- జూలై 03, 10, 17, 24, 31వ తేదీలలో శుక్రవారం సందర్భంగా సాయంత్రం 6 గంటలకు తిరుచ్చిపై అమ్మవారు ఆలయ నాలుగు మాడ వీధులలో విహరించి భక్తులకు దర్శనమివ్వనున్నారు.
శ్రీబలరామకృష్ణస్వామివారిఆలయంలో ..
- జూలై 12న రోహిణి నక్షత్రం సందర్బంగా శ్రీ కృష్ణ స్వామివారికి సాయంత్రం 6 గంటలకు తిరుచ్చి ఉత్సవం జరుగనుంది.
శ్రీసుందరరాజస్వామిఆలయంలో..
- జూలై 5 నుండి 7వ తేదీ వరకు శ్రీ సుందరరాజస్వామివారి అవతారోత్సవాలు.
- జూలై 29న ఉత్తర భద్ర నక్షత్రం సందర్భంగా సాయంత్రం 6 గంటలకు స్వామివారు తిరుచ్చిపై ఆలయ నాలుగు మాడ వీధులలో విహరించి అనుగ్రహించనున్నారు.
శ్రీసూర్యనారాయణస్వామిఆలయంలో...
- జూలై 17న దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభం సందర్భంగా సాయంత్రం 5 గంటలకు స్వామివారు తిరుచ్చిపై భక్తులకు దర్శనమివ్వనున్నారు.
- జూలై 20న హస్త నక్షత్రం సందర్భంగా సాయంత్రం 5 గంటలకు స్వామివారు తిరుచ్చిపై భక్తులను కటాక్షించనున్నారు.
తిరుచానూరుశ్రీనివాసఆలయం...
ఆగస్టు 4, 11, 18, 25వ తేదీలలో వేంకటేశ్వరస్వామివారి మూలవర్లకు అభిషేకం.
No comments :
Write comments