహనంపై ఆలయ నాలుగు మాడవీధుల్లో విహరించి భక్తులకు దివ్య దర్శనమివ్వనున్నారు.

పునర్వసు నక్షత్రాన శ్రీ స్వామివారి కల్యాణ మహోత్సవం 

శ్రీరామచంద్రమూర్తి జన్మనక్షత్రమైన పునర్వసు సందర్భంగా ఉదయం 11 గంటలకు శ్రీ సీతా లక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామివారి కల్యాణోత్సవం శాస్త్రోక్తంగా నిర్వహించనున్నారు. గృహస్తులు (ఇద్దరు) రూ.500/- టికెట్‌ ద్వారా ఈ దివ్యోత్సవంలో పాల్గొనవచ్చు. పాల్గొనే గృహస్తులకు ఉత్తరీయం, రవికె, అన్నప్రసాదం బహుమానంగా అందజేస్తారు.

అనంతరం సాయంత్రం 5.30 గంటలకు ఉత్సవమూర్తులను ఆలయ నాలుగు మాడవీధుల్లో ఊరేగింపుగా తీసుకెళ్లి, శ్రీరామచంద్ర పుష్కరిణి వద్ద ఊంజల్‌సేవ నిర్వహిస్తారు.

కల్యాణోత్సవంలో పాల్గొనే గృహస్తులు సంప్రదాయ వస్త్రధారణలో హాజరుకావాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది.

No comments :
Write comments