ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయని అభ్యర్థులకు ప్రవేశానికి అవకాశం ఉండదని టీటీడీ స్పష్టం చేసింది.
స్పాట్ అడ్మిషన్లకు టీటీడీ ఉద్యోగుల పిల్లలు, టీటీడీ ఎస్‌వీ బాలమందిర్ విద్యార్థులు, మొదటి నుంచి ఆరో దశ కౌన్సెలింగ్ వరకు హాజరు కాలేకపోయిన అభ్యర్థులు, తిరుపతి స్థానికులు, స్థానికేతర అభ్యర్థులు అర్హులు.
కౌన్సెలింగ్షెడ్యూల్
జూలై 23
ఉదయం 8.00 నుంచి మధ్యాహ్నం 1.00 గంటల వరకు: 550–600 మార్కులు సాధించిన అభ్యర్థులు
మధ్యాహ్నం 2.00 నుంచి సాయంత్రం 6.00 గంటల వరకు: 500–549 మార్కులు సాధించిన అభ్యర్థులు
జూలై 24
ఉదయం 8.00 నుంచి మధ్యాహ్నం 1.00 గంటల వరకు: 450–499 మార్కులు సాధించిన అభ్యర్థులు
మధ్యాహ్నం 2.00 నుంచి సాయంత్రం 6.00 గంటల వరకు: 400–449 మార్కులు సాధించిన అభ్యర్థులు
ఒరిజినల్ ధృవపత్రాలతో హాజరు కావాలి
అర్హులైన విద్యార్థులు అవసరమైన ఒరిజినల్ ధృవపత్రాలు, సంబంధిత పత్రాలతో నిర్ణీత తేదీలు, సమయాలకు సంబంధిత కళాశాలలకు హాజరై స్పాట్ అడ్మిషన్ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని టీటీడీ కోరుతోంది.
No comments :
Write comments