20.7.26

విధి నిర్వహణలో మృతి చెందిన హెచ్‌డిపిపి కళాకారుల కుటుంబాలకు టీటీడీ అండ




హిందూ ధర్మ ప్రచా పరిషత్ (హెచ్‌డిపిపి), టీటీడీ ఆధ్వర్యంలో సత్రవాడలోని టీటీడీ ఆలయంలో ఆదివారం ఉదయం నిర్వహించాల్సిన హరికథ కార్యక్రమంలో భక్తి సేవలు అందించేందుకు వెళ్తున్ ప్రైవేట్ కళాకారులు శ్రీ కె. చక్రవర్తి (వయోలిన్), శ్రీ కె. నాగరాజుచెట్టి (తబలా) వడమాలపేటపూడి క్రాస్ సమీపంలో జరిగిన విషాదకర రోడ్డు ప్రమాదంలో దురదృష్టవశాత్తు అక్కడికక్కడే మృతి చెందారు.

విధుల్లో భాగంగా ఈ విషాదం చోటుచేసుకోవడంతో టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ బి.ఆర్. నాయుడు, కార్యనిర్వహణాధికారి శ్రీ ముద్దాడ రవిచంద్ర, సంయుక్త కార్యనిర్వహణాధికారి డా. ఎ. శరత్ మానవతా దృక్పథంతో వారి కుటుంబాలకు తక్షణ సహాయం అందించాలని ప్రత్యేక నిర్ణయాలు తీసుకున్నారు.

ఈ మేరకు, మరణించిన ప్రతి కళాకారుడి కుటుంబానికి అంత్యక్రియల ఖర్చుల నిమిత్తం హెచ్‌డిపిపి నిధి నుంచి రూ.25 వేల చొప్పున తక్షణ ఆర్థిక సహాయాన్ని మృతుల కుటుంబసభ్యులకు  హెచ్‌డిపిపి కార్యదర్శి డా. మేడసాని మోహన్ అందజేశారు.

అదేవిధంగా, దివంగత శ్రీ కె. చక్రవర్తి, శ్రీ కె. నాగరాజుచెట్టి కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ఆర్థిక సహాయం మంజూరు చేశారు.

మరణించిన కళాకారులకు పిల్లలు ఉన్నట్లయితే, వారికి టీటీడీ విద్యాసంస్థల్లో డిగ్రీ స్థాయి వరకు పూర్తిగా ఉచిత విద్య కల్పించాలని కూడా నిర్ణయించారు. 

విధుల్లో భాగంగా జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన ఇరువురికి టిటిడి పాలకమండలి మానవతా దృక్పథంతో సాయం అందించింది. 

No comments :
Write comments