30.7.26

నకిలీ వెబ్‌సైట్‌పై అప్రమత్తంగా ఉండాలి సదరు వెబ్సైట్ నిర్వాహకులపై పోలీసులకు ఫిర్యాదు fake websites


సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న "ttddevasthanam.online" అనే నకిలీ వెబ్‌సైట్‌ను టీటీడీ విజిలెన్స్ విభాగం గుర్తించింది. వెబ్‌సైట్  టీటీడీ అధికారిక ఆన్‌లైన్ సేవలను పోలి ఉండేలా రూపొందించిన కొందరు వ్యక్తులు భక్తులను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు.

టీటీడీ అధికారిక వెబ్‌సైట్‌ను పోలి ఉండేలా, కేవలం డొమైన్ పేరులో స్వల్ప మార్పులతో ఈ నకిలీ వెబ్‌సైట్ రూపొందించారు. ఇందులో ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలలకు శ్రీవారి దర్శనం, సేవా టికెట్లు అందుబాటులో ఉన్నట్లు తప్పుడు సమాచారం ప్రదర్శిస్తున్నారు.

దర్శన టికెట్ల పేరుతో భక్తుల నుంచి నగదు వసూలు చేయడం ద్వారా వారిని మోసం చేయడంతో పాటు, టీటీడీ ప్రతిష్ఠను దెబ్బతీయడమే ఈ నకిలీ వెబ్‌సైట్ ఉద్దేశం.

ఈ నకిలీ వెబ్‌సైట్‌ను వెంటనే తొలగించాలని సంబంధిత డొమైన్ ప్లాట్‌ఫారమ్ నిర్వాహకులకు టీటీడీ ఇప్పటికే ఫిర్యాదు చేసింది. అలాగే ఈ ఘటనపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని తిరుమల టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడం జరుగుతోంది. అంతేకాకుండా భవిష్యత్తులో కూడా భక్తులను మోసం చేసే వారిపైచట్టపరంగా  కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలుయజేయడమైనది .

టీటీడీ సేవలు, దర్శనం, వసతి, ఆన్‌లైన్ టికెట్లకు సంబంధించి భక్తులు అధికారిక టీటీడీ వెబ్‌సైట్ మరియు అధికారిక మొబైల్ యాప్ ద్వారా మాత్రమే బుకింగ్‌లు చేసుకోవాలని భక్తులకు విజ్ఞప్తి చేయడమైనది. సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న అనధికారిక వెబ్‌సైట్లు, లింకులను నమ్మి మోసపోవద్దని కోరడమైనది.

గోవిందనామ స్మరణతో ఆధ్యాత్మిక వైభవంగా శ్రీ సౌమ్యనాథ స్వామివారి రథోత్సవం radhtotsavam





నందలూరులోని శ్రీ సౌమ్యనాథస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం ఉదయం నిర్వహించిన శ్రీ సౌమ్యనాథ స్వామివారి రథోత్సవం గోవిందనామ స్మరణలు, వేదఘోషలు, భజనల నడుమ అత్యంత వైభవంగా జరిగింది.

ఉదయం 9 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ సౌమ్యనాథ స్వామివారు దివ్య రథాన్ని అధిష్ఠించి గ్రామ వీధుల్లో భక్తులకు అభయప్రదంగా దర్శనమిచ్చారు. డప్పు వాయిద్యాలు, భజన బృందాల సంకీర్తనలు, కోలాటాల నృత్యాలతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక వాతావరణంతో నిండిపోయాయి. భక్తులు "గోవింద... గోవింద..." నామస్మరణలతో రథాన్ని లాగుతూ భక్తిశ్రద్ధలతో కర్పూర నీరాజనాలు సమర్పించారు. గ్రామ వీధుల్లో విహరించిన రథం యథాస్థానానికి చేరుకున్న అనంతరం ప్రబంధ పారాయణం, వేద శాత్తుమొర నిర్వహించి మహామంగళహారతి సమర్పించారు.

రథోత్సవం ఆత్మజ్ఞానానికి ప్రతీకగా నిలుస్తుంది. ఆత్మ రథికుడు, శరీరమే రథం, బుద్ధి సారథి, మనస్సు పగ్గం, ఇంద్రియాలే గుర్రాలు, విషయాలే వీధులు అనే ఆధ్యాత్మిక సందేశాన్ని ఈ ఉత్సవం ద్వారా భక్తులకు తెలియజేస్తారు. శరీరానికి, ఆత్మకు మధ్య ఉన్న భేదాన్ని గ్రహించి ఆత్మానాత్మ వివేకాన్ని పెంపొందించుకోవడమే రథోత్సవం అంతరార్థం.

అనంతరం బుధవారం రాత్రి 7 గంటలకు శ్రీ సౌమ్యనాథ స్వామివారి అశ్వవాహన సేవ వైభవంగా నిర్వహించనున్నారు.

