24.7.26

తిరుచ్చిపై మత్స్యావతారంలో భక్తులను మంత్రముగ్ధులను చేసిన శ్రీ సౌమ్యనాథస్వామి mastyavataram


 

నందలూరు శ్రీ సౌమ్యనాథస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో రెండో రోజు గురువారం ఉదయం తిరుచ్చిపై మత్స్యావతారంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ సౌమ్యనాథస్వామివారు గ్రామ వీధుల్లో విహరిస్తూ భక్తులకు దివ్య మంగళ దర్శనమిచ్చారు.

"విష్ణుమూర్తి ప్రథమావతారమైన మత్స్యావతార వైభవంలో" కొలువుదీరిన స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. భక్తుల గోవింద నామస్మరణ, చెక్కభజనలు, కోలాటాలు, మంగళవాయిద్యాల నడుమ సాగిన వాహనసేవ ఆధ్యాత్మిక పరవశాన్ని నింపింది. అడుగడుగునా భక్తులు కర్పూరహారతులు సమర్పించి స్వామివారి అనుగ్రహాన్ని పొందారు.

ఈ వాహనసేవలో ఆలయ సూపరింటెండెంట్ శ్రీ హనుమంతయ్య, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ దిలీప్, ఆలయ అర్చకులు, అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

No comments :
Write comments