15.8.26

శ్రీ గోవింద‌రాజ‌స్వామివారి ఆల‌యంలో ఘనంగా శ్రీ ఆండాళ్ అమ్మ‌వారి శాత్తుమొర‌ sattumora







తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో శ్రీ ఆండాళ్‌ అమ్మవారి తిరువడిపురం ఉత్సవం ముగింపు సంద‌ర్భంగా శుక్రవారం ఘ‌నంగా శాత్తుమొర జ‌రిగింది.


ఇందులోభాగంగా ఉదయం శ్రీ గోవిందరాజ స్వామివారు, శ్రీ ఆండాళ్‌ అమ్మవారి ఉత్సవమూర్తులకు స్నపనతిరుమంజనం నిర్వహించారు. సాయంత్రం 4 నుండి రాత్రి 8 గంటల వరకు శ్రీ గోవిందరాజస్వామివారు, శ్రీ ఆండాళ్‌ అమ్మవారిని అలిపిరికి ఊరేగింపుగా తీసుకెళ్లి అక్కడ ఆస్థానం నిర్వహించారు. అనంతరం అలిపిరి నుండి గీతామందిరం, రామనగర్‌ క్వార్టర్స్‌, వైఖానసాచార్యుల వారి ఆలయం, ఆర్‌ఎస్‌ మాడ వీధి, చిన్నజీయర్‌ మఠం మీదుగా ఊరేగింపు తిరిగి ఆలయానికి చేరుకుంది.

 

కార్య‌క్ర‌మంలో  ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీమతి వి.ఆర్.శాంతి,  ఏఈవో శ్రీ   బీ నారాయణ చౌదరి, ఆలయ అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు  పాల్గొన్నారు.

No comments :
Write comments