ఈ రథోత్సవంలో స్థానిక ఎమ్మెల్యే శ్రీ ఆకేపాటి అమర్‌నాథ రెడ్డి, ఈఈ శ్రీమతి సుమతి, ఏఈవో శ్రీ రవి, సూపరింటెండెంట్ శ్రీ హనుమంతయ్య, ఏఈలు శ్రీ అమర్‌నాథరెడ్డి, శ్రీ దోరైరాజ్, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ దిలీప్‌తో పాటు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

జూలై 31 చక్రస్నానం

శ్రీ సౌమ్యనాథస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం ఉదయం 9.15 గంటల నుండి 10.30 గంటల వరకు చక్రస్నానం వైభవంగా నిర్వహించనున్నారు. అనంతరం రాత్రి 7 గంటలకు ధ్వజావరోహణంతో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగియనున్నాయి.

29.7.26

₹10 Lakhs Donation to TTD




A devotee from Hyderabad, Sri Venkata Ganesh Gangadhar Dasika, donated Rs.10 lakh to the TTD Sri Venkateswara Annaprasadam Trust on Tuesday.

The donor handed over the donation DD to TTD Chairman Sri B.R. Naidu.

SRI SOUMYANATHA SWAMY BLESSES DEVOTEES ON GAJA VAHANAM


As part of the annual Brahmotsavams at Sri Soumyanatha Swamy Temple, Nandaluru, the deity was taken in a grand Gaja Vahanam procession on Tuesday evening, blessing devotees.

The elephant mount symbolizes Omkara, the Universe, and divine protection, reminding devotees to overcome ego and seek the Lord's grace.

Temple AEO Sri Ravi, Superintendent Sri Hanumanthaiah, Temple Inspector Sri Rajesh, priests, officials, and a large number of devotees participated.

TTD Contemplating Promote Srivari Seva at Village Level - TTD EO





TTD is intensifying efforts to expand Srivari Seva from grassroot level across Andhra Pradesh and Telangana, asserted TTD Executive Officer Sri M Ravichandra. 

The EO made this statement while gracing the second phase of the Group Supervisors’ Training programme held om Tuesday at the Srivari Seva Sadan 2 in Tirumala.

In his interaction with Supervisors, he said the move follows directions from the Hon’ble Chief Minister of AP Sri N. Chandrababu Naidu to enhance quality and broaden access to devotional service. 

Highlighting that the two Telugu states host nearly 50,000 temples, he urged Group Supervisors and Srivari Sevakulu to identify and mobilize opportunities for providing seva at local temples and community shrines.

To strengthen service standards and ensure fair task allocation, TTD is developing a cibil score style rating system to assess  performance of Sevaks and assign duties accordingly. 

The EO emphasized that while many Sevaks travel to Tirumala to serve, the initiative aims to empower them to serve their home communities as well.

Group Supervisors shared suggestions during the session, and the EO sought practical recommendations from them for implementing the village‑level expansion of Srivari Seva and also some amendments required to enhance pilgrim facilities in Tirumala.

Later the EO also felicitated scholars Dr SLNT Srinivas and Sri Sharat for effectively executing all training sessions on the occasion.

The Chief PRO of TTD Dr. T. Ravi, PRO Kumari Neelima and staff of the Srivari Seva Sadan were also present.

జూలై 29న తిరుమలలో పౌర్ణమి గరుడ సేవ garuda seva




తిరుమలలో జూలై 29వ తేదిన పౌర్ణమి గరుడసేవ జరగనుంది.

తిరుమల, 2026 జూలై 28: బుధవారం రాత్రి 7 నుండి 9 గంట‌ల నడుమ సర్వాలంకార భూషితుడైన శ్రీ మలయప్పస్వామివారు సువర్ణకాంతులీనుతున్న గ‌రుడునిపై తిరుమాడ వీధులలో విహరిస్తూ భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.

PAVITHROTSAVAMS CONCLUDE WITH MAHA PURNAHUTHI AT SRI KAPILESWARA SWAMY TEMPLE



The three-day annual Pavitrotsavams at Sri Kapileswara Swamy Temple, Tirupati, concluded grandly on Tuesday with Maha Poornahuti, performed as per Agama traditions amidst Vedic chanting and a devotional atmosphere.

The rituals included Yagasala Puja, Homam, Maha Poornahuti, Kalasodvasanam, Kalasabhishekam to the presiding deity, and offering of Silk Pavitrams.

In the evening, the Pancha Murtis—Sri Somaskanda Murthy, Sri Kamakshi Ammavaru, Sri Vighneswara Swamy, Sri Subrahmanya Swamy with Valli and Devasena, and Sri Chandikeswara Swamy—were taken in a grand procession through the temple streets, blessing devotees.

Devotees who participated in the festival were presented with Pavitra Malas and Theertha Prasadam.

TTD JEO Dr. A. Sharath, Temple Deputy EO Smt. Nagaratna, Superintendent Sri Chandrasekhar, temple priests, officials, staff, and a large number of devotees participated in the concluding ceremony.