భక్తులు ముందుగా తిరుమలలోని కేంద్రీయ విచారణ కార్యాలయం (సీఆర్వో) వద్ద రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఉదయం 5 గంటల నుండి సీఆర్వో కార్యాలయం తెరుచుకుంటుంది. గదుల అందుబాటులో ఉన్నంత వరకు సులభంగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
భక్తులు క్యూలైన్ లో నిలబడి తమ వంతు వచ్చిన తర్వాత రిజిస్ట్రేషన్ కౌంటర్ వద్ద తమ ఒరిజినల్ ఆధార్ కార్డు లేదా జిరాక్స్ కాపీని తీసుకెళ్లి ఫోన్ నెంబర్ వివరాలు తెలియజేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్ ద్వారా రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది. కౌంటర్ వద్ద రెండు కేటగిరీలకు సంబంధించిన గదుల్లో తమకు నచ్చిన కేటగిరీని ఎంచుకోవచ్చు.
A కేటగిరీలో రూ.50, రూ.100 గదులు & B కేటగిరీలో రూ.1000 గదులు ఉంటాయి. ఈ ప్రక్రియ పూర్తి కాగానే భక్తులకు ఒక అక్నాలెడ్జ్మెంట్ స్లిప్ కేటాయించబడుతుంది. క్యూలైన్ల వద్ద భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా తాగునీరు, అన్న ప్రసాదం, మరుగుదొడ్లు వంటి సదుపాయాలు అందుబాటులో ఉంటాయి.
గదులకోసంమార్గదర్శకాలు
• గదులు పొందడానికి 21 సంవత్సరాల వయస్సు నిండి ఉండాలి.
• ఒకసారి గదిని పొందిన వ్యక్తి 30 రోజుల వరకు తిరిగి గదిని పొందలేరు.
• ఒక కుటుంబం నుండి ఒక వ్యక్తి మాత్రమే క్యూ లైన్ లోకి రావాలి.
• ఒంటరి వ్యక్తికి లేదా అవివాహితులకు గదులు కేటాయించబడవు.
రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి అయిన తర్వాత సీఆర్వో వద్ద ఉన్న డిస్ప్లే బోర్డులలో వరుస క్రమంలో రిజిస్ట్రేషన్ సంఖ్య కనిపిస్తుంది. తమ క్రమ సంఖ్య కనిపించిన 15 నిమిషాలలోపు తమ సెల్ ఫోన్ కు కేటాయించిన గదికి సంబంధించిన సమాచారం మెసేజ్ రూపంలో అందుతుంది.
ఒకవేళ డిస్ప్లే బోర్డుల్లో తమ రిజిస్ట్రేషన్ క్రమ సంఖ్య వచ్చినప్పటికీ మెసేజ్ రాకపోతే సీఆర్వో వద్ద ఏర్పాటు చేసి కీయోస్క్ మిషన్లలో తమ స్లిప్ స్కాన్ చేస్తే తమకు కేటాయించిన గది వివరాలు చూపిస్తుంది.
అనంతరం భక్తులు వారికి గది కేటాయించిన ప్రాంతంలోని ఉప విచారణ కార్యాలయాలకు చేరుకుని గదికి సంబంధించిన రుసుమును ఆన్ లైన్ (ఫోన్ పే/ గూగుల్ పే/యూపీఐ/క్రెడిట్ కార్డు/డెబిట్ కార్డు ద్వారా మాత్రమే చెల్లించి తాళాలు తీసుకోవాల్సి ఉంటుంది.
తిరుమలలోనిఉపవిచారణకార్యాలయాలవివరాలు
• అంజనాద్రి నగర్ కాటేజస్. (ANC)
• శ్రేషాద్రి నగర్ కాటేజస్. (SNC)
• శంఖుమిట్ట కాటేజస్. (SMC)
• గరుడాద్రి నగర్ కాటేజస్. (GNC)
• హిల్ వ్యూ కాటేజస్. (HVC)
• సుదర్శన సత్రం. (1NC)
• గోవర్ధన్ సత్రం. (2NC)
• కళ్యాణి సత్రం. (3NC)
• సప్తగిరి విశ్రాంతి గృహం. (SPRH)
• రామ్ భగిచా విశ్రాంతి గృహం-2. (RBRH-2)
• వరాహ స్వామి విశ్రాంతి గృహం -1. (VSRH-1)
• వరాహ స్వామి విశ్రాంతి గృహం -2. (VSRH-2)
• అష్ట వినాయక విశ్రాంతి గృహం. (AVSRH)
• కౌస్తుభం విశ్రాంతి గృహం. (KTBRH)
• పాంచజన్యం విశ్రాంతి గృహం. (PJMRH)
• మాతృశ్రీ వకుళామాత విశ్రాంతి గృహం. (MVRH)
• నందకం విశ్రాంతి గృహం. (NDKRH)
• సూరాపురం తోట (SPT)
గదులుపొందినభక్తులుతప్పనిసరిగాపాటించాల్సిననిబంధనలు
• గదులు 24 గంటలకు మాత్రమే కేటాయించబడతాయి. ఒకవేళ 24 గంటలు దాటితే టారీఫ్ 200 శాతం, 48 గంటలు దాటితే 400 శాతం పెరుగుతుంది.
• నీరు మరియు విద్యుత్ ను వృథా చేయరాదు.
