29.7.26

శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో మహాపూర్ణాహుతితో వైభవంగా ముగిసిన పవిత్రోత్సవాలు sri kapileswara swmay vari temple








తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో మూడు రోజుల పాటు అత్యంత వైభవంగా నిర్వహించిన వార్షిక పవిత్రోత్సవాలు మంగళవారం మహాపూర్ణాహుతితో శాస్త్రోక్తంగా ముగిశాయి. వేద మంత్రోచ్చారణల నడుమ భక్తిపారవశ్య వాతావరణంలో నిర్వహించిన మహోత్సవాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

ఉదయం యాగశాల పూజ, హోమం, మహాపూర్ణాహుతి, కలశోద్ధ్వాసన, మూలవర్లకు కలశాభిషేకం, పట్టుపవిత్ర సమర్పణ తదితర విశిష్ట ఆగమ కార్యక్రమాలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు.

సాయంత్రం పంచమూర్తులైన శ్రీ సోమస్కందమూర్తి, శ్రీ కామాక్షి అమ్మవారు, శ్రీ విఘ్నేశ్వరస్వామి, వళ్లి–దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యస్వామి, శ్రీ చండికేశ్వరస్వామివారు ఆలయ మాడ వీధుల్లో భక్తులకు దివ్య దర్శనమిస్తూ ఊరేగి అనుగ్రహించారు. 

ఈ సందర్భంగా ఆలయం గోవిందనామస్మరణ, మంగళవాయిద్యాలు, వేదఘోషలతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.

పవిత్రోత్సవాల్లో పాల్గొన్న భక్తులకు పవిత్రమాలలు, తీర్థప్రసాదాలను ఆలయ అధికారులు అందజేశారు.

ఈ కార్యక్రమంలో టీటీడీ జేఈవో డా. ఎ. శరత్, ఆలయ డిప్యూటీ ఈవో శ్రీమతి నాగరత్న, సూపరింటెండెంట్ శ్రీ చంద్రశేఖర్, ఆలయ అర్చకులు, అధికారులు, సిబ్బంది, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

SRI SOUMYANATHA SWAMY KALYANOTSAVAM PERFORMED WITH GRANDEUR AT NANDALUR



Divine celestial wedding of Sri Soumyanatha Swamy with Sridevi and Bhudevi conducted as per Agama traditions for the welfare of the world

The annual Brahmotsavams of Sri Soumyanatha Swamy at Nandalur witnessed the grand Kalyanotsavam of Sri Soumyanatha Swamy with Sridevi and Bhudevi on Tuesday morning, the seventh day of the festival. The sacred ceremony was performed amidst Vedic chanting and attracted a large number of devotees.

The Utsava deities were ceremoniously brought to the Kalyana Mandapam at 10 a.m. accompanied by traditional temple music. Priests then performed the rituals as per Agama traditions, including Vishvaksena Aradhana, Punyahavachanam, Kankana Dharana, Agni Pratishtha, Yajamana Sankalpam, Bhakta Sankalpam, Maha Sankalpam and Mangalasutra Dharana, amid the chanting of Vedic hymns.

The divine ceremony concluded with Nakshatra Harati and Mangala Harati. Devotees who witnessed the celestial wedding chanted "Govinda... Govinda..." and received the blessings of the divine couple.

Temple Deputy Executive Officer Smt. Prashanthi, AEO Sri Ravi, Superintendent Sri Hanumanthaiah, Temple Inspector Sri Rajesh, temple priests, officials, staff and a large number of devotees participated in the programme.

నందలూరులో వైభవంగా శ్రీ సౌమ్యనాథస్వామివారి కల్యాణోత్సవం nandaluru


నందలూరులోని శ్రీ సౌమ్యనాథస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో ఏడవ రోజైన మంగళవారం ఉదయం శ్రీదేవి, భూదేవి మేత శ్రీ సౌమ్యనాథస్వామివారి దివ్య కల్యాణోత్సవం అత్యంత వైభవంగా, వేదఘోషల మధ్య ఘనంగా జరిగింది. స్వామివారి దివ్య కల్యాణాన్ని తిలకించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి భక్తిపారవశ్యంలో మునిగిపోయారు.

