4.8.26

ఆగస్టు 7న శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో వైభవంగా ఆడికృత్తిక ఉత్సవం aadi krutika festival




తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో ఆగస్టు 7 తేదీన ఆడికృత్తిక పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వారికి విశేష ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించనున్నారు.

ఈ సందర్భంగా ఉదయం 9.30 గంటల నుండి 10.30 గంటల వరకు ఉత్సవమూర్తులకు శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. పాలు, పెరుగు, తేనె, చందనం తదితర సుగంధ ద్రవ్యాలతో అభిషేకం జరిపి విశేష పూజలు నిర్వహిస్తారు.

అనంతరం సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారి తిరువీధి ఉత్సవం వైభవంగా జరుగుతుంది. ఈ సందర్భంగా అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి కృపాకటాక్షాలు పొందాలని టీటీడీ అధికారులు కోరారు.

No comments :
Write comments