15.7.26

TTD RECEIVES DONATIONS OF RS. 60.61 LAKHS


The Sri Venkateswara Annaprasadam Trust of TTD received donations totalling Rs.60.61 lakhs on Tuesday.

The donations include Rs.10.50 lakhs from SSNR Projects Private Limited, Visakhapatnam, Rs.10 lakhs from devotee Sri Viswa C.V. Cherukuri, Rs.10 lakhs from Vanta Infracon Private Limited, Rs.10 lakhs from Vertex County LLP, Rs.10 lakhs from Sai Leela Electrical Projects Private Limited, Hyderabad, and Rs.10,11,116 from Sri Jonnalagadda Kiran Kumar of Thullur, Amaravati.

On behalf of the donors, TTD Board Member Sri Nannapaneni Sadasiva Rao handed over the donation DDs to TTD Chairman Sri B.R. Naidu at the Chairman's Camp Office in Tirumala.

TTD Board Members Smt. Panabaka Lakshmi, Sri Jasti Poorna Sambasiva Rao, SAAP Chairman Sri Ravi Naidu, and others were also present.

టీటీడీకి రూ.60.61 లక్షలు విరాళం donation


టీటీడీ అన్న ప్రసాదం ట్రస్టుకు మంగళవారం రూ.60.61 లక్షలు విరాళంగా అందింది.

ఈ మేరకు వైజాగ్ కు చెందిన ఎస్ఎస్ఎన్ఆర్ ప్రోజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ రూ.10.50 లక్షలు, శ్రీ విశ్వ సి.వి.చెరుకూరి అనే భక్తుడు రూ.10 లక్షలు, శ్రీ వంత ఇన్ ఫ్రా కాన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ రూ.10 లక్షలు, వెర్టెక్స్ కౌంటీ ఎల్ఎల్పీ సంస్థ రూ.10 లక్షలు, హైదరాబాద్ కు చెందిన శ్రీ సాయిలీల ఎలక్ట్రికల్ ప్రోజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ రూ.10 లక్షలు, అమరావతిలోని తుళ్లూరుకు చెందిన శ్రీ జొన్నలగడ్డ కిరణ్ కుమార్ రూ.10,11,116 విరాళంగా అందించారు.

ఈ మేరకు దాతల తరఫున టీటీడీ బోర్డు సభ్యులు శ్రీ నన్నపనేని సదాశివరావు తిరుమలలోని టీటీడీ చైర్మన్ క్యాంపు కార్యాలయంలో చైర్మన్ శ్రీ బీ.ఆర్.నాయుడుకు విరాళం డీడీలను అందజేశారు.

ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు శ్రీమతి పనబాక లక్ష్మి, శ్రీ జాస్తి పూర్ణ సాంబశివరావు, శాప్ చైర్మన్ శ్రీ రవి నాయుడు, తదితరులు పాల్గొన్నారు.

శ్రీ కోదండరామాలయంలో శాస్త్రోక్తంగా సహస్ర కలశాభిషేకం -రాత్రి వైభవంగా హనుమంత వాహనసేవ hanumth vahanam


తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో అమావాస్య, పునర్వసు నక్షత్రాన్ని పురస్కరించుకుని మంగళవారం శాస్త్రోక్తంగా సహస్ర కలశాభిషేకం నిర్వహించారు. ఉదయం 8.30 గంటలకు ప్రారంభమైన సేవలో వేదమంత్రోచ్ఛారణల నడుమ అర్చకులు వైఖానస ఆగమ విధానంలో స్వామివారికి అభిషేకం నిర్వహించగా, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని దివ్యానుభూతిని పొందారు.

ఈ సందర్భంగా ఆలయంలో రాత్రి 7 గంటల నుండి 9 గంటల వరకు హనుమంత వాహనసేవ వైభవంగా జరగనుంది. సర్వాలంకార భూషితులైన శ్రీ కోదండరామస్వామివారు తనకు అత్యంత ప్రీతిపాత్రమైన హనుమంత వాహనాన్ని అధిష్ఠించి ఆలయ నాలుగు మాడవీధుల్లో విహరిస్తూ భక్తులకు దివ్య దర్శనం ప్రసాదించనున్నారు.

వైఖానస ఆగమ శాస్త్రం ప్రకారం పౌర్ణమి, అమావాస్య, శుక్ల ఏకాదశి, కృష్ణ ఏకాదశి, శ్రవణం, పునర్వసు నక్షత్ర దినాలు వైష్ణవ ఆలయాల్లో అత్యంత విశిష్టమైనవిగా భావిస్తారు.

వైభవంగా శ్రీ సీతారాముల కల్యాణం

పునర్వసు నక్షత్రాన్ని పురస్కరించుకుని ఆలయంలో ప్రతినెలా నిర్వహించే శ్రీ సీతారాముల కల్యాణోత్సవం మంగళవారం భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా జరిగింది. ఉదయం 11 గంటలకు కల్యాణ మండపంలో ప్రారంభమైన ఈ మహోత్సవాన్ని అర్చకులు వేదమంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ శాస్త్రోక్తంగా నిర్వహించారు.

కల్యాణోత్సవంలో పాల్గొన్న గృహస్త దంపతులకు ఉత్తరీయం, రవికె, అన్నప్రసాదాన్ని బహుమానంగా అందజేశారు.

ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో శ్రీమతి నాగరత్న, సూపరింటెండెంట్ శ్రీ శ్రీనివాసులు రెడ్డి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ సురేష్, ఆలయ అర్చకులు, అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

Koil Alwar Tirumanjanam in View of Annual Budget Fest Held






On the occasion of the annual Salakatla Anivara Asthanam, scheduled to be observed on July 17, the sacred Koil Alwar Tirumanjanam was performed in accordance with the Agama traditions at the Sri Venkateswara Temple in Tirumala on Tuesday.

Speaking to the media outside the temple, the TTD Executive Officer Sri Muddada Ravichandra, along with Additional EO Sri Ch. Venkaiah Chowdary, said that Koil Alwar Tiirumanjanam is traditionally conducted four times a year—prior to Ugadi, Anivara Asthanam, Brahmotsavams, and Vaikuntha Ekadasi. 

As part of this ritual, the temple premises from Ananda Nilayam to the Bangaru Vakili, including the sub-shrines, temple courtyard, Potu, walls, roof, and puja articles, are thoroughly cleansed with water.

The presiding deity was completely covered with a cloth during the purification process.

After the cleansing, the entire temple was sprinkled with a sacred aromatic mixture.

Thereafter, the veil was removed, and the temple priests performed special pujas and Naivedyam and resumed Darshan to devotees.

In view of the ceremony, the Ashtadala Padapadmaradhana Seva was cancelled for the day.

Among those present includes TTD JEO Dr. A. Sharath, CVSO Sri Muralikrishna, temple Deputy EO Sri Lokanatham, several TTD Board Members, and other officials. 

Donation of ₹50 Lakh to TTD Trusts




Brinda Neuro Centre of Guntur donated Rs.10,00,116 each to the Sri Venkateswara Annaprasadam Trust, Sri Venkateswara Pranadana Trust, and SV BIRRD Trust on Tuesday.

On behalf of the institution, Dr. Hanuma Srinivasa Reddy and Mr. Siddhartha presented the demand drafts to TTD Executive Officer Sri Muddada Ravichandra at the Ranganayakula Mandapam in the Sri Venkateswara Temple.

Similarly, Sri Sripathi Srinivas and Sri Kotaru Sunil of Bengaluru donated Rs.10,00,116 to the Sri Venkateswara Annaprasadam Trust, while Sri Chagarlamudi Seetharamaiah of Visakhapatnam donated Rs.10,00,116 to the SV BIRRD Trust.

On their behalf, TTD Board Member Sri Nannapaneni Sadasiva Rao handed over the demand drafts to TTD Executive Officer Sri Muddada Ravichandra at the Ranganayakula Mandapam in the Sri Venkateswara Temple.

టీటీడీకి రూ.50 ల‌క్ష‌లు విరాళం donation




గుంటూరుకు చెందిన బృందా న్యూరో సెంట‌ర్ మంగ‌ళ‌వారం ఉద‌యం టీటీడీ శ్రీ‌వేంక‌టేశ్వ‌ర అన్న‌ప్ర‌సాదం ట్ర‌స్టుకు రూ.10,00,116, శ్రీ‌వేంక‌టేశ్వ‌ర ప్రాణ‌దాన ట్ర‌స్టుకు రూ.10,00,116, బ‌ర్డ్ ట్ర‌స్టుకు రూ.10,00,116 విరాళంగా అందించింది. మేర‌కు సంస్థ అధినేత‌లు డాక్ట‌ర్ హ‌నుమ శ్రీ‌నివాస రెడ్డి, సిద్ధార్థ లు శ్రీ‌వారి ఆల‌యంలోని రంగ నాయ‌కుల మండ‌పంలో టీటీడీ ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్రకు విరాళం డీడీల‌ను అంద‌జేశారు.

అదేవిధంగా బెంగుళూరుకు చెందిన శ్రీ శ్రీ‌ప‌తి శ్రీ‌నివాస్‌, కొటారు సునీల్ లు శ్రీ వేంక‌టేశ్వ‌ర అన్న ప్ర‌సాదం ట్ర‌స్టుకు రూ.10,00,116 విరాళంగా అందించగా, విశాఖపట్నంకు చెందిన శ్రీ చాగర్లమూడి సీతారామయ్య టీటీడీ బర్డ్ ట్రస్టుకు రూ.10,00,116 విరాళంగా అందించారు. వీరి తరఫున టీటీడీ బోర్డు సభ్యులు శ్రీ నన్నపనేని సదాశివరావు శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్రకు విరాళం డీడీలను అందజేశారు.

14.7.26

₹4.41 Cr to TTD BIRRD Trust




Hyderabad-based RS Brothers Retail India Limited on Monday donated Rs.4.41 crore to the TTD-run BIRRD Trust.


The donation DDs were handed over by the company's Chairman, Sri Potti Venkateswarlu, and Directors Sri S. Rajamouli, Sri T. Prasada Rao, and Smt. Potti Malathi Lakshmi Kumari to TTD Chairman Sri B.R. Naidu and Additional EO Sri Ch. Venkaiah Chowdary at the Ranganayakula Mandapam in the Srivari Temple.