9.7.26

టీటీడీ బోర్డు ఎక్స్ అఫిషియో సభ్యునిగా దేవాదాయశాఖ కార్యదర్శి ప్రమాణ స్వీకారం ex officio



టీటీడీ
ధర్మకర్తల మండలి ఎక్స్ ఫిషియో సభ్యునిగా దేవాదాయ శాఖ కార్యదర్శి శ్రీ కె.కన్నబాబు బుధవారం తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రమాణ స్వీకారం చేశారు.

టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి వీరితో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు. రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం చేశారు. శ్రీ కె.కన్నబాబు కు శ్రీవారి చిత్రపటం, తీర్థ ప్రసాదాలను అదనపు ఈవో అందించారు.

ఈ కార్యక్రమంలో టీటీడీ సీవీఎస్వో శ్రీ మురళీకృష్ణ, డిప్యూటీ ఈవోలు శ్రీ భాస్కర్, శ్రీమతి ప్రశాంతి, ఇతర అధికారులు పాల్గొన్నారు

No comments :
Write comments