• తిరుమలలో ప్లాస్టిక్ నీళ్ల బాటిళ్లను ఉపయోగించరాదు.
• జగ్గులు మరియు నీటి గ్లాసులను ఉపయోగించాలి మరియు వాటిని శుభ్రంగా ఉంచాలి.
• తడి మరియు పొడి చెత్తను వాటికి వేరువేరుగా కేటాయించిన చెత్త బుట్టలలో వేయాలి.
• భక్తులు వారి వస్తువులను వారే బాధ్యత వహించాలి.
• గదులు పొందిన భక్తుడు/భక్తురాలు మాత్రమే గది ఖాళీ చేయాల్సి ఉంటుంది. లేకుంటే కాషన్ డిపాజిట్ తిరిగి ఇవ్వబడదు.
• తమ గదిని వేరొకరికి ఇవ్వడం పూర్తిగా నిషిద్ధం. అలా చేస్తే కఠిన చర్యలు తీసుకోబడతాయి.
భక్తులు పై నిబంధనలను, సూచనలను పాటిస్తూ కలియుగ వైకుంఠమైన తిరుమల పవిత్రతను కాపాడుతూ టీటీడీకి సహకరించగలరని కోరడమైనది.
The three-day annual Sakshatkara Vaibhavotsavams at the Sri Kalyana Venkateswara Swamy Temple, Srinivasamangapuram, concluded with religious fervour on Sunday. On the final day, Lord Sri Kalyana Venkateswara Swamy, accompanied by Sridevi and Bhudevi, was taken in a grand Garuda Vahanam procession through the temple streets, blessing devotees.
The day's rituals began with Suprabhatam, followed by Thomala Seva, Koluvu, Panchanga Sravanam and Sahasranamarchana.
Later, Snapana Tirumanjanam was performed to the processional deities in the Kalyana Mandapam from 10 a.m. to 11 a.m. with milk, curd, honey, turmeric, sandalwood paste and tender coconut water. A large number of devotees participated in the sacred rituals.
The Unjal Seva was held in the evening, followed by the Garuda Vahanam procession at 7 p.m., which drew a large gathering of devotees and marked the grand conclusion of the annual festival.
Paruveta Utsavam on July 20
The Paruveta Utsavam will be celebrated on July 20 at the Paruveta Mandapam near Srivari Mettu from 11 a.m., followed by a special Asthanam.
Special Grade Deputy Executive Officer Smt. Varalakshmi, AEO Sri Gopinath, Superintendent Sri Raj Kumar, Temple Inspector Sri Muni Kumar, Arjitham Inspector Sri Dhana Sekhar, priests, officials and a large number of devotees participated in the festivities.
Two private artists engaged by the Hindu Dharma Prachara Parishad (HDPP), TTD, for a Harikatha programme at the TTD temple in Satravada on Sunday morning, Sri K. Chakravarthi (Violin) and Sri K. Nagaraju Chetty (Tabla), were killed in a tragic road accident near Vadamalapeta–Pudi Cross while travelling to perform their assigned devotional service.
Expressing deep concern over the incident, which occurred while the artists were on duty, TTD Chairman Sri B.R. Naidu, Executive Officer Sri Muddada Ravichandra, and Joint Executive Officer Dr. A. Sharath approved immediate humanitarian assistance to the bereaved families.
Accordingly, Rs. 25,000 has been provided to each family from HDPP funds towards funeral expenses. In addition, Rs. 5 lakh ex gratia has been sanctioned to each bereaved family.
TTD has also decided to provide free education up to the degree level in TTD educational institutions for the children of the deceased artists, if eligible.
These humanitarian measures will be placed before the TTD Board for ratification.
విధుల్లో భాగంగా ఈ విషాదం చోటుచేసుకోవడంతో టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ బి.ఆర్. నాయుడు, కార్యనిర్వహణాధికారి శ్రీ ముద్దాడ రవిచంద్ర, సంయుక్త కార్యనిర్వహణాధికారి డా. ఎ. శరత్ మానవతా దృక్పథంతో వారి కుటుంబాలకు తక్షణ సహాయం అందించాలని ప్రత్యేక నిర్ణయాలు తీసుకున్నారు.
ఈ మేరకు, మరణించిన ప్రతి కళాకారుడి కుటుంబానికి అంత్యక్రియల ఖర్చుల నిమిత్తం హెచ్‌డిపిపి నిధి నుంచి రూ.25 వేల చొప్పున తక్షణ ఆర్థిక సహాయాన్ని మృతుల కుటుంబసభ్యులకు హెచ్‌డిపిపి కార్యదర్శి డా. మేడసాని మోహన్ అందజేశారు.
అదేవిధంగా, దివంగత శ్రీ కె. చక్రవర్తి, శ్రీ కె. నాగరాజుచెట్టి కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ఆర్థిక సహాయం మంజూరు చేశారు.
మరణించిన కళాకారులకు పిల్లలు ఉన్నట్లయితే, వారికి టీటీడీ విద్యాసంస్థల్లో డిగ్రీ స్థాయి వరకు పూర్తిగా ఉచిత విద్య కల్పించాలని కూడా నిర్ణయించారు.
విధుల్లో భాగంగా జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన ఇరువురికి టిటిడి పాలకమండలి మానవతా దృక్పథంతో సాయం అందించింది.