ఉదయం 10 గంటలకు ఉత్సవమూర్తులను కల్యాణ మండపానికి మంగళవాయిద్యాల నడుమ వేద పండితులు వేంచేపు చేశారు. అనంతరం అర్చకులు వేదమంత్రోచ్ఛారణల మధ్య విష్వక్సేనారాధన, పుణ్యాహవాచనం, కంకణధారణ, అగ్నిప్రతిష్ఠాపన, యజమాని సంకల్పం, భక్త సంకల్పం, మహాసంకల్పం, మంగళసూత్రధారణ తదితర శాస్త్రోక్త క్రతువులను అత్యంత వైదిక సంప్రదాయబద్ధంగా నిర్వహించారు.

అనంతరం నక్షత్రహారతి, మంగళహారతులతో దివ్య కల్యాణ మహోత్సవం ఘనంగా ముగిసింది.

స్వామివారి కల్యాణ మహోత్సవాన్ని ప్రత్యక్షంగా దర్శించిన భక్తులు "గోవింద... గోవింద..." నామస్మరణలతో ఆలయ ప్రాంగణాన్ని మార్మోగించి, స్వామివారి అనుగ్రహాన్ని పొందారు.

ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో శ్రీమతి ప్రశాంతి, ఏఈఓ శ్రీ రవి, సూపరింటెండెంట్ శ్రీ హనుమంతయ్య, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ రాజేష్, ఆలయ అర్చకులు, అధికారులు, సిబ్బంది, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

Health Condition of SV Ayurvedic College Students Stable




TTD Joint Executive Officer Dr. A. Sharath said that the health condition of the students of SV Ayurvedic College, Tirupati, is stable after they were provided with prompt medical care following mild health complaints.

On Tuesday afternoon, the JEO visited the TTD Central Hospital, interacted with the students undergoing treatment, reviewed the medical care being provided and enquired about their health. He also instructed the doctors to ensure the best possible medical care.

Among the affected students, there were 20 girls and 8 boys. Of them, 17 girls and three boys were shifted to the TTD Central Hospital by ambulance.

Twenty students who developed symptoms such as diarrhoea, nausea and mild abdominal pain were given immediate treatment under the supervision of the Chief Medical Officer. They responded well to the treatment and were discharged after doctors confirmed that their condition was stable.

After discharge, the students returned to their hostels and had lunch.

According to the final medical report, all the affected students are safe, healthy and in stable condition.

ఎస్‌వీ ఆయుర్వేద కళాశాల విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది sv ayurveda college




తిరుపతిలోని ఎస్‌వీ ఆయుర్వేద కళాశాల బాలురు, బాలికల వసతి గృహాలకు చెందిన కొందరు విద్యార్థులకు స్వల్ప అస్వస్థత లక్షణాలు కనిపించడంతో వెంటనే వైద్య చికిత్స అందించి, వారి ఆరోగ్య పరిస్థితిని పూర్తిగా నిలకడలోకి తీసుకువచ్చినట్లు టిటిడి జేఈవో డా. . శరత్ తెలిపారు.

ఈ నేపథ్యంలో మంగళవారం మధ్యాహ్నం టీటీడీ సెంట్రల్ ఆసుపత్రిని సందర్శించిన జేఈవో, చికిత్స పొందుతున్న విద్యార్థులను స్వయంగా పరామర్శించి వారికి అందుతున్న వైద్య సేవలను పరిశీలించారు. వైద్యులతో మాట్లాడి విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై వివరాలు తెలుసుకుని, అవసరమైన సూచనలు చేశారు.

అస్వస్థతకు గురైన విద్యార్థుల్లో 20 మంది బాలికలు, 8 మంది బాలురు ఉండగా, వారిలో 17 మంది బాలికలు, ముగ్గురు బాలురను అంబులెన్స్ ద్వారా టీటీడీ సెంట్రల్ ఆసుపత్రికి తరలించారు.

విరేచనాలు, వికారం, స్వల్ప కడుపు నొప్పి వంటి లక్షణాలతో బాధపడుతున్న 20 మంది విద్యార్థులకు ముఖ్య వైద్యాధికారి పర్యవేక్షణలో తక్షణమే అవసరమైన వైద్య చికిత్స అందించారు. చికిత్సకు విద్యార్థులందరూ సానుకూలంగా స్పందించగా, వారి ఆరోగ్య పరిస్థితి పూర్తిగా నిలకడగా ఉండటంతో వైద్యుల సూచన మేరకు డిశ్చార్జ్ చేశారు. 

అనంతరం వారు తిరిగి వసతి గృహాలకు చేరుకుని భోజనం చేశారు.

తుది వైద్య నివేదిక ప్రకారం అస్వస్థతకు గురైన విద్యార్థులందరూ ప్రస్తుతం సురక్షితంగా, సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు.