ఆగస్టు
15న నిర్వహించే భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు టీటీడీ సిద్ధమయింది. తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనం ప్రాంగణంలో గల పరేడ్ మైదానంలో వేదికను అందంగా ముస్తాబు చేశారు.శనివారం ఉదయం 8.30 గంటలకు ఈ వేడుకలు ప్రారంభమవుతాయి.
జెండా వందనం అనంతరం టీటీడీ ఛైర్మన్ శ్రీ బీఆర్ నాయుడు ఉద్యోగులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఆ తరువాత విధుల్లో ఉత్తమ సేవలు అందించిన వివిధ విభాగాలకు చెందిన ఉద్యోగులకు 5 గ్రాముల వెండి డాలర్, ప్రశంసాపత్రాలు అందజేస్తారు.
చివరగా టీటీడీ విద్యాసంస్థల విద్యార్థులు, ఉద్యోగుల పిల్లలు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శిస్తారు.
No comments :
Write comments